• facebook
  • whatsapp
  • telegram

Warm up అంటే?


ఉపన్యాసాలంటే తొందరగా ఎవరూ ఇష్టపడరు. అయితే కొందరు మాట్లాడటం మొదలుపెట్టాక వినేవారికి దానంతటదే ఆసక్తి పెరుగుతుంది. దాన్ని చెప్పడానికి ఇంగ్లిష్‌లో ఒక వ్యక్తీకరణ ఉంది. ఏమిటది? తెలుసుకుందాం!

Anand: You had been to the conference yesterday. Could you fill me in with the details? I could not attend it because of some problems at home (నిన్న నువ్వు సమావేశానికి వెళ్లావు కదా. నాకు దాని వివరాలు చెప్తావా? ఇంట్లో ఏదో సమస్యల వల్ల నిన్న నేను హాజరు కాలేకపోయాను)

Sankar: Nothing very remarkable. But the chairman's speech was very impressive. Neither did he talk at length, nor, at the same time, he did not hold back any information. Everyone was impressed by his speech (అంత చెప్పుకోదగిందేమీ లేదు. కానీ మన  ఛైర్మన్‌ ఉపన్యాసం మాత్రం ప్రభావం కలిగించింది. ఎక్కువసేపు సాగదీయలేదు. అలాగే అంశాన్నీ విడిచిపెట్టలేదు. ప్రతి ఒక్కరికీ ఆయన ఉపన్యాసం చాలా నచ్చింది)

Anand: So I missed a good speech. My wife was ill and I had to take her to doctor, otherwise I would have attended the meeting too (అయితే నేను మంచి ఉపాన్యాసాన్ని కోల్పోయానన్నమాట. నా భార్య జబ్బుతో ఉండింది. ఆమెను డాక్టర్‌ దగ్గరికి తీసుకెళ్లాల్సి వచ్చింది. లేదంటే సమావేశానికి వచ్చుండేవాడినే).

Sankar: In the beginning the participants were a bit reluctant to listen to the chairman, but as he spoke on most of them listened with rapt attention. They did warm up to his speech and him especially. . He complemented everyone on the good work they have turned out (ప్రారంభంలో ఆయన ఉపన్యాసం వినడానికి వచ్చినవారందరూ కొంత అయిష్టంగా ఉన్నారు. కానీ వాళ్లందరూ ఆయన మాట్లాడటం మొదలుపెట్టేసరికి ఉపన్యాసాన్ని చాలా శ్రద్ధగా విన్నారు. ఆయన ముఖ్యంగా మన వాళ్ల పనిని చాలా మెచ్చుకున్నారు).

Anand: How I wish I were there! (నేను కూడా అక్కడ ఉంటే బాగుండేది కదా)

Now let us discuss the phrasal verbs from the conversation:

1. Fill me in - the original form: Fill somebody in = give all the information (సమాచారమంతా చెప్పడం).

Sudhakar: Amrith is always reserved. He does not give the complete information about anything. That is ridiculous (అమృత్‌ ఎప్పుడూ ముభావంగా ఉంటాడు. దేన్ని గురించి పూర్తి సమాచారం ఇవ్వడు. ఇది చాలా అపహ్యాసం).

Jayanth: He is always like that. He feels too lazy to fill us in with all the details (వాడెప్పుడూ అంతే. మరీ సోమరితనంగా ఉంటాడు, మనకు సమాచారం ఇచ్చేందుకు).

2. Warm up = Start listening to someone, though in the beginning we are unwilling to listen (ప్రారంభంలో ఇష్టం లేకపోయినా తరువాత ఆసక్తితో వినడం).

Ravi: The audience were at first unwilling to listen to him, but as he spoke on, they gave a patient ear to him (శ్రోతలు మొదట ఆయన ప్రసంగాన్ని వినేందుకు అయిష్టంగా ఉన్నా, ఆయన మాట్లాడటం మొదలుపెట్టాక, ఆయన చెప్పేది చాలా శ్రద్ధగా విన్నారు).

Abdul: Yea, his speech grows more and more interesting, as he speaks on, and the listeners warm up to him (అవును. మాట్లాడటం మొదలుపెట్టాక ఆయన ఉపన్యాసం ఆసక్తికరంగా ఉంటుంది. శ్రోతలు కూడా ఇష్టంగా వింటారు).

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌