Post your question

 

    Asked By: ఒక అభ్యర్థి

    Ans:

    ఇంటర్‌ పరీక్షలు పూర్తయినప్పటికీ, రిజల్ట్స్‌ వచ్చి సర్టిఫికెట్‌ చేతిలో ఉంటేనే మీరు కానిస్టేబుల్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడం కుదురుతుంది.

    Asked By: కవిత

    Ans:

    ఓటీఆర్‌లో ఎడిట్‌ ఆప్షన్‌కి వెళ్లి మీరు తప్పుగా నమోదు చేసిన డిగ్రీ మార్కుల శాతాన్ని సరిచేసుకుంటే సరిపోతుంది. మరొకసారి దరఖాస్తు చేయనవసరం లేదు.

    Asked By: రాజశేఖర్

    Ans:

    పాఠశాల విద్యాభ్యాసమంతా హైదరాబాద్‌లో జరిగి ఉంటే మీరు చార్‌మినార్‌ జోన్‌లోకి వస్తారు. ఒకవేళ రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో జరిగి ఉంటే రంగారెడ్డి జోన్‌ కిందకు వస్తారు.

    Asked By: రమావత్

    Ans:

    పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి మీకు అర్హత ఉంటుంది. ఎలాంటి సమస్యా లేదు.

    Asked By: సుతారి

    Ans:

    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2022 మే 20న పోలీసు ఉద్యోగాలకు వయసు పరిమితి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనిప్రకారం ప్రస్తుతం కానిస్టేబుల్‌ ఉద్యోగాల ఎంపికకు గరిష్ఠ వయసు సాధారణ కేటగిరీలో 27 సంవత్సరాలు. ఏదైనా రిజర్వేషన్‌ ఉంటే మరొక అయిదేళ్లు సడలింపు ఉంటుంది. ఎస్సై ఉద్యోగాల ఎంపికకు గరిష్ఠ వయసు పరిమితి సాధారణ కేటగిరీలో 30 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ రిజర్వ్‌డ్‌ అభ్యర్థులకు గరిష్ఠ వయసు 35 ఏళ్లు. దరఖాస్తు గడువును ప్రభుత్వం 2022 మే 26 వరకు  పెంచింది.

    Asked By: సిహెచ్. బాలకృష్ణ

    Ans:

    టీఎస్‌పీఎస్సీ ఓటీఆర్‌లో ఎడిట్‌ ఆప్షన్‌కు వెళ్లి ఏవైనా తప్పులు ఉంటే సవరించి దరఖాస్తును మరొకసారి సబ్మిట్‌ చేయవచ్చు.