Asked By: ఒక అభ్యర్థి
Ans:
ఎకానమీ సబ్జెక్టుపై పట్టు సాధించాలంటే మొదట 9, 10, 11, 12 తరగతులకు సంబంధించిన ఎన్‌సీఆర్‌టీ పుస్తకాలను క్షుణ్నంగా చదివి అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత సుందరం అండ్ దత్త రాసిన ఇండియన్ ఎకానమీ, ఉమ కపిల - ఇండియాస్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ సిన్స్ 1947, మిశ్ర అండ్ పురి - ఇండియన్ ఎకానమీ లాంటి ప్రామాణిక పుస్తకాలు చదవాలి.
Asked By: అఖిల్
Ans:
మీరు తెలంగాణ పరిధిలోకి వస్తారు. కొత్త నిబంధనల ప్రకారం ఒకటి నుంచి ఏడు తరగతుల్లోపు నాలుగు సంవత్సరాలు ఎక్కడ చదివితే అక్కడే లోకల్ అవుతారు. ప్రభుత్వ పాఠశాల లేదా ప్రభుత్వ ధ్రువీకరణ పొందిన ఏదైనా ప్రైవేటు పాఠశాలలో చదివి ఉండాలి. ఒకవేళ ప్రభుత్వ గుర్తింపు పొందని ప్రైవేటు స్కూల్‌లో చదివి ఉంటే స్థానికతను ధ్రువపరుస్తూ ఎంఆర్‌ఓ సంతకం చేసి ఇచ్చిన సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది.