• facebook
  • whatsapp
  • telegram

Gandhi was always ready to own up to his mistakes

Udai:Please go on, I am listening.

(కానీయండి, నేను వింటున్నాను.) 

Sheriff: Towards the end of the day, he owned up his mistake and apologised.

(చివరికి తన తప్పును ఒప్పుకుని క్షమాపణ అడిగాడు.)

Udai: Has he made up for the loss, he has caused to the property?

(ఆ ఆస్తికి కలిగించిన నష్టాన్ని పూడ్చాడా?)

Sheriff: He said, he was badly off and could not afford to make up the loss.

(తన పరిస్థితి బాగాలేదని, ఆ నష్టాన్ని పూడ్చే స్థోమత లేదని అన్నాడు.)

Udai: Does it mean that you didn't charge anything from him and let him off the hook?

(అంటే దానర్థం, అతడి దగ్గరేం తీసుకోకుండా వదిలేశారా?)

Sheriff: Yea, that's what happend.

(అవును, అదే జరిగింది.)

Udai: If I had been there, I would have made him pay through the nose.

(నేనక్కడ ఉండుంటే ముక్కు పిండి మొత్తం వసూలు చేసేవాడిని.)

Sheriff: I would have done that too, but that'd have come in the way of finding out the others working with him.

(అదికూడా నేను చేసుండేవాడినే, కానీ అతడితో పాటు పనిచేసే వారిని పట్టుకోవడానికి ఆటంకం అవుతుందని వదిలేశా.)

Udai: Then it's (it is) ok.

           అయితే సరే.

Look at the following expressions from the conversation above

1)       He owned up his mistakes.

2)      Has he made up for the loss he has caused.....?

3)      He said he was badly off.

4)      Does it mean that you let him off the hook?

5)      ..... I would have made him pay through his nose.

6)      ...... but that would have come in the way of finding out the others working with him.

All the expressions underlined above are very useful Phrases and Idioms.

(పైవన్నీ కూడా చాలా ఉపయోగకరమైన, ఇంగ్లిష్‌లో తరచుగా వినే Idioms and Phrases.)

      Let us study them in detail.

1) Owned up - Past tense of 'own up' = To admit that you have done something wrong = చేసిన తప్పు అంగీకరించడం, దీనికే మరోమాట Confess.

a) Jayakar: The glass panes of two of the windows of your office are broken. Who did it?

(మీ ఆఫీస్ రూమ్ కిటికీ గాజు తలుపులు పగిలిపోయాయి. ఎవరు చేశారా పని?)

Srinivas: It happened yesterday. I have been trying to find out but no one has owned up to it.

(అది నిన్న జరిగింది. ఇది ఎవరు చేసిన పనా అని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాను. ఎవరు కూడా దాన్ని ఒప్పుకోలేదు.)

Jayakar: (Do) You expect people to own up? No one these days are that honest.

(చేసిన తప్పును ఒప్పుకునే వాళ్లుంటారని అనుకుంటున్నావా? ఈ రోజుల్లో అంత నిజాయతీపరులెవరూ లేరు.)

Own up to - 'own up' is always followed by 'to' + a noun/ ....an 'ing' form - 'own up' (చేసిన తప్పు ఒప్పుకోవడం) తర్వాత ఎప్పుడూ 'to' వచ్చి, దాని తర్వాత noun లేదా '..ing' form వస్తుంది.

b) Brinda: What kind of woman is Sanjana? She appears to be the good sort, doesn't she?

(సంజన ఎలాంటిది? మంచి ఆవిడలాగే కనిపిస్తోంది కదా?)

(Sort = Kind = రకం)

Mukta: No body else is more honest than she. She has the courage to own up to any mistake she makes.

(ఆమె కంటే నిజాయతీపరులెవరూ లేరు. తను చేసే ఏ తప్పునైనా ఒప్పుకునే ధైర్యం ఆమెకు ఉంది.)

c) She has owned up to reading my diary.

(నా డైరీ చదివినట్లు తను ఒప్పుకుంది.) 

Gandhi was always ready to own up to his mistakes. (తను చేసిన తప్పులను ఒప్పుకునేందుకు గాంధీ ఎప్పుడూ సిద్ధమే.)

¤ own up = చేసిన తప్పు ఒప్పుకోవడం

గమనించాల్సిన విషయం:

1) Own up to + mistakes (noun); own up to reading my diary. Own up to + ...ing form గుర్తుంచుకుందాం.

Own up to తర్వాత noun లేదా 'ing' form వస్తుంది. 1st DW - go, come, sing etc. లాంటివి రావు. 

2) To make up for (something) = To compensate for something

కలిగించిన నష్టాన్ని భర్తీ చేయడం/ చేసిన చెడుకు పరిహారంగా మంచి చేయడం.

a) Omkar: You are working so hard.

(నువ్వు చాలా కష్టపడి పనిచేస్తున్నావు.)

Narayana: I wasted the whole of last week. Now I am just making up for the time I have lost.

(గత వారమంతా సమయం వృథా చేశాను. అలా నష్టపోయిన సమయాన్ని భర్తీ చేస్తున్నాను.)

b) Ekambaram: You were on leave for more than half of last week. When are you going to finish the work. Very little time left.

(గత వారం సగం కంటే ఎక్కువ రోజులు సెలవులోనే ఉన్నావు. పనిని ఎప్పుడు పూర్తి చేయబోతున్నావు? సమయం చాలా తక్కువగా ఉంది.) 

    Dheeraj: I am going to Make up for the lost time by working beyond office hours.

(నష్టపోయిన సమయానికి పరిహారంగా, office hours తర్వాత కూడా పని చేస్తాను.)

c) You have broken my furniture. Make up for the damage.

(నా furniture ను విరగ్గొట్టావు. నష్టాన్ని భర్తీచేయి.)

3) To be badly off = To be poor

                       = డబ్బులేకుండా/ పేదరికంలో ఉండటం. 

a) Manoj: Why don't you buy that house? You aren't badly off.

(ఆ ఇల్లు నువ్వెందుకు కొనుక్కోకూడదు? నువ్వు పేదవాడివి/ డబ్బు లేనివాడివి కాదు కదా?)

Sukumar: I certainly am not badly off, but I can't afford a house like that.

(నేనేం పేదవాడిని కాదు, కానీ అలాంటి ఇల్లు కొనుక్కునే స్థితిలో లేను.)

(Afford = కొనగల స్థితిలో ఉండటం.)

She can't afford that kind of earstuds.

(అలాంటి చెవిదుద్దులు ఆమె కొనేస్థితిలో లేదు.)

He can afford ten cars like that. 

(అలాంటి పదికార్లు కొనే స్థోమత అతడికి ఉంది.)

ఏదైనా చేస్తే సమస్యలు ఉత్పన్నమవుతాయేమోనని చేయలేకపోవడం అనే అర్థంతో, not ను ఉపయోగించి  Afford వాడొచ్చు.

We can't afford to lose any more time.

(ఇంకెంత సమయాన్ని మనం కోల్పోలేం - దానివల్ల సమస్యలు వస్తాయి.)

b) Suman: Long since we met. How is everybody? How is your brother?

(కలుసుకుని చాలా కాలం అయ్యింది. అందరూ ఎలా ఉన్నారు? మీ అన్నయ్య ఎలా ఉన్నాడు?)

Saran: Everybody is ok. The only bad news is that my brother is badly off because of his wrong investments.

(అందరూ బాగానే ఉన్నారు. మా అన్నయ్య పరిస్థితే బాగోలేదు, ఆయన పెట్టిన పెట్టుబడులే అందుకు కారణం.)

      Badly off (డబ్బులేని/పేద) × Well of (rich, సంపన్నులైన).

      Two years ago, he was struggling, but now he is well off (rich).

      (రెండేళ్ల కిందట అతడు కష్టాల్లో ఉన్నాడు, కానీ ఇప్పుడతడు బాగా ధనవంతుడే.)

4) Let someone off the hook/ get someone off the hook = Free somebody from a punishment or a difficulty/ help somebody to get out of a difficulty or without punishment.

(శిక్షపడకుండా వదిలేయడం/ సమస్య నుంచి బయట పడేయడం.)

a) Ganesh: Any news of Ramana? He was involved in some case of illegal deals.

(రమణ విషయం ఏమైంది? చట్ట విరుద్ధమైన లావాదేవీల్లో ఇరుక్కున్నాడు కదా?)

Sumanth: His closeness to some minister and that helped to be let off the hook.

(ఎవరో మంత్రితో అతడికున్న సాన్నిహిత్యం, అతడికి శిక్షపడకుండా తప్పించింది.) 

b) Hemanth: I am surprised to see you at leisure. You were supposed to be busy with the repairs to your house.

(నువ్వంత తీరిగ్గా ఉండటం నాకు ఆశ్చర్యంగా ఉంది. మీ ఇంటికి రిపేర్లు చేయించడంలో తీరిక లేకుండా ఉంటావని అనుకున్నా.)

John: I was to, but my brother has agreed to look after that, so that lets me off the hook.

(నిజంగా ఉండాల్సిందే, కానీ మా అన్న దాన్ని చూసుకోవడానికి ముందుకొచ్చాడు, అందువల్ల నాకు ఆ పని తప్పింది.)

5) To make someone pay through the nose/ to pay through the nose = To make somebody too much/ pay too much.

a) During the Uttarakhand floods, the victims had to pay through the nose even for a glass of water.

(ఉత్తరాఖండ్ వరద బాధితులు గ్లాసు నీళ్లకు కూడా ఎక్కువ చెల్లించాల్సి వచ్చింది.)

b) Janaki: How was the food in that restaurant? (ఆ రెస్ట్రాంట్‌లో పదార్థాలు ఎలా ఉన్నాయి?)

Brinda: They were really good but we had to pay through the nose.

(బాగానే ఉన్నాయి, కానీ మేం ఎక్కువ చెల్లించాల్సి వచ్చింది.)

c) If you want to really good lodge, you have to pay through the nose. 

(సౌకర్యాలున్న lodge కావాలంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.)

Note: Hotel = A place where you have a lodge/ rooms to stay and an eating place.

Hotel అంటే బస, ఆహారం రెండూ దొరికే చోటు.

Restaurant = ఆహారం మాత్రం తినగలిగిన చోటు - (pronunciation: రెస్ట్రాంట్)/ Cafe (pronunciation: క్యఫె).

6) Come in the way/ Be in the way = Obstruct (అడ్డుపడటం)/ (అడ్డంగా ఉండటం).

a) Krishna: You don't seem to like your branch manager much.

(నువ్వు మీ బ్రాంచ్ మేనేజర్‌ను అంతగా ఇష్టపడుతున్నట్లు లేదు.)

Karim: He has come twice in the way of my promotion. How do you expect me to like him? 

(రెండుసార్లు నా పదోన్నతికి అతడు అడ్డుపడ్డాడు. ఎలా ఇష్టపడతాను?)

b) Tarun: Kumar is really a genius. What is in the way of his getting a good degree?

(కుమార్ నిజంగా మేధావే కదా? మంచి డిగ్రీ పొందేందుకు ఏం అడ్డం వస్తోంది?)

Vaman: His poverty and his lack of initiative are in the way.

(పేదరికం, చొరవలేకపోవడం అతడికి అడ్డుగా ఉన్నాయి.)

    In the way = అడ్డం.

    On the way = దారిలో.

My home is on the way to the post office.

(మా ఇల్లు పోస్టాఫీసుకు వెళ్లే దారిలో ఉంది.)

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.