Post your question

 

    Asked By: గోపాల్‌

    Ans:

    కచ్చితంగా ఉంటుంది. గ్రూప్స్‌కి సంబంధించిన అన్ని పరీక్షలూ రాసుకోవచ్చు. కానీ ప్రభుత్వ నోటిఫికేషన్లు వెలువడే నాటికి మీ డిగ్రీ పూర్తయ్యి చేతిలో సర్టిఫికెట్‌ ఉండాలి. 

    Asked By: ప్రవీణ్‌

    Ans:

    మీరు ఆంధ్రప్రదేశ్‌కి లోకల్‌ అవుతారు. తాజాగా అమలు చేస్తున్న నిబంధనల ప్రకారం మీకు తెలంగాణ స్థానికత వర్తించదు. 

    Asked By: వంశీ

    Ans:

    తెలుగు అకాడమీలో తెలంగాణ చరిత్ర, ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. మీరు హైదరాబాద్‌ హిమాయత్‌నగర్‌లోని తెలుగు అకాడమీకి వెళితే కావాల్సిన పుస్తకాలు అన్నీ (తెలుగు/ఇంగ్లిష్‌ మీడియం) దొరుకుతాయి. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి ప్రిపరేషన్‌కి ఎక్కువ సమయం ఉండకపోవచ్చు. ఆన్‌లైన్‌లో ఒక గంట ఫ్రీ క్లాసెస్‌ లేదా కోచింగ్‌ క్లాస్‌లో జాయిన్‌ అయితే ప్రిపరేషన్‌కి ఉపయోగకరంగా ఉంటుంది.

    Asked By: ఒక అభ్యర్థి

    Ans:

    ఎకానమీ సబ్జెక్టుపై పట్టు సాధించాలంటే మొదట 9, 10, 11, 12 తరగతులకు సంబంధించిన ఎన్‌సీఆర్‌టీ పుస్తకాలను క్షుణ్నంగా చదివి అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత సుందరం అండ్‌ దత్త రాసిన ఇండియన్‌ ఎకానమీ, ఉమ కపిల - ఇండియాస్‌ ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌ సిన్స్‌ 1947, మిశ్ర అండ్‌ పురి - ఇండియన్‌ ఎకానమీ లాంటి ప్రామాణిక పుస్తకాలు చదవాలి.

    Asked By: టి. ప్రసాద్

    Ans:

    ఓపెన్‌ స్కూల్‌లో విద్యాభ్యాసం పూర్తి చేశారు కాబట్టి ఆ కాలానికి సంబంధించి ఎక్కడ చదివారో ఆ ప్రాంతానికి చెందిన తహసీల్దార్‌ సంతకం చేసిన నివాస ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించండి.

    Asked By: అరుణ్

    Ans:

    సిలబస్‌ ప్రకారం తెలుగు అకాడమీ ప్రచురించిన పుస్తకాలు (ఇంగ్లిష్‌/ తెలుగు మీడియం) చదవండి.

    Asked By: సలీమ్

    Ans:

    మీరు ఆంధ్రప్రదేశ్‌ ప్రాంతానికి చెందుతారు. ఎందుకంటే ప్రస్తుత నిబంధనల ప్రకారం ఒకటి నుంచి ఏడో తరగతి వరకు ఎక్కడ ఎక్కువ చదివితే ఆ ప్రాంతం లోకల్‌ అవుతుంది. మీరు కర్నూలులో చదవడం వల్ల మిమ్మల్ని తెలంగాణలో నాన్‌-లోకల్‌గా పరిగణిస్తారు.

    Asked By: అహ్మద్

    Ans:

    ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక హోదా తీసుకున్నప్పటికీ ప్రస్తుత నిబంధనల ప్రకారం మీరు ఒకటి నుంచి ఏడో తరగతి వరకు ఎక్కువ ఎక్కడ  చదివితే అదే మీకు లోకల్‌ అవుతుంది. మీ చిన్ననాటి విద్యాభ్యాసమంతా తెలంగాణలోనే జరిగి ఉంటే టీఎస్‌పీఎస్సీ ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

    Asked By: ఒక అభ్యర్థిని

    Ans:

    ఆధార్‌ కార్డ్‌లో భర్త పేరు ఉన్నప్పటికీ కులంలో ఎటువంటి మార్పు రాదు. ఉద్యోగం విషయంలో మీ పుట్టింటి పేరు, తండ్రి కులమే కొనసాగుతుంది. సర్టిఫికెట్లలోనూ ఎలాంటి మార్పు చేసుకోలేరు. ఓటీఆర్‌ అప్‌డేషన్‌లో తండ్రి కులమే వర్తిస్తుంది. ఆధార్‌లోనూ ఆయన పేరు పెట్టుకుంటే ఇక ఏ సమస్య ఉండదు.

    Asked By: నిఖిల

    Ans:

    మీరు రంగారెడ్డి నుంచి స్టడీ సర్టిఫికెట్లు తీసుకోవాలి. మూడు, నాలుగు, ఆరు ఒకే స్కూల్‌లో చదివి ఉంటే, అయిదో తరగతికి డబుల్‌ జంప్‌ అని ఓటీఆర్‌లో సబ్మిట్‌ చేస్తే సరిపోతుంది.