Asked By: priyanka
Ans:
మీరు మొదటిసారిగా టీఎస్పీఎస్సీ గ్రూప్-2 పరీక్షకు సిద్ధమవుతున్నారు కాబట్టి, సిలబస్ ప్రకారం బేసిక్ కాన్సెప్ట్ప్ను పూర్తిగా అవగాహన చేసుకోండి. ఆ తర్వాత తెలుగు అకాడమీ పుస్తకాలు, దినపత్రిక (ఇంగ్లిష్/తెలుగు) రోజూ చదవండి. మీకు పట్టులేని సబ్జెక్టుల కోసం కోచింగ్‌కి చేరడం మంచిది లేదా ఆ సబ్జెక్టుపై అవగాహన ఉన్నవారి నుంచి సూచనలు తీసుకోండి.
Asked By: Sirisinahal
Ans:
ఇండియన్ సొసైటీ అంటే ఇందులో భారత సమాజ నిర్మాణం, సమస్యలు, ప్రభుత్వ విధానాలు, పథకాల గురించి తెలుసుకోవాలి. వీటికి¨ ప్రత్యేకంగా పుస్తకాలు ఉండవు. భారత సమాజానికి సంబంధించిన తెలుగు అకాడమీ (తెలుగు/ఇంగ్లిష్ మీడియం) పుస్తకాలను సిలబస్ ప్రకారం రిఫర్ చేయవచ్చు. ఆధునిక భారతదేశ విధానాలు, పథకాల గురించి ఇండియా ఇయర్ బుక్ - 2022ను చదవండి. ప్రిపరేషన్‌కి స్టాండర్డ్ పుస్తకాలను మాత్రమే ఎంపిక చేసుకోండి.
Asked By: రాకేష్
Ans:
ఒకటో తరగతి నుంచి నాలుగో తరగతి వరకు చదివిన ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలో ఉంటే, ఆ ప్రాంతానికి చెందిన తహశీల్దార్ సంతకం చేసిన నివాస ధ్రువీకరణ పత్రం (రెసిడెన్షియల్ సర్టిఫికెట్)ను సమర్పించగలిగితే మీరు తెలంగాణ లోకల్ అవుతారు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్‌లో చదివి ఉంటే తెలంగాణ స్థానికత వర్తించదు.
Asked By: వంశీ
Ans:
తెలుగు అకాడమీలో తెలంగాణ చరిత్ర, ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. మీరు హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని తెలుగు అకాడమీకి వెళితే కావాల్సిన పుస్తకాలు అన్నీ (తెలుగు/ఇంగ్లిష్ మీడియం) దొరుకుతాయి. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి ప్రిపరేషన్‌కి ఎక్కువ సమయం ఉండకపోవచ్చు. ఆన్లైన్లో ఒక గంట ఫ్రీ క్లాసెస్ లేదా కోచింగ్ క్లాస్‌లో జాయిన్ అయితే ప్రిపరేషన్‌కి ఉపయోగకరంగా ఉంటుంది.
Asked By: ఒక అభ్యర్థి
Ans:
ఎకానమీ సబ్జెక్టుపై పట్టు సాధించాలంటే మొదట 9, 10, 11, 12 తరగతులకు సంబంధించిన ఎన్సీఆర్టీ పుస్తకాలను క్షుణ్నంగా చదివి అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత సుందరం అండ్ దత్త రాసిన ఇండియన్ ఎకానమీ, ఉమ కపిల - ఇండియాస్ ఎకనామిక్ డెవలప్మెంట్ సిన్స్ 1947, మిశ్ర అండ్ పురి - ఇండియన్ ఎకానమీ లాంటి ప్రామాణిక పుస్తకాలు చదవాలి.