• facebook
  • twitter
  • whatsapp
  • telegram

50 వేల అవకాశాలు

గ్రాండ్‌ సమ్మర్‌ ఇంటర్న్‌షిప్‌ ఫెయిర్‌- 2024


కెరియర్‌-టెక్‌ వేదిక ఇంటర్న్‌శాల ‘గ్రాండ్‌ సమ్మర్‌ ఇంటర్న్‌షిప్‌ ఫెయిర్‌ (జీఎస్‌ఐఎఫ్‌)-2024’ ప్రారంభించింది. దీని ద్వారా విద్యార్థులకు 50 వేల ఇంటర్న్‌షిప్‌ అవకాశాలను కల్పించనున్నారు. ఆసక్తి ఉన్న వారు మే 2 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. 

జీఐఎస్‌ఎఫ్‌-2024లో భాగంగా ఐదు వేలకు పైగా చిన్న, మధ్య, భారీ పరిశ్రమలు, అంకురాలు వేర్వేరు విద్యా నేపథ్యాలు ఉన్న విద్యార్థులకు అవకాశాలు కల్పిస్తారు. తమ ఆసక్తి, నైపుణ్యాల ఆధారంగా విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. 50 వేల ఇంటర్న్‌షిప్‌ల్లో.. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్, పార్ట్‌-టైమ్, అంతర్జాతీయ, ప్రీ-ప్లేస్‌మెంట్‌ అవకాశాలతో అందుబాటులో ఉన్నాయి. 


ఎన్ని రకాలు?

సమ్మర్‌ ఇంటర్న్‌షిప్‌ల్లో... మార్కెటింగ్, లా, డిజిటల్‌ మార్కెటింగ్, ప్రోగ్రామింగ్, వీడియో ఎడిటింగ్‌ అండ్‌ మేకింగ్, వెబ్‌ డెవలప్‌మెంట్, పైతాన్‌ డెవలప్‌మెంట్, కంటెంట్‌ రైటింగ్, సేల్స్, హ్యూమన్‌ రిసోర్సెస్, బిజినెస్‌ డెవలప్‌మెంట్, సోషల్‌ మీడియా, డేటా అనలిటిక్స్, టీచింగ్, ఆపరేషన్స్, ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్, గ్రాఫిక్‌ డిజైన్, అకౌంటింగ్, ఫైనాన్స్‌ మొదలైన రకాలు ఉన్నాయి. 

స్టైపెండ్‌: జీఐఎస్‌ఎఫ్‌-2024 ఇంటర్న్‌షిప్‌లు అన్నింటికీ సర్టిఫికెట్‌తోపాటు స్టైపెండ్‌ కూడా చెల్లిస్తారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు నెలకు రూ.లక్ష సంపాదించే అవకాశాన్ని అందిపుచ్చుకోవచ్చు.

ఏ సంస్థల్లో: స్విగ్గీ, జొమాటో, పేటీఎం, గోద్రెజ్, రిలయన్స్‌ బ్రాండ్స్, టైమ్స్‌ ఇంటర్నెట్, కల్ట్‌ఫిట్, ఫిజిక్స్‌ వాలా, అర్బన్‌ కంపెనీ, ఆదిత్య బిర్లా క్యాపిటల్, ఇండియా టీవీ నెట్‌వర్క్, పర్పుల్, థామస్‌ కుక్, క్లియర్‌ ట్యాక్స్‌.. మొదలైన ప్రముఖ సంస్థలు ఇంటర్న్‌షిప్‌ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. 

వ్యవధి: నెల నుంచి ఆరు నెలల వ్యవధి ఉన్నవీ, పార్ట్‌టైమ్‌ ఇంటర్న్‌షిప్‌లు (రోజుకు 2-3 గంటలు పనిచేసేవి), షార్ట్‌టర్మ్‌ ఇంటర్న్‌షిప్‌లు (2-3 వారాలు) అందుబాటులో ఉన్నాయి. ఇవి మే నుంచి జూన్‌ మధ్యలో ఎప్పుడైనా ప్రారంభం కావచ్చు.  

ఉచితం: సమ్మర్‌ గ్రాండ్‌ ఫెయిర్‌లో పాల్గొనేవారు ఎలాంటి ఫీజూ చెల్లించనవసరం లేదు. ఉచితంగా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవచ్చు


ఎంపిక ఎలా?

దరఖాస్తుదారుల నుంచి విద్యార్హతల ఆధారంగా కొంతమందిని ఎంపిక చేస్తారు. వారికి ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. విద్యార్థులు ఒకటికంటే ఎక్కువ ఇంటర్న్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకుంటే.. ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎంపికైనవారికి సమాచారాన్ని ఈమెయిల్‌ ద్వారా తెలియజేస్తారు. మూడు రోజుల్లో అభ్యర్థులు తమ పూర్తి వివరాలతో సమాధానం ఇవ్వాలి. లేనట్లయితే ఆ తర్వాతి స్థానంలో ఉన్న విద్యార్థిని ఎంపిక చేస్తారు. 

‘విద్యార్థి ఉద్యోగ ప్రస్థానంలో ఇంటర్న్‌షిప్‌లనేవి అంతర్భాగం అయిపోయాయి. ఏడాది పొడవునా ఇంటర్న్‌షిప్‌లకు అవకాశం ఉన్నప్పటికీ.. సమ్మర్‌ ఇంటర్న్‌షిప్‌లు ప్రత్యేకమైనవి. వీటికి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని గ్రాండ్‌ సమ్మర్‌ ఇంటర్న్‌షిప్‌ ఫెయిర్‌ను ఏర్పాటుచేశాం. విభిన్న పరిశ్రమలకు చెందిన 50 వేల ఇంటర్న్‌షిప్‌లను అందుబాటులోకి తీసుకొచ్చా’మని ఇంటర్న్‌శాల వ్యవస్థాపకులూ, సీఈఓ తెలిపారు.

పూర్తి వివరాలకు: https://bit.ly/GSIF-2024 చూడొచ్చు.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ కెరియర్‌లో గేమ్‌ ఛేంజర్‌!

‣ సాయుధ దళాల్లో చేరతారా?!

‣ మెరుగైన కెరియర్‌కు.. కన్స్యూమర్‌ లా!

‣ ఈ ఏడు నైపుణ్యాలతో ఐటీ ప్రొఫెషనల్స్‌గా..!

‣ ఎన్నికల శాస్త్రాన్ని ఎంచుకుందామా!

‣ పరీక్ష యాంగ్జైటీ.. తగ్గేది ఇలా!

‣ కోచింగ్‌ లేదు... డెయిలీ టార్గెట్స్‌ పూర్తీచేశా!

Posted Date : 30-04-2024 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.