• facebook
  • twitter
  • whatsapp
  • telegram

డిగ్రీతో ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటిలో ఉద్యోగాలు

906 సెక్యూరిటీ స్ర్కీనర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా కార్గో లాజిస్టిక్స్‌ అండ్‌ అల్లైడ్‌ సర్వీసెస్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఏఏఐసీఎల్‌ఏఎస్‌) 906 సెక్యూరిటీ స్క్రీనర్‌ (ఫ్రెషర్‌) పోస్టులను భర్తీచేయనుంది. దేశంలో ఎక్కడైనా పనిచేయడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.


01.11.2023 నాటికి 60 శాతం మార్కులతో డిగ్రీ పాసైన జనరల్‌ అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులైతే 55 శాతం మార్కులు సరిపోతాయి. 


ఇంగ్లిష్, హిందీ భాషల్లో రాసే, మాట్లాడగలిగే నైపుణ్యం ఉండాలి. స్థానిక భాష తెలిసి ఉండాలి. 


01.11.2023 నాటికి 27 సంవత్సరాలు మించకూడదు. 


ఎంపికైన అభ్యర్థులు ఎయిర్‌పోర్టులు, కార్గో కాంప్లెక్సుల్లో కార్గో స్క్రీనింగ్, సెక్యూరిటీ విధులను నిర్వర్తించాలి. 


జనరల్‌/ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.750. ఎస్సీ/ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, మహిళా అభ్యర్థులకు రూ.100. ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలి. 


ఎంపిక విధానం

వచ్చిన దరఖాస్తుల నుంచి షార్ట్‌లిస్ట్‌ను తయారుచేసి అభ్యర్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తారు. కలర్‌ బ్లైండ్‌నెస్‌ దృశ్య, వినికిడి సమస్యలు ఉండకూడదు. భావవ్యక్తీకరణ సామర్థ్యం, శారీరక దృఢత్వం ఉండాలి. 

గరిష్ఠ వయసులో ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీ (ఎన్‌సీఎల్‌)లకు 3 ఏళ్లు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు 5 ఏళ్ల సడలింపు ఉంటుంది. 

వైద్య పరీక్షల అనంతరం అభ్యర్థులను.. ఫిక్స్‌డ్‌ టర్మ్‌ కాంట్రాక్ట్‌ బేసిస్‌లో మూడేళ్ల కాలానికి ఎంపిక చేస్తారు. ఏడాదిపాటు ప్రొబేషన్‌ వర్తిస్తుంది. ఈ సమయంలో నెలకు రూ.15,000 స్టైపెండ్‌ చెల్లిస్తారు. 

ఎంపికైన అభ్యర్థులకు కొన్ని కోర్సుల్లో శిక్షణనిస్తారు. వీటిల్లో తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాలి. 

ఏవీఎస్‌ఈసీ ఇండక్షన్‌ కోర్స్‌ - 5 రోజులు

ఎట్‌ ఎయిర్‌పోర్ట్‌/ఆర్‌ఏ - మూడు నెలలు

ఏవీఎస్‌ఈసీ బేసిక్‌ కోర్స్‌ - 14 రోజులు

ఎట్‌ ఎయిర్‌పోర్ట్‌ - నెల రోజులు

స్క్రీనర్స్‌ ప్రీ-సర్టిఫికేషన్‌ కోర్సు - 3 రోజులు

టెస్టింగ్‌ అండ్‌ సర్టిఫికేషన్‌ ఆఫ్‌ స్క్రీనర్‌ - 2 రోజులు


ఈ శిక్షణలన్నింటినీ ఆరు నెలల వ్యవధిలో పూర్తిచేయాలి. ఒక్కో పరీక్షను రెండు ప్రయత్నాల్లో పూర్తిచేయొచ్చు. మొదటి ప్రయత్నంలో విఫలమైనట్టయితే అభ్యర్థి స్టైపెండ్‌ను నెలకు రూ.15,000 నుంచి రూ.10,000 తగ్గిస్తారు. రెండుసార్లూ విఫలమైనట్లయితే కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తారు. 


శిక్షణను పూర్తిచేసుకున్న అభ్యర్థులకు మొదటి ఏడాది నెలకు రూ.30,000 వేతనం చెల్లిస్తారు. రెండో ఏడాది రూ.32,000, మూడో ఏడాది రూ.34,000. దీనికి అదనంగా టూర్లకు వెళ్లినప్పుడు టీఏ/డీఏ/లాడ్జింగ్, బోర్డింగ్‌ సదుపాయాలూ ఉంటాయి. ఉద్యోగికీ, కుటుంబ సభ్యులకూ వర్తించే విధంగా పీఎఫ్, గ్రాట్యుటీ, మెడికల్‌ ఇన్సూరెన్స్‌ సదుపాయాలు ఉంటాయి.  


ఎంపికైన అభ్యర్థులను సంస్థ పాలనాపరమైన అవసరాల నిమిత్తం చెన్నై, కోల్‌కతా, గోవా, కోజీకోడ్‌ (కాలికట్‌), వారణాసి, శ్రీనగర్, వడోదరా, మదురై, తిరుపతి, రాయ్‌పుర్, వైజాగ్, ఇందౌర్‌Â, అమృత్‌సర్, భువనేశ్వర్, అగర్తలా, పోర్ట్‌బ్లెయిర్, తిరుచి, దెహ్రాదూన్, పుణె, సూరత్, లేహ్, పట్నాల్లో ఎక్కడైనా నియమించవచ్చు. 


ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 08.12.2023


వెబ్‌సైట్‌: https://www.aaiclas.aero/
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌లో కెరియర్ అవకాశాలు

‣ ఐడీబీఐ బ్యాంకులో 2,100 కొలువులు

‣ నూతన ఆవిష్కరణలే ధ్యేయం!

‣ ‘ఏఐ’ ముప్పు తప్పేలా!

‣ నాయకత్వ లక్షణాలు పెంచుకుందాం!

Posted Date : 28-11-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌