• facebook
  • whatsapp
  • telegram

40 % పాఠశాలల్లో ఆన్‌లైన్‌ బోధన

* భౌతిక బోధనకు  అనుకూలంగా లేని స్కూళ్లు 
*  తెలుగు రాష్ట్రాల్లో యంగ్‌లైవ్స్‌  ఇండియా అధ్యయనం

ఈనాడు, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పరిమితంగా ఆన్‌లైన్‌ బోధన జరుగుతోందని యంగ్‌లైవ్స్‌ ఇండియా సంస్థ వెల్లడించింది. కేవలం 40 శాతం పాఠశాలల్లోనే ఈ విధానం అమలవుతోందని, సందేహాల నివృత్తికి 50 శాతం బడుల్లో ఉపాధ్యాయుల నుంచి ఫోన్‌కాల్స్‌ ద్వారా విద్యార్థులకు అవసరమైన సహాయం లభిస్తోందని తెలిపింది. కరోనా సమయంలో విద్యార్థులకు సహాయం చేసేందుకు పాఠశాలలు సిద్ధంగా ఉన్నాయా? అన్న అంశంపై తెలుగు రాష్ట్రాల్లో 183 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ప్రిన్సిపల్స్‌తో యంగ్‌లైవ్స్‌ ఇండియా సంస్థ అధ్యయనం చేసి రెండు రోజుల క్రితం నివేదిక విడుదల చేసింది. 
 

సర్వే అసర్వే అంశాలు
సగానికి పైగా విద్యార్థులకు ఇంటర్నెట్‌ అందుబాటులో లేదు.
కరోనా కారణంగా పాఠశాలలు భౌతిక బోధనకు అనుకూలంగా లేవు. 
గ్రామాల్లోని పేదకుటుంబాల్లోని పిల్లల డ్రాపవుట్లు పెరిగే అవకాశముంది. బాలికలు చదువుకు దూరమయ్యే ప్రమాదముంది.
విద్యార్థులకు సిలబస్‌కు సంబంధించిన పుస్తకాల పంపిణీ తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో 62 శాతం ఉంటే.. ఏపీలో 45 శాతమే ఉంది. 
టీవీ, రేడియోతో పాటు డిజిటల్‌ పరికరాలు అందుబాటులో లేని ప్రాంతాల విద్యార్థులకు ముద్రించిన పాఠ్యాంశాలను పంపిణీ చేయాలి. 
ప్రైవేటు పాఠశాలల్లో ఆన్‌లైన్‌ బోధనకు నూతన   ఆవిష్కరణలు చేస్తున్న వారిని ప్రభుత్వం ప్రోత్సహించాలి. 
 

ఎదురవుతున్న సవాళ్లు (శాతాల్లో) 
విద్యార్థులకు టెక్నాలజీ అందుబాటులో లేని పాఠశాలలు: 90 
ఇంటర్నెట్‌ సదుపాయం లేని విద్యార్థులు: 72 
ప్రోత్సాహం అందుతున్నవారు: 44 
ఇతర కుటుంబ బాధ్యతలు ఎదుర్కొంటున్న        విద్యార్థులు: 35 
టెక్నాలజీ వినియోగానికి నైపుణ్యం లేని విద్యార్థులు: 42 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 20-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.