* టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ప్రకటన
తెలంగాణలో పోలీసు ఉద్యోగాల నియామకాలకు సంబంధించి ఎత్తు విషయంలో అనుత్తీర్ణులైన అభ్యర్థులకు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) తీపి కబురు అందించింది. పోలీసు శారీరక కొలతలు/ సామర్థ్య పరీక్షలో 1 సెం.మీ., అంతకంటే తక్కువ ఎత్తులో అనుత్తీర్ణులైన అభ్యర్థులకు మరోసారి పీఎంటీ/ పీఈటీ కోసం దరఖాస్తు చేసుకోవాలని నియామక మండలి సూచించింది. ఫిబ్రవరి 10వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఫిబ్రవరి 12వ తేదీ రాత్రి 8 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. దరఖాస్తు చేసుకున్న తర్వాత దరఖాస్తు పత్రం, అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవాలని పేర్కొంది. అంబర్‌పేట(హైదరాబాద్) పోలీస్ గ్రౌండ్స్, కొండాపూర్(రంగారెడ్డి జిల్లా)లోని బెటాలియన్‌లో పీఎంటీ/ పీఈటీ నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.