Asked By: Krishna
Ans:
గ్రూప్-1 వచ్చే వరకు వేచి చూడకుండా ఎంత త్వరగా ప్రిపరేషన్ మొదలు పెడితే అంత మంచిది. ప్రిలిమినరీ పరీక్షకు మౌలికాంశాలను క్షుణ్ణంగా చదివి బిట్లు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. మెయిన్స్‌ను డిస్క్రిప్టివ్ ప్రధానంగా నిర్వహిస్తారు. దీనికి సబ్జెక్టులను విశ్లేషణాత్మకంగా చదవాల్సి ఉంటుంది. రాసే నైపుణ్యం, భాషపై పట్టు అవసరం. ప్రిపరేషన్‌కు తెలుగు అకాడమీ పుస్తకాలను ప్రామాణికంగా తీసుకోవాలి. అలాగే ప్రతిరోజూ దినపత్రికను చదివి నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి.
Asked By: ramesh
Ans:
మీరు అకడమిక్ ఇయర్స్ కాలమ్ నింపేటప్పుడు నాలుగో తరగతిలో డ్యాష్(-) పెట్టి వదిలేయండి. ఉదాహరణకు మీరు మూడో తరగతి 2012-13లో చదివి ఉంటే నాలుగో తరగతి డ్యాష్ పెట్టి అయిదో తరగతి కాలమ్‌లో 2013-14 అని నింపితే సరిపోతుంది. మీరు నేరుగా మూడో తరగతి నుంచి అయిదో తరగతిలోకి వెళ్లారని వారికి అర్థమైపోతుంది. .