• facebook
  • whatsapp
  • telegram

సన్నద్ధత వ్యూహం

డిగ్రీ కాలేజీల్లో అధ్యాపకులు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల నియామకానికి నెట్‌/సెట్‌లో అర్హత తప్పనిసరి. పేప‌ర్ - 1లో టీచింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఆప్టిట్యూడ్ అంశాలు ఉండ‌గా, పేప‌ర్ - 2, 3ల‌లో ఆప్ష‌న‌ల్ స‌బ్జెక్టులు ఉంటాయి.

పేపర్‌-2, 3లు ఎలా?
పేపర్‌-2లో మొత్తం 100 మార్కులకు 50 ప్రశ్నలు ఇస్తారు. పేపర్‌-3లో 150 మార్కులకు 75 ప్రశ్నలు ఇస్తారు.3
పేపర్‌-2లో ప్రశ్నల సరళిని పరిశీలిస్తే... ప్రాథమిక భావనలతో పాటు వివిధ భావనల మధ్య అంతస్సంబంధం, వాస్తవాలు, అవగాహన స్థాయిని అంచనా వేయటానికి ప్రాధాన్యమిస్తున్నారు. పేపర్‌-3లో అభ్యర్థి అవగాహన స్థాయి, అనువర్తిత సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. ఈ రెండు పేపర్ల సిలబస్‌లలోని అంశాల్లో పెద్దగా వైరుధ్యం ఏమీ ఉండదు. కానీ పేపర్‌-3లోని అంశాలు పేపర్‌-2 అంశాలను విస్తరించే స్వభావంతో ఉంటాయి. అందుకే ఈ రెండు పేపర్లకూ సన్నద్ధత వ్యూహం వేర్వేరుగా ఉండకూడదు. మౌలికమైన అంశాల నుంచి లోతైన విషయ అవగాహన వరకూ కొనసాగాలి.
* ఈ పేపర్లలో కూడా గతంలో వచ్చిన ప్రశ్నలు పునరావృతం అవుతున్నాయి. అందుకని పూర్వపు పేపర్ల అధ్యయనం మరవకూడదు.
* ఈ పేపర్ల సిలబస్‌ అంశాలు పీజీ స్థాయిలో ఉంటాయి. మెటీరియల్‌ సేకరణకు కొద్దిపాటి కష్టం తప్పదు. మొత్తం సిలబస్‌ ఏ ఒక్క సంప్రదింపు పుస్తకంలోనో దొరకదు. విశ్వవిద్యాలయ ఆచార్యుల, సీనియర్ల సలహాలూ, సూచనలూ తీసుకుంటే ఈ విషయంలో ఎంతో ఉపయోగకరం.

Posted Date : 02-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌