ఓటీఆర్ నింపేటప్పుడు ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఉన్న కాలమ్‌లో ప్రైవేట్ అని పూర్తిచేసి, ఆ కాలానికి సంబంధించి తహసీల్దార్ సంతకం చేసిన నివాస ధ్రువీకరణ పత్రాన్ని జత చేయండి
జనరల్ స్టడీస్ కామన్‌గా ఉంటుంది. సబ్జెక్ట్ విషయానికి వస్తే పాలిటెక్నిక్ ఈసీఈ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్) పుస్తకాలను బాగా చదవండి. వీటికి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్స్‌పై పట్టు సాధించండి.
ఓటీఆర్‌లో ఎడిట్ ఆప్షన్ తప్పులను సరిదిద్దడానికే ఉంటుంది. నెట్వర్క్ సరిగా లేకపోయినా ఒక్కోసారి అప్డేట్ కాదు. మరొకసారి ప్రయత్నించి చూడండి. అప్పటికీ కాకపోతే సర్వీస్ కమిషన్‌ను సంప్రదించండి.
గ్రూప్-1 ప్రిలిమ్స్‌కు తెలంగాణ ఎకానమీ తప్పనిసరిగా చదవాలి. కరెంట్ అఫైర్స్‌లోనూ ఆర్థిక సంబంధ ప్రశ్నలు వస్తాయి. అయితే గ్రూప్-1, గ్రూప్-2 మెయిన్స్‌లో ఎకానమీకి ఉన్నంత వెయిటేజీ గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో ఉండదు.
గ్రూప్-2 నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలవుతుందని వేచి చూడకుండా వెంటనే ప్రిపరేషన్ మొదలుపెట్టండి. నోటిఫికేషన్ వచ్చేలోపు సిలబస్‌పై అవగాహన ఏర్పరుచుకోండి. ప్రామాణిక పుస్తకాలను చదివి నోట్సు ప్రిపేర్ చేసుకోండి. ఆ తర్వాత ఆబ్జెక్టివ్ ప్రశ్నలను తరచూ ప్రాక్టీసు చేయండి.