Post your question

 

  Asked By: మాధవి

  Ans:

  మీరు ఇంటర్మీడియట్‌ని 2011లో పూర్తిచేసి, డిగ్రీని 2020లో చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందీ లేదు. ఏ ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్‌లోనూ రెండు కోర్సుల మధ్య విరామం గురించి ప్రత్యేకంగా అడగరు. డిగ్రీ అర్హత ఉన్న అన్నిరకాల ఉద్యోగాలకూ దూరవిద్యలో డిగ్రీ చదివినవారు అర్హులే. ఏదైనా నోటిఫికేషన్‌ వచ్చినప్పుడు ఆయా ఉద్యోగాలకు మీ అర్హతను నిర్థరించుకోండి. ఆపై నిరభ్యంతరంగా దరఖాస్తు చేసుకోండి.

  Asked By: బి. ఆంజనేయులు

  Ans:

  సాధారణంగా పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశం పొందాలంటే ఆరు మార్గాలున్నాయి.
  1. యూజీసీ/ సీఎస్‌ఐఆర్‌ నిర్వహించే జేఆర్‌ఎఫ్‌ పరీక్షలో ఉత్తీర్ణత
  2. యూజీసీ/ సీఎస్‌ఐఆర్‌ నెట్‌ పరీక్షలో ఉత్తీర్ణత
  3. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌లో ఉత్తీర్ణత
  4. గేట్‌ పరీక్షలో ఉత్తీర్ణత 
  5. ఎంఫిల్‌ చేసి ఉండటం
  6. వివిధ యూనివర్సిటీలు నిర్వహించే ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత 
  వీటిలో నుంచి ఒక్కో యూనివర్శిటీ ఒక్కో పదతిలో పీహెచ్‌డీ ప్రోగ్రాం ప్రవేశాలు నిర్వహిస్తాయి. మీరు ఏ సబ్జెక్ట్‌లో, ఏ యూనివర్సిటీలో ప్రవేశం పొందాలనుకొంటున్నారో ఆ వర్శిటీ వెబ్‌సైట్‌ సందర్శించి వివరాలు తెలుసుకోండి.
  జేఆర్‌ఎఫ్‌లో ఉత్తీర్ణత సాధించినవారికి మంచి ఫెలోషిప్‌లు అందుబాటులో ఉన్నాయి. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీ చేసేవారికి నాన్‌ నెట్‌ ఫెలోషిప్‌ అందుబాటులో ఉంది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పీహెచ్‌డీ చేసేవారికి ఫెలోషిప్‌లను అందిస్తున్నాయి. ఇవికాకుండా సైన్స్‌వారికి డీఎస్‌టీ, డీబీటీ ఫెలోషిప్‌లు, సోషల్‌ సైన్స్‌ వారికి ఐసీఎస్‌ఎస్‌ఆర్‌ ఫెలోషిప్‌లున్నాయి. హిస్టరీ, ఆంత్రొపాలజీ, ఫిలాసఫీ లాంటి  సబ్జెక్ట్‌ల్లో పీహెచ్‌డీ చేసేవారిలో అతి కొద్ది మందికి ఆయా సబ్జెక్ట్‌ల ప్రొఫెషనల్‌ సొసైటీలు ఫెలోషిప్‌లు అందిస్తున్నాయి. కొన్ని ఎన్‌జీవోలు, అంతర్జాతీయ సంస్థలు కూడా అత్యంత ప్రతిభ ఉన్న పీహెచ్‌డీ స్కాలర్‌లకు ఫెలోషిప్‌లను అందిస్తున్నాయి.
  - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: కె. రామకృష్ణ

  Ans:

  దూరవిద్యలో ఎంబీఏ చేయాలంటే డిగ్రీ విద్యార్హత సరిపోతుంది. మీరు బీఎస్‌సీ చదివారు కాబట్టి నిరభ్యంతరంగా ఎంబీఏ చేయవచ్చు. 15 సంవత్సరాల వృత్తి అనుభవంతోపాటు ఎంబీఏ కూడా చేసినట్లయితే మీకు ప్రస్తుతం పనిచేస్తున్న సంస్థలోనే పదోన్నతి అవకాశం ఉండవచ్చు. మరేదైనా సంస్థలో మంచి వేతనంతో ఉద్యోగమూ పొందవచ్చు. నిర్మాణ రంగంలో ఉన్నారు కాబట్టి ఎంబీఏ: కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌/ ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌/ ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌/ సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్‌ వీటిలో ఏదో ఒకటి చేసినట్లయితే మీరు మెరుగైన ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

  Asked By: Greeshma

  Ans:

  Biotechnology is a good career. It focuses on application of biology in the  industry. A Biotechnologist can find jobs in different sectors like chemical industry, genetic engineering, research and development, food processing, drug and pharmaceutical organizations, Bio- processing companies and diary and horticulture. MSc biotechnology holders can get good opportunities in global level.  If you want to complete your Masters in abroad, you need to get required score in exams like GRE, IELTS or TOEFL. It will be an added advantage, if you complete your Masters in abroad, as you will get good working experience in high technology labs. After completion of your Master's degree you will get roles like Clinical Research coordinator, Plant Biotechnologists, Laboratory Manager, Biopharmaceutical Specialist etc.

  For some more information click on the following link

   

  https://pratibha.eenadu.net/careersandcourses/lessons/courses/bio-technology/2-14-97-134

  Asked By: nayudupalli

  Ans:

  మారుతున్న పర్యావరణ, వాతావరణ పరిస్థితుల వల్ల మానవులతోపాటు జంతువులూ ఎన్నో మార్పులకు గురి అవుతున్నాయి. ఈ కారణంగా పాడి పరిశ్రమ ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈ మార్పుల దృష్ట్యా సంప్రదాయిక పశువుల పెంపకానికి ఆధునిక విజ్ఞానాన్ని జోడించి లైవ్‌స్టాక్‌ అండ్‌ డెయిరీ మేనేజ్‌మెంట్‌ కోర్సును ప్రవేశపెట్టారు. పాడి పరిశ్రమ, వ్యవసాయం పట్ల ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ కోర్సులో పదో తరగతి అర్హతతో చేరవచ్చు. పూర్తి చేసినవారికి మంచి ఉద్యోగ, ఉన్నత విద్యావకాశాలు ఉన్నాయి. ఈ కోర్సు పూర్తి చేసిన తరువాత డిప్లొమా అర్హతతో బ్యాచిలర్‌ ఇన్‌ లైవ్‌స్టాక్‌ మేనేజ్‌మెంట్,  బీటెక్‌ డెయిరీ టెక్నాలజీ లాంటి కోర్సులను ఎంచుకొని ఉన్నత విద్య అభ్యసించవచ్చు. ఉద్యోగ అవకాశాల విషయానికి వస్తే- ఈ కోర్సు పూర్తి చేసినవారికి పాల కేంద్రాల్లో, అభయారణ్యాల్లో, పశువుల పరిశోధన కేంద్రాల్లో ఉపాధి లభిస్తుంది. డెయిరీ ప్రొడక్షన్‌ మేనేజర్, యానిమల్‌ హజ్బెండరీ సూపర్‌ వైజర్, యానిమల్‌ హజ్బెండరీ క్లర్క్‌ లాంటి ఉద్యోగ అవకాశాలుంటాయి.
  పాడి పరిశ్రమ, వ్యవసాయం పట్ల ఆసక్తి ఉంటే పదో తరగతి అర్హతతో ఈ కోర్సులో చేరవచ్చు.
  - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: షేక్‌ సుభానీ

  Ans:

  భూగర్భశాస్త్రం (జియాలజీ)లో భూమి ఉపరితలం, భూ వ్యవస్థ పనితీరును అధ్యయనం చేస్తారు. ఆధునిక భూగర్భ శాస్త్రం, హైడ్రాలజీ, వాతావరణ శాస్త్రాలతో పాటు ఇతర భూ శాస్త్రాల విషయాల గురించీ విపులంగా నేర్చుకొంటారు. ఈ కోర్సు చదివేవారు తరగతి బోధనతో పాటు, ప్రయోగశాలలో, క్షేత్రస్థాయిలో చాలా ప్రయోగాలు చేయాల్సివుంటుంది. ఈ రంగంలో రాణించాలంటే విషయపరిజ్ఞానంతో పాటు వివిధ రకాల ప్రాక్టికల్‌ నైపుణ్యాలను కూడా పొందవలసిన అవసరం ఉంది. ఈ ప్రత్యేక లక్షణాల దృష్ట్యా ఈ కోర్సును రెగ్యులర్‌గా చదవడమే ఉపయోగకరం. ప్రస్తుతానికైతే జియాలజీ కోర్సు దూరవిద్యలో అందుబాటులో లేదు. భవిష్యత్తులో ఎవరైనా ఈ కోర్సును దూరవిద్యలో అందిస్తామని ప్రకటిస్తే, ఆ సంస్థ విశ్వసనీయత, అది అందించే డిగ్రీల చెల్లుబాటు గురించి నిర్ధారించుకొన్న తరువాతే నిర్ణయం తీసుకోండి.

  Asked By: వైష్ణవ్

  Ans:

  -  దూరవిద్యలో చదివిన కోర్సులకూ, రెగ్యులర్‌గా చదివిన కోర్సులకూ గుర్తింపు విషయంలో తేడా ఏమీ ఉండదు. కానీ బోధనరంగంలో ఏదైనా ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు దూరవిద్యలో డిగ్రీ/ పీజీ చదివినవారి విషయపరిజ్ఞానాన్ని పరీక్షించడానికి కొన్ని లోతైన సబ్జెక్టు ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. అందుకోసం మీరు దూరవిద్యలో చదువుతున్నప్పటికీ, విషయపరిజ్ఞానంలో రెగ్యులర్‌ కోర్సు చదివేవారితో పోటీపడేట్లుగా చదవగలగాలి. ఎంఏ ఇంగ్లిష్‌ తరువాత బీఈడీ, పీ‡హెచ్‌డీ చేసే అవకాశం ఉంది. స్పోకెన్‌ ఇంగ్లిష్‌ కోర్సు చేసి స్పోకెన్‌ ఇంగ్లిష్‌ సంస్థల్లో ఇన్‌స్ట్రక్ట్టర్‌గా పనిచేయొచ్చు. కమ్యూనికేటివ్‌ ఇంగ్లిష్, టెక్నికల్‌ రైటింగ్, కంటెంట్‌ రైటింగ్, ఎకడమిక్‌ రైటింగ్, అడ్వర్‌టైజింగ్, అనువాదాల్లో సర్టిఫికెట్‌/డిప్లొమా కోర్సులూ చేయొచ్చు. ఆసక్తి ఉంటే జర్నలిజం కోర్సు చేసి, ఆ రంగంలో ఉద్యోగాల కోసం కూడా ప్రయత్నించవచ్చు.   

  - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: శ్రీనివాసులు, హైదరాబాద్‌

  Ans:

  మీరు బీఏ చదివి ఆయుర్వేదం, మూలికలపై పట్టు సాధించినా, బీఏఎంఎస్‌ చేయాలంటే జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్‌లో మెరుగైన ర్యాంకు సాధించాలి. నీట్‌ రాయాలంటే ఇంటర్మీడియట్‌లో బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలు చదివి ఉండాలి. ఎంబీబీఎస్‌ కోర్సు లాగే బీఏఎంఎస్‌ కోర్సును కూడా దూరవిద్యలో చదవడం కుదరదు. కొన్ని ప్రైవేటు సంస్థలు బీఏఎంఎస్‌ను దూరవిద్యలో అందిస్తామని ఇంటర్నెట్‌లో ప్రకటనలు ఇస్తున్నాయి. అలాంటివాటిని చూసి మోసపోకండి. ఇంజినీరింగ్, మెడిసిన్, లా, మేనేజ్‌మెంట్‌ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సులను రెగ్యులర్‌ పద్ధతిలో చదవడమే శ్రేయస్కరం. ఆగ్జిలరీ నర్స్‌ మిడ్‌వైఫ్‌ (ఏఎన్‌ఎం)గా పనిచేస్తున్న వారికోసం ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో 6 నెలల కాల వ్యవధితో సర్టిఫికెట్‌ ఇన్‌ ఆయుష్‌ నర్సింగ్‌ (ఆయుర్వేద) అందుబాటులో ఉంది. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: డి.వి. రఘురామ్‌

  Ans:

  అర్బన్‌ ప్లానింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌లో ఒక సంవత్సరం వ్యవధితో పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ డిప్లొమాను ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ దూరవిద్యలో అందిస్తోంది. అతి తక్కువ ప్రైవేటు యూనివర్సిటీలు ఈ కోర్సులను దూరవిద్యలో అందిస్తున్నాయి. అలాంటి విశ్వవిద్యాలయాలను ఎంచుకొనేముందు వాటి విశ్వసనీయతను పరీక్షించుకోండి. అర్బన్‌ ప్లానింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్, టౌన్‌ ప్లానింగ్, కంట్రీ ప్లానింగ్‌ లాంటి కోర్సులను రెగ్యులర్‌గా చదవడమే  మేలు. ఈ కోర్సులను  ప్రముఖ ఐఐటీలు, ఎన్‌ఐటీలు, సాంకేతిక విశ్వవిద్యాలయాలు, స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్, ఆర్కిటెక్చర్‌ కాలేజీలు రెగ్యులర్‌ విధానంలో అందిస్తున్నాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: నానాజీ

  Ans:

  బీఎస్సీ కార్డియాక్‌ పల్మనరీ పర్‌ఫ్యూజన్, బీఎస్సీ ఈసీజీ అండ్‌ కార్డియోవాస్క్యులర్‌ టెక్నాలజీ, బీఎస్సీ న్యూరోఫిజియాలజీ టెక్నాలజీ, బీఎస్సీ రేడియోథెరపీ టెక్నాలజీ, బీఎస్సీ రేడియోగ్రఫీ అండ్‌ ఇమేజింగ్‌ టెక్నాలజీ, కోర్సులు నాలుగు సంవత్సరాల కాలవ్యవధితో  శ్రీవేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్, తిరుపతిలో అతి తక్కువ సీట్లతో అందుబాటులో ఉన్నాయి. నాలుగు సంవత్సరాల్లో మొదటి మూడు సంవత్సరాలు కోర్స్‌ వర్క్‌ , చివరి సంవత్సరం ఇంటర్న్‌షిప్‌ ఉంటాయి. పైన చెప్పిన అన్ని కోర్సులకూ  ఇంటర్మీడియట్‌లో బైపీసీ లేదా ఇంటర్‌ వొకేషనల్‌ అండ్‌  బ్రిడ్జ్‌ కోర్సు చదివివుండాలి. బీఎస్సీ రేడియోథెరపీ టెక్నాలజీ కోర్సుకు మాత్రం ఇంటర్మీడియట్‌లో ఎంపీసీ చదివినవారు కూడా అర్హులే. ఇంటర్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్‌ ప్రాతిపదికన ప్రవేశాలు కల్పిస్తారు. ఇతర రాష్ట్రాల్లో, అతి తక్కువ ప్రైవేటు యూనివర్సిటీలు మాత్రమే ఈ కోర్సులను అందిస్తున్నాయి. ప్రైవేటు యూనివర్సిటీల/కళాశాలల ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకున్నాకే కోర్సులో ప్రవేశం పొందండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌