• facebook
  • whatsapp
  • telegram

L&T: ఎల్‌ అండ్‌ టీ 1800 తాజా ఎంపికలు

దిల్లీ: ఇంజినీరింగ్‌ దిగ్గజ సంస్థ ఎల్‌ అండ్‌ టీ కళాశాల ప్రాంగణాల్లో 1800 మందిని ఎంపిక చేసుకుని, ఉద్యోగాలిచ్చినట్లు తెలిపింది. ఇంజినీరింగ్, ఎంటెక్‌ చేసిన వారితో పాటు చార్టర్డ్‌ అకౌంటెంట్లు, డిప్లొమా హోల్డర్లు, మేనేజ్‌మెంట్‌ గ్రాడ్యుయేట్లు, సాధారణ డిగ్రీ కోర్సుల వారినీ నియమించుకున్నట్లు సంస్థ వెల్లడించింది. గ్రూప్‌ సంస్థలైన ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్, ఎల్‌ అండ్‌ టీ టెక్నాలజీ సర్వీసెస్, మైండ్‌ట్రీ-ఎల్‌ అండ్‌ టీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ విడివిడిగా తాజా ఉత్తీర్ణులను ఎంపిక చేసుకున్నట్లు ప్రకటించింది. 300కు పైగా ఐఐటీలు, ఎన్‌ఐటీలతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు రంగ అగ్రశ్రేణి కళాశాలల నుంచి 36,000 మంది అభ్యర్థులను పరీక్షించి, వీరిని ఎంపిక చేసుకున్నట్లు వివరించింది. ఇందుకోసం దృశ్యమాధ్యమ పద్ధతిలో 8,000కు పైగా ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు తెలిపింది.

Posted Date : 28-08-2021