Asked By: పి. మధుసూదన్‌రావు
Ans:
మీరు 12 సంవత్సరాలుగా పనిచేస్తున్న కంపెనీ గురించీ, అక్కడ నిర్వహిస్తున్న బాధ్యతల గురించీ చెప్పలేదు. మీరు ఎంబీఏ ఫైనాన్స్, పీజీ డిప్లొమా ఇన్ సప్లై చైన్ మేనేజ్‌మెంట్ కోర్సులు ఏ యూనివర్సిటీ నుంచి చేశారో! సాధారణంగా ఉద్యోగం చేస్తూ ఎంబీఏ లాంటి కోర్సులు చేసినవారికి కొత్త కొలువు పొందడంలో వారి గత ఉద్యోగానుభవం చాలా ఉపయోగపడుతుంది. మీరు ప్రస్తుతం పనిచేస్తున్న రంగంలోనే ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. ఎంబీఏ లాంటి కోర్సుల్లో మార్కులకంటే నైపుణ్యాలు చాలా ముఖ్యం. ఉద్యోగ ప్రయత్నాలపై మీరు ఎంబీఏ డిగ్రీ పొందిన యూనివర్సిటీ విశ్వసనీయత చాలా ప్రభావం చూపుతుంది. ప్రస్తుత ఉద్యోగ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా మీ నైపుణ్యాలను మెరుగుపర్చుకోండి. ఉద్యోగం చేయాలనుకుంటున్న కంపెనీలో పనిచేస్తున్న సీనియర్ ఉద్యోగుల ద్వారా మరిన్ని వివరాలు సేకరించి, దానికి అనుగుణంగా నైపుణ్యాలు పెంపొందించుకోండి. నిరుత్సాహపడకుండా ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: శ్రీకీర్తి
Ans:
హోటల్ మేనేజ్‌మెంట్/ టూరిజంలో ఎంబీఏ చేసినవాళ్లు చాలామంది అందుబాటులో ఉన్నప్పటికీ.. నిపుణుల కొరత ఎక్కువగానే ఉంది. ఈ డిగ్రీ చేసినవాళ్లు ట్రావెల్ ఏజెంట్, టూర్ మేనేజర్, టూర్‌గైడ్, వీసా ఎగ్జిక్యూటివ్, ట్రావెల్ కన్సల్టెంట్, హోటల్ మేనేజర్, మేనేజ్‌మెంట్ ట్రైనీ, హాస్పిటాలిటీ మేనేజర్, సేల్స్ మేనేజర్, హౌస్‌కీపింగ్ మేనేజర్, గెస్ట్ ఎక్స్‌పీరియన్స్ మేనేజర్, ఈవెంట్ మేనేజర్, బెవరెజ్ మేనేజర్, హాలిడే కన్సల్టెంట్, కేటరింగ్ మేనేజర్‌గా ఉద్యోగాలు చేసే అవకాశం ఉంది. ఈ కోర్సు చదివినవారికి హోటల్, హాస్పిటల్, ట్రావెల్ ఏజెన్సీలు, విమానయాన సంస్థలు, రిసార్ట్‌ల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఈ సంస్థలు అన్నింటిలో ఇంటర్న్‌షిప్ అవకాశాలు కూడా ఉన్నాయి. సాధారణంగా హోటల్ మేనేజ్‌మెంట్/ టూరిజం ఏంబీఏ కోర్సులో భాగంగా ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్న్‌షిప్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా అదే సంస్థలో ఉద్యోగం లభించే అవకాశమూ ఉంది. చాలా సంస్థలు ఇంటర్న్‌షిప్ చేసేవారికి స్టైపెండ్ కూడా ఇస్తున్నాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: కె.అరుంధతి
Ans:
ఇటీవల డేటా సైన్స్ రంగంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులకు అనుగుణంగా చాలా పరిశ్రమలు/ పరిశోధనా సంస్థలు డేటా సైన్స్/ అనలిటిక్స్‌కి సంబంధించిన విషయాలపై దృష్టి సారించాయి. ఎంఎస్సీ జువాలజీ చదివిన తర్వాత క్లినికల్ ఎస్‌ఏఎస్ కోర్సు చేయడం వల్ల మీ ఉద్యోగావకాశాలు మెరుగువుతాయి. ఫార్మా కంపెనీలు, బయోటెక్ కంపెనీలు, పరిశోధనా సంస్థల్లో క్లినికల్ డేటా అనాలిసిస్ కోసం డేటా అనలిస్ట్‌ల అవసరం పెరుగుతోంది. మీరు ఈ కోర్సు చేశాక క్లినికల్ డేటా మేనేజ్‌మెంట్ ట్రైనీ, క్లినికల్ డేటా అసోసియేట్, క్లినికల్ డేటా అనలిస్ట్, క్లినికల్ డేటా మేనేజర్‌గా ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. ఈ కోర్సులో చేరేముందు బయో స్టాటిస్టిక్స్‌కు సంబంధించిన ప్రాథమిక అంశాలపై పట్టు సాధించండి. వీలుంటే ఎంఎస్ ఎక్సెల్, ఆర్ ప్రోగ్రామింగ్, పైతాన్‌లను కూడా నేర్చుకోండి. - ప్రొ.బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: leela
Ans:
Please click on the following link. You will find so many stories useful for career progression.
Asked By: tangilla
Ans:
This is Education and Career portal. You have posted this question in a wrong place. Please click on the following link and post your question.
Asked By: Bhanu
Ans:
Please click on the following link. You will find so many stories useful for career progression.