Asked By: sai
Ans:
టీఎస్పీఎస్సీ గ్రూప్-3 లేదా గ్రూప్-4 ఉద్యోగం సాధించాలనుకోవడం మంచి ఆలోచన. పోటీపరీక్షల్లో విజయం సాధించాలంటే ముందుగా సిలబస్‌పై పూర్తి అవగాహన పెంచుకోవాలి. ఆ తర్వాత సంబంధిత పరీక్ష బేసిక్స్‌పై పట్టు సాధించాలి. కరెంట్ అఫైర్స్ కోసం రోజూ దినపత్రిక చదవడం, నోట్సు ప్రిపేర్ చేసుకోవడం తప్పనిసరి. పాత ప్రశ్నపత్రాలను, చదివిన అధ్యాయాల ప్రశ్నలను తరచూ ప్రాక్టీస్ చేయాలి. ఉద్యోగం చేస్తుండటం వల్ల తక్కువ సమయం ఉంటుంది కాబట్టి వీలైతే ఆన్లైన్ క్లాసెస్ ఫాలో అవడం మంచిది.
Asked By: Mahija
Ans:
టీఎస్పీఎస్సీ, ఇతర పోటీపరీక్షలకు కరెంట్ అఫైర్స్ విభాగం కీలకమైంది. దాదాపు ఒక సంవత్సరానికి సంబంధించిన అంశాలను చదువుకుంటే సరిపోతుంది. అంటే మీరు 2022 మే నెలలో ఏదైనా పరీక్ష రాస్తుంటే 2021 ఏప్రిల్ నుంచి 2022 ఏప్రిల్ వరకు ఉన్న కరెంట్ అఫైర్స్‌ని చూసుకోవాలి. అలాగే కరెంట్ అఫైర్స్‌లో కొన్ని అంశాలకు సంబంధించిన పూర్వాపరాలను కూడా తెలుసుకోవాలి. ఉదాహరణకు 365 ఆర్టికల్ ప్రకారం ఇలా జరిగింది అని పేపర్లో వస్తే ఆ ఆర్టికల్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై మీరు అవగాహన పెంచుకోవాలి.
Asked By: Ram
Ans:
ఒకేసారి రెండు తరగతులను పూర్తి చేయడం అసంభవం. మీరు నాలుగు చదవకుండా నేరుగా ఐదో తరగతి చదివి ఉంటే ఓటీఆర్ నింపేటప్పుడు అకడమిక్ ఇయర్స్ కాలమ్ నాలుగో తరగతిలో డ్యాష్(-) పెట్టి వదిలేయండి. ఉదాహరణకు మీరు మూడో తరగతి 2012-13లో చదివి ఉంటే నాలుగో తరగతి డ్యాష్ పెట్టి అయిదో తరగతి కాలమ్‌లో 2013-14 అని నింపితే సరిపోతుంది. మీరు నేరుగా మూడో తరగతి నుంచి అయిదో తరగతిలోకి వెళ్లారని వారికి అర్థమైపోతుంది.