Post your question

 

    Asked By: తిరుపతి

    Ans:

    ఒకటో తరగతి ప్రభుత్వ గుర్తింపు ఉన్న పాఠశాలలో చదివి ఉంటే అక్కడి నుంచి బోనఫైడ్‌ను తీసుకోవచ్చు. లేదంటే ఆ కాలానికి సంబంధించి ఓటీఆర్‌లో ప్రైవేట్‌ అని నింపి తహసీల్దార్‌ సంతకం చేసిన రెసిడెన్షియల్‌ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది.

    Asked By: మేకల

    Ans:

    డిగ్రీ చివరి సంవత్సరం తర్వాత తీసుకునే కన్సాలిడేటెడ్‌ మార్కుల మెమోలోని తేదీని వేయాలి.

    Asked By: సుబేదార్

    Ans:

    క్రీమీలేయర్‌ పరిధిలోకి రాకపోతే రిజర్వేషన్‌ వర్తిస్తుంది. పరిధిలోకి వస్తే రిజర్వేషన్‌ వర్తించదు. ఎంఆర్‌వో కార్యాలయంలో నాన్‌ క్రీమీలేయర్‌ కింద చేస్తున్న దరఖాస్తును తిరస్కరిస్తున్నారు అంటే మీరు క్రీమీలేయర్‌ పరిధిలోకి వస్తారు. కాబట్టి, మీకు రిజర్వేషన్‌ వర్తించదు. అంటే మీరు క్రీమీలేయర్‌ పరిధిలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

    Asked By: బట్టు

    Ans:

    మీకు వయసుకు సంబంధించిన సడలింపు మాత్రమే వర్తిస్తుంది. ఉద్యోగం నుంచి డిశ్చార్జ్‌ అయ్యి బయటికి వస్తేనే కోటా వర్తిస్తుంది.

    Asked By: గొల్ల

    Ans:

    మీరు 1, 2, 3 తరగతులు తెలంగాణలో చదివి ఉంటే ఆ కాలానికి సంబంధించిన నివాస ధ్రువీకరణ పత్రాన్ని తహసీల్దార్‌ నుంచి పొందాలి. తెలంగాణలో చదివి ఉండకపోతే ఇక్కడి స్థానికతను పొందరు. అడ్రస్, ఆధార్‌ వివరాలన్నీ తెలంగాణ రాష్ట్రానివి ఉంటేనే మంచిది.

    Asked By: గోదల

    Ans:

    గ్రూప్‌-1 కు దరఖాస్తు చేసుకునే సమయానికి చేతిలో తప్పనిసరిగా డిగ్రీ సర్టిఫికెట్‌ ఉండాలి. కాబట్టి, ఈ ఏడాదికి మీకు అవకాశం ఉండదు.

    Asked By: రాము బచ్చనబోయిన

    Ans:

    మూడో తరగతి నుంచి ఆరో తరగతి వరకు చదివిన కాలానికి సంబంధించిన రెసిడెన్షియల్‌ సర్టిఫికెట్‌ను ఆ ప్రాంతానికి చెందిన తహసీల్దార్‌ నుంచి పొందవచ్చు.