• facebook
  • whatsapp
  • telegram

నూతన విద్యా విధానంతో నాణ్యమైన విద్య

* ఏఐసీటీఈ ముఖ్య సమన్వయ అధికారి చంద్రశేఖర్‌ 

ఈనాడు, హైదరాబాద్‌: జాతీయ నూతన విద్యా విధానం అమలుతో సంప్రదాయ విద్యతోపాటు సాంకేతిక విద్యలోనూ నాణ్యత పెరగనుందని అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) ముఖ్య సమన్వయ అధికారి చంద్రశేఖర్‌ బుద్దా చెప్పారు. స్టాన్లీ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఇంజినీరింగ్‌లో గణితం, ప్రాధాన్యం అనే అంశంపై సెప్టెంబ‌రు 15న‌ అంతర్జాతీయ సదస్సు మొదలైంది. ఓయూ రిజిస్ట్రార్‌ లక్ష్మీనారాయణ సదస్సును ప్రారంభించగా.. దిల్లీ నుంచి చంద్రశేఖర్‌ వర్చువల్‌ విధానంలో హాజరై మాట్లాడారు. ఈ విద్యా సంవత్సరం నుంచి 11 ప్రాంతీయ భాషల్లో ఇంజినీరింగ్‌ విద్యను అందిస్తున్నామని, దేశవ్యాప్తంగా 14 కళాశాలలు అందుకు దరఖాస్తు చేసుకున్నాయని తెలిపారు. ప్రాంతీయ భాషల్లో బీటెక్‌ చదివేందుకు కృత్రిమ మేధ సహాయంతో పాఠ్య పుస్తకాలను అనువాదం చేసినట్లు చెప్పారు. అమ్మ భాషలో చదువుకుంటే ఆయా భావనలు (కాన్సెప్ట్స్‌) బాగా అర్థమవుతాయన్నారు. మాతృభాషలో చదువుకోమంటే ఆంగ్లం నేర్చుకోవద్దని కాదన్నారు. మొత్తం 14 దేశాల నుంచి ప్రతినిధులు సదస్సుకు ఆన్‌లైన్‌ ద్వారా హాజరయ్యారు. 

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

సీఏ కోర్సు రుసుం మినహాయింపు

శ్రద్ధగా.. చురుగ్గా చదవలేకపోతున్నారా ?

Posted Date : 16-09-2021