• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఎన్‌ఐఎన్‌లో క్లర్క్‌ అవుతారా?

హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్‌కు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (ఎన్‌ఐఎన్‌) లోయర్‌ డివిజన్‌ క్లర్క్, అప్పర్‌ డివిజన్‌ క్లర్క్, లైబ్రరీ క్లర్క్, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్‌ (గ్రూప్‌-సీ) పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి ప్రింటవుట్‌ను భద్రపరుచుకోవాలి.

1. లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌-6: పన్నెండో తరగతి/ తత్సమాన పరీక్ష పాసవ్వాలి. కంప్యూటర్‌ పైన ఇంగ్లిష్‌లో నిమిషానికి 35 పదాలు లేదా హిందీలో 30 పదాలు టైప్‌ చేయాలి. గరిష్ఠ వయసు 27 సంవత్సరాలు.

2. అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌-7: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. కంప్యూటర్‌పైన ఇంగ్లిష్‌ టైపింగ్‌ వేగం నిమిషానికి 35 పదాలు లేదా హిందీలో 30 పదాలు ఉండాలి. గరిష్ఠ వయసు 27 సంవత్సరాలు.

3. లైబ్రరీ క్లర్క్‌-1: పదో తరగతి/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. ఇంటర్మీడియట్‌ చదివిన వారికి ప్రాధాన్యం. లైబ్రరీ సైన్స్‌లో సర్టిఫికెట్‌ కోర్సు పూర్తిచేయాలి. గరిష్ఠ వయసు 28 సంవత్సరాలు.

4. లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్‌-1: లైబ్రరీ సైన్స్‌/ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తిచేయాలి. కేంద్ర/ పీఎస్‌యూ/ యూనివర్సిటీ/ పరిశోధన/ విద్యా సంస్థల్లో రెండేళ్ల ఉద్యోగానుభవం ఉండాలి. కంప్యూటర్‌ అప్లికేషన్‌ డిప్లొమా ఉన్నవారికి ప్రాధాన్యం. గరిష్ఠ వయసు 30 సంవత్సరాలు.

గరిష్ఠ వయసులో ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పది నుంచి పదిహేనేళ్లు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌కు మూడేళ్ల సడలింపు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నలభై సంవత్సరాల వరకూ, కేంద్ర ప్రభుత్వ ఎస్సీ/ఎస్టీ ఉద్యోగులకు నలబైఐదు ఏళ్ల వరకూ సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు రూ.1200, ఎస్సీ/ఎస్టీ/ఎక్స్‌-సర్వీస్‌మెన్‌/మహిళలకు రూ.1000. పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు.


   ఎంపిక ఎలా?   

కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలో 90 ప్రశ్నలకు 90 మార్కులు ఉంటాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు.

లోయర్‌ డివిజన్‌ క్లర్క్, అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌ పోస్టులకు:

1. జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ 25 ప్రశ్నలు - 25 మార్కులు

2. జనరల్‌ అవేర్‌నెస్‌ 20 ప్రశ్నలు - 20 మార్కులు

3. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ - 20 ప్రశ్నలు - 20 మార్కులు

4. ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌ 25 ప్రశ్నలు - 25 మార్కులు

ఈ పరీక్షలో అన్‌రిజర్వుడ్‌ అభ్యర్థులు 50 శాతం, ఓబీసీలు 45 శాతం, ఎస్సీ/ఎస్టీ/ఇతరులు 40 శాతం కనీసార్హత మార్కులు సాధించాలి. సీబీటీలో కనీసార్హత మార్కులు సాధించినవారిని 1:3 లేదా 1:5 నిష్పత్తిలో స్కిల్‌ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు.

కంప్యూటర్‌ స్కిల్‌ టెస్ట్‌: దీంట్లో భాగంగా కంప్యూటర్‌ పైన టైపింగ్‌ టెస్ట్‌ ఉంటుంది. వ్యవధి పది నిమిషాలు. టైపింగ్‌ వేగం ఇంగ్లిష్‌లో నిమిషానికి 35 పదాలు లేదా హిందీలో నిమిషానికి 30 పదాలు ఉండాలి.

లైబ్రరీ క్లర్క్‌ పోస్టు: ఐదు అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు.

1. జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ 10 ప్రశ్నలు - 10 మార్కులు

2. జనరల్‌ అవేర్‌నెస్‌ 10 ప్రశ్నలు - 10 మార్కులు

3. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 10 ప్రశ్నలు - 10 మార్కులు

4. ఇంగ్లిష్‌ 10 ప్రశ్నలు - 10 మార్కులు

5. లైబ్రరీ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ 50 ప్రశ్నలు - 50 మార్కులు

లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్‌ పోస్టు:  ప్రశ్నపత్రంలో లైబ్రరీ క్లర్క్‌ పోస్టుకు మాదిరిగానే జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్, జనరల్‌ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్, లైబ్రరీ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ల్లో 90 ప్రశ్నలకు 90 మార్కులు. వ్యవధి 90 నిమిషాలు.

దరఖాస్తుకు చివరి తేదీ: 25.06.2024

అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడింగ్‌: జులై 2024

కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష: జులై 2024


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ వినూత్న కెరియర్‌కు.. మాలిక్యులర్‌ జెనెటిక్స్‌!

‣ కొలువులు కురిపించే కంప్యూటర్‌ మేఘం!

‣ గ్రామీణ బ్యాంకుల్లో 9995 ఉద్యోగాలు

‣ ఎంపీసీతో ఎనలేని అవకాశాలు!

‣ సరిహద్దు భద్రతా దళంలో ఎస్సై, ఏఎస్సై కొలువులు

‣ వాతావరణ శాస్త్రంతో విభిన్న కెరియర్‌

Posted Date : 15-06-2024 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌