ప్రస్తుత నిబంధనల ప్రకారం ఏడో తరగతి వరకు వరుసగా తెలంగాణలోనే చదివి ఉంటే ఇక్కడి స్థానికత వర్తిస్తుంది. ఒక్క తరగతి అయినా వేరే రాష్ట్రంలో చదివితే స్థానికత వర్తించదు. మీరు అయిదో తరగతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదవడం వల్ల మీకు ఇక్కడి స్థానికత లభించలేదు.
ప్రాథమిక విద్యాభ్యాసమంతా తెలంగాణలో జరిగి ఉంటే ఇక్కడి స్థానికత వర్తించేది. కానీ మీరు అయిదో తరగతి నుంచి ఆంధ్రప్రదేశ్లో చదవడం వల్ల తెలంగాణ స్థానికత వర్తించదు.