Post your question

 

    Asked By: మిథున్ చౌహాన్

    Ans:

    ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరం పూర్తయ్యి, డిగ్రీ పట్టా మీ వద్ద ఉంటేనే టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్‌ పరీక్షలు రాయడానికి అర్హత ఉంటుంది.

    Asked By: లవకుమార్

    Ans:

    మీరు సంబంధిత తహసీల్దారు కార్యాలయాన్ని సంప్రదించి నివాస ధ్రువీకరణ పత్రాన్ని పొందవచ్చు.

    Asked By: ఉమా మహేశ్

    Ans:

    మీరు దరఖాస్తు చేసినప్పుడు ఏ సర్టిఫికెట్లనూ అప్‌లోడ్‌ చేయకపోయినా పర్వాలేదు. కానీ వెరిఫికేషన్‌ సమయంలో ఒరిజినల్‌ సర్టిఫికెట్లను చూపించాల్సి ఉంటుంది.

    Asked By: సంధ్య

    Ans:

    టీఎస్‌పీఎస్సీ మెంటల్‌ ఎబిలిటీ విభాగానికి సంబంధించి సమగ్ర సమాచారానికి సీ-సాట్‌ కోసం రూపొందించిన ఏదైనా ప్రామాణిక గ్రంథాన్ని అనుసరించి ప్రిపరేషన్‌ను కొనసాగించండి. మరికొన్ని వివరాల కోసం ఈ లింక్‌పై క్లిక్‌ చేయండి

    Asked By: కల్యాణ్

    Ans:

    ఇంటర్మీడియట్‌ పూర్తి చేసినవారు టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-4 పరీక్ష రాయడానికి అర్హులు.

    Asked By: Kundenaally

    Ans:

    ఎంఎస్సీ (కంప్యూటర్‌ సైన్స్‌) చదివినవారికి ప్రభుత్వ రంగంతో పోలిస్తే,  ప్రైవేటు రంగంలోనే ఉద్యోగావకాశాలు ఎక్కువ. ప్రైవేటు రంగంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్, సాఫ్ట్‌వేర్‌ డెవలపర్, సాఫ్ట్‌వేర్‌ క్వాలిటీ అనలిస్ట్, డేటా సైంటిస్ట్, సాఫ్ట్‌వేర్‌ వాలిడేషన్‌ ఇంజినీర్, సాఫ్ట్‌వేర్‌ టెస్ట్‌ ఇంజినీర్, టెక్నికల్‌ సపోర్ట్‌ ఇంజినీర్, ఐటీ సెక్యూరిటీ స్పెషలిస్ట్, ఐటీ ఆడిటర్, సిస్టమ్స్‌ ప్రోగ్రామర్, సిస్టమ్స్‌ మేనేజర్, సిస్టమ్స్‌ అనలిస్ట్‌ లాంటి ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి. ఎంఎస్సీ (కంప్యూటర్‌ సైన్స్‌)  అనేది ఒక డిగ్రీ మాత్రమే. డిగ్రీతో పాటు ప్రోగ్రామింగ్, కోడింగ్, ప్రాబ్లం సాల్వింగ్, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలూ చాలా అవసరం. ఇక ప్రభుత్వ రంగానికొస్తే వివిధ ప్రభుత్వరంగ అండర్‌ టేకింగ్‌ సంస్థలు, బ్యాంకులు, యూనివర్సిటీలు, ఎయిర్‌ పోర్ట్‌లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో పరిమిత సంఖ్యలో ఉద్యోగావకాశాలు ఉన్నాయి. పీజీ కంప్యూటర్‌ సైన్స్‌తోపాటు మరికొన్ని ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్, కోడింగ్‌ సంబంధిత కోర్సులు కూడా చేసి మీ నైపుణ్యాలను మెరుగుపర్చుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: ఒక అభ్యర్థి

    Ans:

    గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో నెగిటివ్‌ మార్కులు ఉండవు.