• facebook
  • whatsapp
  • telegram

అంబేడ్కర్‌ వర్సిటీ కోర్సుల్లో ప్రవేశ గడువు పొడిగింపు

 

జూబ్లీహిల్స్, న్యూస్‌టుడే: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల గడువును పొడిగించినట్లు వర్సిటీ అధికారులు ఆగస్టు 27న  తెలిపారు. డిగ్రీలోని బీఏ/బీకాం/బీఎస్సీతోపాటు పీజీలోని బీఎల్‌ఐఎస్సీ, ఎంఎల్‌ఐఎస్సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్‌ కోర్సుల్లో చేరడానికి సెప్టెంబరు 3వ తేదీ వరకు గడువును పొడిగించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, కోర్సుల్లో చేరడానికి విద్యార్హతలు, రుసుం తదితర వివరాలను www.braouonline.in లో పొందుపరచామన్నారు. పూర్తి వివరాలను 73829 29570/580, 040 23680290/291/294/295 ఫోన్‌ నంబర్లలో తెలుసుకోవాలని సూచించారు. 

Posted Date : 27-08-2021