Post your question

 

  Asked By: MAREEDU

  Ans:

  No negative marks in Group 1  preliminary exam.

  Asked By: డి.బంధ్యానాయక్‌

  Ans:

  సాధారణంగా ప్రభుత్వరంగ సంస్థల్లో కంప్యూటర్‌ సైన్స్‌ బ్రాంచికి సంబంధించిన ఉద్యోగాలు, ఇతర ఇంజినీరింగ్‌ బ్రాంచీల ఉద్యోగాలకంటే తక్కువ సంఖ్యలో ఉంటాయి. ప్రముఖ ఐటీ కంపెనీలతో పోలిస్తే ప్రభుత్వరంగ సంస్థల్లో వేతనాలు, ప్రమోషన్‌లు కూడా తక్కువగానే ఉంటాయి. కంప్యూటర్‌ సైన్స్‌ చదివినవారు నెట్‌వర్క్‌ ఇంజినీర్, ఐటీ సపోర్ట్‌ స్పెషలిస్ట్, నెట్‌వర్క్‌ అడ్మినిస్ట్రేటర్, ఐటీ టెక్నీషియన్, వెబ్‌ డెవలపర్, సిస్టమ్స్‌ ప్రోగ్రామర్, సిస్టమ్స్‌ అనలిస్ట్, సిస్టమ్స్‌ మేనేజర్, సైబర్‌ సెక్యూరిటీ స్పెషలిస్ట్, డేటాబేస్‌ మేనేజర్, అప్లికేషన్‌ డెవలపర్, హార్డ్‌వేర్‌ ఇంజినీర్, సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ లాంటి ఉద్యోగాలు చేయవచ్చు. బీహెచ్‌ఈఎల్, బీఈఎల్, ఓఎన్‌జీసీ, హెచ్‌పీసీఎల్, ఈసీ‡ఐఎల్, ఎయిర్‌ పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, డీఆర్‌డిఓ, ఐఓసీ‡ఎల్, బీఎస్‌ఎన్‌ఎల్, సెయిల్, సి-డాక్, ఇస్రో, ఇండియన్‌ రైల్వేస్, బ్యాంకులు, యూనివర్సిటీలు, పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ల్లో కంప్యూటర్‌ సైన్స్‌ చదివినవారికి ఉద్యోగావకాశాలుంటాయి. మీకు బోధన రంగంపై ఆసక్తి ఉంటే పాలిటెక్నిక్‌ కాలేజీల్లో, కేంద్రీయ విద్యాలయాల్లో, నవోదయ పాఠశాలల్లో కూడా ప్రయత్నించవచ్చు. ఐటీ కంపెనీలతో పాటు రిలయన్స్, టాటా, ఆదిత్య బిర్లా, ఎల్‌ అండ్‌ టీ, ఐటీసీ, హిందుస్తాన్‌ యూనిలివర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బిగ్‌ బాస్కెట్, మింత్రా, స్నాప్‌ డీల్, పేటీఎం, ఇండియామార్ట్, ఈబే, బుక్‌ మై షో, మేక్‌ మై ట్రిప్, ఎయిర్‌టెల్, బజాజ్‌ లాంటి కార్పొరేట్‌ సంస్థల్లోనూ ఉద్యోగావకాశాలు లభిస్తాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: జయశ్రీ

  Ans:

  -  స్కాలస్టిక్‌ అసెస్‌మెంట్‌ టెస్ట్‌ (శాట్‌)ను కాలేజ్‌ బోర్డ్‌ నిర్వహిస్తుంది. అమెరికా, కెనడా, సింగపూర్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ కళాశాలల్లో అడ్మిషన్‌ తీసుకోవాలనుకునేవారు ఈ పరీక్ష రాయాలి. ఇంటర్మీడియట్‌/ 12 క్లాస్‌ పూర్తయినవారు ఈ పరీక్ష రాయవచ్చు.  శాట్‌లో రీడింగ్, రైటింగ్, మ్యాథ్స్‌ అనే మూడు విభాగాలుంటాయి. రీడింగ్‌లో లిటరేచర్, హిస్టారికల్‌ డాక్యుమెంట్స్, సోషల్‌ సైన్సెస్, నేచురల్‌ సైన్సెస్‌లో ప్యాసేజ్‌లు ఉంటాయి. రైటింగ్‌లో గ్రామర్, ఒకాబ్యులరీ, ఎడిటింగ్‌ మెలకువలు ఉంటాయి. మ్యాథ్స్‌ విషయానికొస్తే దీనిలో రెండు భాగాలుంటాయి. ఒకటి కాలిక్యులేటర్‌ ఉపయోగించి సమాధానాలు కనుగొనడం, మరొకటి కాలిక్యులేటర్‌ ఉపయోగించకుండా సమాధానాలు కనుగొనడం. మ్యాథ్స్‌ విభాగంలో ప్రశ్నలు ఆల్జీబ్రా, జ్యామెట్రీ, ట్రిగొనమెట్రీల నుంచి ఉంటాయి. శాట్‌ని ఒక సంవత్సరంలో ఆరు సార్లు నిర్వహిస్తారు. దీన్ని ఎన్నిసార్లు అయినా రాయవచ్చు. జేఈఈ మెయిన్స్, శాట్‌ అనేవి రెండు విభిన్నమైన పరీక్షలు. జేఈఈ మెయిన్స్‌లో మ్యాథ్స్‌ కంటే, శాట్‌లో మ్యాథ్స్‌ సులభంగానే ఉంటుంది. శాట్‌లో నెగెటివ్‌ మార్కులు లేవు. ముందునుంచే ప్రణాళికాబద్ధంగా సన్నద్ధమయితే శాట్‌లో మంచి స్కోరు తెచ్చుకోవడం కష్టమేమీ కాదు. -  ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: ఎన్‌.చైతన్య

  Ans:

  యూజీసీ ఇటీవల జారీ చేసిన రెగ్యులేషన్స్‌ ప్రకారం ఒకే సమయంలో ఒక డిగ్రీని రెగ్యులర్‌ పద్ధతిలో, మరో డిగ్రీని ఆన్‌లైన్‌/ డిస్టెన్స్‌/ ఓపెన్‌ పద్దతిలో చేయవచ్చు. కానీ బీఈడీ కోర్సు నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌సీటీఈ) నియంత్రణలో ఉన్నందువల్ల వారి మార్గదర్శకాలు అనుసరించవలసి ఉంటుంది. ఎన్‌సీటీఈ సంస్థ ఇప్పటివరకు డీ… ఈడీ/బీఈడీ/ ఎంఈడీలతో పాటు మరో డిగ్రీ చేయవచ్చనే విషయాన్ని చెప్పలేదు కాబట్టి, మీరు బీఈడీ పూర్తిచేసిన తరువాతే, ఎంఏ చదవండి. బీఈడీ ప్రొఫెషనల్‌ కోర్సు కాబట్టి, మీరు బీఈడీపై శ్రద్ధ పెట్టి, ఆ కోర్సులో సరైన శిక్షణ పొందండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: గాయత్రి

  Ans:

  మీరు నిరభ్యంతరంగా బీఈడీ కోర్సు చెయ్యొచ్చు. డిగ్రీలో మీరు తెలుగు, హిస్టరీ సబ్జెక్టులు చదివారు కాబట్టి, ఆ రెండు మెథడాలజీలతో బీఈడీ చేసే అవకాశం ఉంది. మీ ఐదు సంవత్సరాల డిగ్రీ కోర్సులో మొదటి రెండు సంవత్సరాలను పీడీసీ (ప్రీడిగ్రీ కోర్సు) అంటారు కాబట్టి, మీరు డీ…ఈడీ కూడా చేసే అవకాశం ఉంది. కాకపోతే, మీ పీడీసీ కోర్సును డీ…ఈఈసెట్‌ కమిటీ వారు ఇంటర్మీడియట్‌కు సమానమని నిర్ణయించాలి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌