అంబర్‌పేట, న్యూస్‌టుడే: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నిరుద్యోగ యువతీయువకులకు మైక్రోసాఫ్ట్ సంస్థ సామాజిక బాధ్యతలో భాగంగా ఉచితంగా ఆన్లైన్ శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్మాణ్ సంస్థ సమన్వయకర్త నిరంజన్‌యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. 2017-2020 మధ్య బీటెక్, ఎంటెక్ (ఐటీ, సీఎస్ఈ, ఈసీఈ) బీసీఏ, ఎంసీఏ, బీఎస్సీ, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్‌లో ఉత్తీర్ణులైన వారికి మూడు నెలలపాటు ఆండ్రాయిడ్ డెవలప్మెంట్, ఆంగ్లర్ జేఎస్, జావా స్క్రిప్ట్, కోర్ జావా, బూట్‌స్ట్రాప్, సీఎస్ఎస్, ఏఎస్పీ.నెట్, హెచ్‌టీఎంఎల్, సాఫ్ట్ స్కిల్స్, జేక్వైరీ, పీహెచ్‌పీ, మైక్రోసాఫ్ట్ ఎస్‌క్యూఎల్, సీషార్ప్, ఎక్స్ఎంఎల్ ప్లస్ ఎక్స్‌ఎస్‌ఎల్‌టీ, డబ్ల్యూపీఆర్ కోర్సుల్లో ఉచితంగా ఆన్లైన్లో శిక్షణ ఉంటుందని వివరించారు. ఆసక్తి గలవారు జనవరి 25లోపు ఫోన్ నంబరు: 9100810928, ఆన్లైన్ లింక్ http://bit.ly/ RegistrationLinkFRYSP ద్వారా పేర్లను నమోదు చేయించుకోవాని సూచించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.