చదువుకునే పిల్లలు ఉన్న ఇళ్లల్లో పుస్తకాలకు కొదవే ఉండదు. అన్నింటినీ ఒకేచోట ఒకదానిమీద ఒకటి పెట్టేస్తే ఏవేంటో తెలీదు, తీసేటప్పుడు కూడా అంత సౌలభ్యంగా ఉండదు. అలా అని అల్మారాలో సర్దుతుంటే పుస్తకాలు వంగిపోవడం, అడుగులు చిరిగిపోవడం జరుగుతుంటాయి. ఈ ఇబ్బందులు లేకుండా పుస్తకాలను జాగ్రత్తగా, ఒక పద్ధతిలో పేర్చుకునేందుకు సహకరించేవే బుక్ ఎండ్స్. విద్యార్థులకు ఇవి చాలా ఉపకరిస్తాయి.

‣ ఇప్పుడు వస్తున్న మోడల్స్‌లో పదిపన్నెండు పుస్తకాలను పెట్టుకునేంత చోటు ఉంటోంది. అవసరం లేనప్పుడు మడిచి పెట్టేసే వీలున్న వీటిని ఇనుము, చెక్క, ప్లాస్టిక్‌తో తయారుచేస్తున్నారు. ఇందులో పుస్తకాలను జాగ్రత్తగా భద్రపరుచుకోవచ్చు. కొన్నింటికి పెన్నులు, పెన్సిళ్లను పెట్టుకునే హోల్డర్స్ కూడా ఉంటున్నాయి. అందువల్ల ఇవి ఉంటే చదువుకునే చోటు చక్కగా కనిపిస్తుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఇతర ఈకామర్స్ సైట్లలో విరివిగా లభిస్తున్నాయివి.
********************************************************
మరింత సమాచారం ... మీ కోసం!
‣ విపత్కర సమయాల్లో ధైర్యంగా ఉండే?
‣ సమస్యలు పరిష్కరించే సత్తా మీలో ఉందా?
‣ పీజీలో ప్రవేశాలకు సీపీగెట్-2022
‣ ఆలోచనల పరిధి పెంచే ఐఐటీ కోర్సు!
‣ ఫిజియోథెరపీలో ప్రామాణిక శిక్షణ