Post your question

 

    Asked By: నాగ్

    Ans:

    గ్రూప్‌-4 పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌-1 జనరల్‌ స్టడీస్‌కు సంబంధించి ప్రామాణిక పుస్తకాలను చదువుకుని నోట్స్‌ ప్రిపేర్‌ చేసుకోవాలి. దాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు రివిజన్‌ చేస్తే పరీక్షలో సులభంగా మార్కులు పొందవచ్చు. పేపర్‌-2 సెక్రటేరియల్‌ ఎబిలిటీస్‌ విషయానికి వస్తే ఎంత సాధన చేస్తే అంత మంచిది.

    Asked By: పొన్నం

    Ans:

    మీ ప్రాథమిక విద్య అంతా తెలంగాణలోనే జరిగింది కాబట్టి టీఎస్‌పీఎస్సీ పరీక్షలు రాయడానికి ఇక్కడి స్థానికత వర్తిస్తుంది.

    Asked By: త్రిభువన్

    Ans:

    గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ సిలబస్‌లో తెలంగాణ చరిత్ర, ఉద్యమం గురించి ప్రస్తావించనప్పటికీ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఈ సబ్జెక్టుకి సంబంధించిన తెలుగు అకాడమీ పుస్తకాన్ని చదివి బాగా అవగాహన చేసుకుంటే సమాధానాలను సులభంగా గుర్తించవచ్చు. 

    Asked By: శ్వేత

    Ans:

    మీరు సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ సబ్జెక్టుకు సంబంధించి తెలుగు అకాడమీ పుస్తకాలు, రోజూ దినపత్రికలు, అలాగే శాస్త్రసాంకేతిక రంగానికి చెందిన ప్రభుత్వ ప్రచురణలు చదవండి

    Asked By: తోట

    Ans:

    మీకు పోస్ట్‌ కోడ్‌ నెం. 4 కి పోటీ పడే అర్హత ఉంటే తప్పకుండా మిమ్మల్ని పరిగణనలోకి తీసుకుంటారు. సర్వీస్‌ కమిషన్‌ ఎడిట్‌ ఆప్షన్‌ని ఇచ్చినప్పుడు ఏవైనా సవరణలు ఉంటే చేసుకోవచ్చు.

    Asked By: కళ్యాణ్ రావు

    Ans:

    మీరు ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు కూడా తెలంగాణలో చదివి ఉంటే టీఎస్‌పీఎస్సీ పోటీపరీక్షలకు అర్హత ఉంటుంది. ఆ కాలానికి సంబంధించిన స్టడీ సర్టిఫికెట్లను చదివిన స్కూల్‌ నుంచి తెచ్చుకోండి.