Post your question

 

    Asked By: గొల్ల

    Ans:

    మీరు 1, 2, 3 తరగతులు తెలంగాణలో చదివి ఉంటే ఆ కాలానికి సంబంధించిన నివాస ధ్రువీకరణ పత్రాన్ని తహసీల్దార్‌ నుంచి పొందాలి. తెలంగాణలో చదివి ఉండకపోతే ఇక్కడి స్థానికతను పొందరు. అడ్రస్, ఆధార్‌ వివరాలన్నీ తెలంగాణ రాష్ట్రానివి ఉంటేనే మంచిది.

    Asked By: గోదల

    Ans:

    గ్రూప్‌-1 కు దరఖాస్తు చేసుకునే సమయానికి చేతిలో తప్పనిసరిగా డిగ్రీ సర్టిఫికెట్‌ ఉండాలి. కాబట్టి, ఈ ఏడాదికి మీకు అవకాశం ఉండదు.

    Asked By: రాము బచ్చనబోయిన

    Ans:

    మూడో తరగతి నుంచి ఆరో తరగతి వరకు చదివిన కాలానికి సంబంధించిన రెసిడెన్షియల్‌ సర్టిఫికెట్‌ను ఆ ప్రాంతానికి చెందిన తహసీల్దార్‌ నుంచి పొందవచ్చు.

    Asked By: శిరీష బూరా

    Ans:

    ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు సంబంధిత  సబ్జెక్టులపై ప్రాథమిక అవగాహనకు మాత్రమే ఉపయోగపడతాయి. మీరు  కచ్చితంగా సబ్జెక్టులవారీగా ప్రామాణిక  పుస్తకాలను చదవాల్సి ఉంటుంది. అప్పుడే ప్రిపరేషన్‌ పూర్తవుతుంది.

    Asked By: వినయ్

    Ans:

    ఎస్‌ఐ సిలబస్‌లో కొత్తగా చేర్చిన ప్రిన్సిపుల్స్‌ ఆఫ్‌ జాగ్రఫీ కోసం భౌతిక భూగోళ శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. తెలుగు  అకాడమీలో ఈ అంశానికి సంబంధించిన పుస్తకాలు లభిస్తాయి.

    Asked By: పటేల్ నాగేశ్వరరావు

    Ans:

    డేట్‌ ఆఫ్‌ బర్త్‌ లేదా ఆధార్‌ నంబర్‌తో ప్రయత్నించండి. ఎడిట్‌ అవుతుంది. 

    Asked By: సాయి

    Ans:

    టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ ఏఈ లేదా సబ్‌ ఇంజినీర్‌ పోస్టులకు ఈసీఈ బ్రాంచ్‌వారికి అర్హత లేదు. ఈఈఈ బ్రాంచ్‌వారు మాత్రమే అర్హులు.