Post your question

 

    Asked By: సత్యకుమార్

    Ans:

    ఇంటర్‌స్థాయిలోని చరిత్ర, అర్థశాస్త్రం, భూగోళశాస్త్రం, రాజనీతిశాస్త్రం (సివిక్స్‌), బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ పుస్తకాలను చదవాలి. వీటితోపాటు కరెంట్‌ అఫైర్స్‌ కోసం ఏదైనా ప్రామాణిక జాతీయ, ప్రాంతీయ వార్తా పత్రికలను చదివి నోట్స్‌ ప్రిపేర్‌ చేసుకోవాలి. పేపర్‌-2 (సెక్రటేరియల్‌ ఎబిలిటీస్‌)కి సంబంధించి సిలబస్‌లోని అంశాల ప్రకారం వీలైనన్ని నమూనా ప్రశ్నపత్రాలను సాధన చేయాలి.

    Asked By: సమీర

    Ans:

    టీఎస్‌పీఎస్సీ మెయిన్స్‌ పరీక్ష ఒకే రోజులో పూర్తి కాదు. కమిషన్‌ ప్రకటించే టైమ్‌టేబుల్‌ని అనుసరించి పరీక్షలు నిర్వహిస్తారు.

    Asked By: సంజీవ్

    Ans:

    గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ప్రిపరేషన్‌ ప్రారంభించినప్పుడే మెయిన్స్‌కు కూడా సన్నద్ధత మొదలుపెట్టాలి. తెలుగు అకాడమీ పుస్తకాలను ప్రామాణికంగా చేసుకుని నోట్స్‌ ప్రిపేర్‌ చేసుకోవాలి. ముందుగా క్లిష్టమైన సబ్జెక్టులను బాగా అర్థం చేసుకుని చదవాలి. తయారు చేసుకున్న నోట్స్‌ను ఎక్కువసార్లు రివిజన్‌ చేయాలి. అవగాహన కోసం పాత ప్రశ్నపత్రాలను పరిశీలించాలి. సబ్జెక్టులన్నిటిపై పట్టు ఉందనుకుంటే కోచింగ్‌ అవసరం ఉండదు.

    Asked By: ఒక అభ్యర్థి

    Ans:

    తెలంగాణ పోలీస్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి కనీసఎత్తు సాధారణ కేటగిరీలో పురుషులకు 167.6 సెం.మీ., మహిళలకు 152.5 సెం.మీ. శారీరక కొలతల వివరాలను తెలిపే ప్రామాణిక కేంద్రాలు ఏవీ ప్రత్యేకంగా ఉండవు.

    Asked By: వీరశేఖర్

    Ans:

    కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ.8 లక్షలు లేదా అంతకు మించితే క్రీమీలేయర్‌ పరిధిలోకి వస్తారు. లేదంటే నాన్‌ క్రీమీలేయర్‌ అవుతారు. క్రీమీలేయర్‌ కిందికి వచ్చే వారికి రిజర్వేషన్‌ వర్తించదు. 

    Asked By: కాళి

    Ans:

    ఓటీఆర్‌లో ఒకటో తరగతి నుంచి నాలుగో తరగతి వివరాలను ప్రైవేట్‌ అని నింపి, సంబంధిత ప్రాంతం తహసీల్దార్‌ నుంచి రెసిడెన్షియల్‌ సర్టిఫికెట్‌ తీసుకోండి. మీరు నల్గొండ జిల్లాలో స్థానికతను పొందుతారు.