Post your question

 

    Asked By: శ్రీకాంత్‌

    Ans:

    పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యేప్పుడు నిర్ధారిత సిలబస్‌ కంటే ఎక్కువే చదవాలి. సాధారణంగా ఉద్యోగ నోటిఫికేషన్‌లో ఇచ్చే సిలబస్‌ విశాల పరిధిలో ఉంటుంది. కొన్నిసార్లు పరీక్షలో ఇచ్చే ప్రశ్నలు సిలబస్‌ పరిధి దాటినట్లు అనిపించినా సాంకేతికంగా నిరూపించడం కష్టమే. పదోతరగతి పాఠ్య పుస్తకాలు చదివి అర్థం చేసుకోవాలంటే, అందుకు సంబంధించిన ప్రాథమిక విషయాలు దిగువ తరగతుల్లో ఉంటాయి కాబట్టి, ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు మ్యాథ్స్, సైన్స్, సోషల్‌ పుస్తకాలు కూడా చదవండి. మీరు గ్రూప్‌-4 కు దరఖాస్తు చేసుకుంటే, ఆ సిలబస్‌ తోపాటు, అంతకంటే పై స్థాయి సిలబస్‌నూ చదవడం శ్రేయస్కరం. ఉదాహరణకు మెంటల్‌ ఎబిలిటీ సబ్జెక్ట్‌ సిలబస్‌లో డిగ్రీ, ఇంటర్, పదో తరగతి స్థాయిలో వివిధ రకాల ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. కానీ పరీక్షలో ఇచ్చే ప్రశ్న ఏ స్థాయిలో ఉందో కచ్చితంగా నిర్థÄరించడం కొన్నిసార్లు కష్టమవుతుంది. ప్రాథమిక అంశాలపై గట్టి పట్టు, నిరంతర కృషి ఉంటే పోటీ పరీక్షల్లో విజయం సాధించడం అంత కష్టమేమీ కాదు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: సుమతి

    Ans:

    పదో తరగతి సర్టిఫికెట్‌నే ఏ ఉద్యోగానికైనా ప్రామాణికంగా తీసుకుంటారు. కాబట్టి ఎలాంటి సమస్యా ఉండదు.

    Asked By: రవి

    Ans:

    మీరు బీఎస్సీ బయో టెక్నాలజీ పూర్తి చేశారు కాబట్టి, పీజీ బయో టెక్నాలజీ చేస్తే బాగుంటుంది. జీవితంలో త్వరగా స్థిరపడటం అనేది మీ సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది.

    Asked By: విల్లూరి సుజని

    Ans:

    మీకు అన్ని ఉద్యోగాలకు అర్హత ఉంటుంది. అయితే 5% పరిధిలోకి మాత్రమే వస్తారు.

    Asked By: అనుమోలు

    Ans:

    మీకు గ్రూప్‌-4, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి కచ్చితంగా అర్హత ఉంది.

    Asked By: మారోజు కళ్యాణ్

    Ans:

    టెన్త్, ఇంటర్‌ సర్టిఫికెట్లలో మీ పేరు ఎలా ఉందో అదే విధంగా ఆధార్‌ కార్డులో కూడా మార్పించుకుంటే ఎలాంటి సమస్యా ఉండదు.