• facebook
  • twitter
  • whatsapp
  • telegram

కాటన్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు

జులై 07 దరఖాస్తు గడువు



నవీ ముంబయిలోని ప్రభుత్వ రంగ సంస్థ కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) లిమిటెడ్‌ 214 పోస్టులను భర్తీ చేయబోతోంది. అసిస్టెంట్‌ మేనేజర్, మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ, జూనియర్‌ అసిస్టెంట్‌ మొదలైన కొలువులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేస్తారు.


మొత్తం పోస్టుల్లో... అసిస్టెంట్‌ మేనేజర్‌ (లీగల్‌)-1, అసిస్టెంట్‌ మేనేజర్‌ (అఫిషియల్‌ లాంగ్వేజ్‌)-1, మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ (మార్కెటింగ్‌)-11, మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ (అకౌంట్స్‌)-20, జూనియర్‌ కమర్షియల్‌ ఎగ్జిక్యూటివ్‌-120, జూనియర్‌ అసిస్టెంట్‌ (జనరల్‌)-20, జూనియర్‌ అసిస్టెంట్‌ (అకౌంట్స్‌)-40, జూనియర్‌ అసిస్టెంట్‌ (హిందీ ట్రాన్స్‌లేటర్‌)-1 ఖాళీలు ఉన్నాయి.


ఏ పోస్టులకు ఎవరు అర్హులు?

1. మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ (మార్కెటింగ్‌) - 11: అగ్రికల్చర్‌ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ/ ఎంబీఏతో సమానమైన వ్యవసాయ సంబంధిత మేనేజ్‌మెంట్‌ కోర్సు పూర్తిచేయాలి. 

2. మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ (అకౌంట్స్‌) - 20: సీఏ/ సీఎంఏ పాసవ్వాలి. 

3. జూనియర్‌ కమర్షియల్‌ ఎగ్జిక్యూటివ్‌ - 120: 50 శాతం మార్కులతో బీఎస్సీ అగ్రికల్చర్‌ డిగ్రీ ఉత్తీర్ణత. ఎస్సీ/ఎస్టీ/ దివ్యాంగులు 45 శాతం మార్కులు సాధించాలి. 

4. జూనియర్‌ అసిస్టెంట్‌ (జనరల్‌) - 20: బీఎస్సీ అగ్రికల్చర్‌ డిగ్రీ 50 శాతం మార్కులతో పాసవ్వాలి. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు 45 శాతం మార్కులు సాధించాలి.

5. జూనియర్‌ అసిస్టెంట్‌ (అకౌంట్స్‌) - 40: 50 శాతం మార్కులతో బీకాం డిగ్రీ ఉత్తీర్ణత. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు 45 శాతం మార్కులు సాధించాలి.

అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుకు 32 ఏళ్లు, ఇతర పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు. గరిష్ఠ వయసులో ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ (ఎన్‌సీఎల్‌)కు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పది నుంచి పదిహేనేళ్లు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌కు మూడేళ్ల సడలింపు ఉంటుంది. 

జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీలకు దరఖాస్తు ఫీజు రూ.1500, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ ఎక్స్‌-సర్వీస్‌మెన్‌కు రూ.500. 



పరీక్ష పత్రంలో...

కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ)లో మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ (మార్కెటింగ్‌), మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ (అకౌంట్స్‌), జూనియర్‌ కమర్షియల్‌ ఎగ్జిక్యూటివ్, జూనియర్‌ అసిస్టెంట్‌ (జనరల్‌), జూనియర్‌ అసిస్టెంట్‌ (అకౌంట్స్‌) పోస్టులకు ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటాయి. ప్రశ్నపత్రంలో ఐదు యూనిట్లు, 120 ప్రశ్నలు ఉంటాయి. వ్యవధి 120 నిమిషాలు. సరైన సమాధానానికి ఒకమార్కు. ప్రతి తప్పు సమాధానానికీ పావుమార్కు తగ్గిస్తారు.

యూనిట్‌-1లో జనరల్‌ ఇంగ్లిష్, ఆర్టికల్స్, ప్రిపొజిషన్స్, ఒకాబ్యులరీ, రీడింగ్‌ అండ్‌ కాంప్రహెన్షన్, సిననిమ్స్, జంబుల్డ్‌ సెంటెన్సెస్‌ నుంచి: 15 ప్రశ్నలు. 

యూనిట్‌-2లో రీజనింగ్‌-సిలాజిజం, డైరెక్షన్‌-డిస్టెన్స్, ఆర్డరింగ్‌-ర్యాంకింగ్, బ్లడ్‌ రిలేషన్, డేటా ఇంటర్‌ప్రెటేషన్, కోడింగ్‌-డీకోడింగ్, డేటా సఫిషియన్సీ, సిరీస్‌ కంపైలేషన్, పజిల్స్, ప్యాట్రన్‌ కంప్లీషన్‌: 15 ప్రశ్నలు. 

యూనిట్‌-3లో క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ - రేషియో అండ్‌ ప్రపోర్షన్, టైమ్‌-వర్క్, స్పీడ్‌-డిస్టెన్స్, పర్సంటేజస్‌-యావరేజెస్, ప్రాఫిట్, లాస్‌-డిస్కౌంట్, ప్రాబబిలిటీ, సింపుల్‌-కాంపౌండ్‌ ఇంట్రెస్ట్‌: 15 ప్రశ్నలు.

యూనిట్‌-4లో జనరల్‌ నాలెడ్జ్‌ - ఇండియన్‌ జాగ్రఫీ, ఇండియన్‌ ట్రేడ్‌ అండ్‌ ఎకానమీ, కరెంట్‌ అఫైర్స్‌ - ప్రపంచం, భారతదేశం, సైంటిఫిక్‌ రిసెర్చ్, అవార్డులు, క్రీడలు, ప్రపంచ భౌగోళిక స్థితిగతులు: 15 ప్రశ్నలు. 

యూనిట్‌-5లో సబ్జెక్టు పరిజ్ఞానం: 60 ప్రశ్నలు.

అన్ని పోస్టులకూ నాలుగు భాగాలు ఒకే   విధంగా ఉంటాయి. ఐదో భాగంలో మాత్రం విద్యార్హతలకు సంబంధించిన సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు. యూఆర్‌/ఈడబ్ల్యూఎస్‌/ఓబీసీ అభ్యర్థులు 40 శాతం, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్‌-సర్వీమెన్‌లు 35 శాతం మార్కులు సాధించాలి.    


సన్నద్ధత

ముందుగా పరీక్ష విధానం, సిలబస్‌ మీద స్పష్టమైన అవగాహన తెచ్చుకోవాలి. దీంతో ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉండదు. 

విద్యార్హతలకు సంబంధించిన సబ్జెక్టుల నుంచి 60 ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి ముఖ్యాంశాలను పునశ్చరణ చేసుకుంటే ఎక్కువ మార్కులు సాధించే అవకాశం ఉంటుంది.   

పాత ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. వ్యవధి లోపల అన్ని ప్రశ్నలకూ సమాధానాలు గుర్తించగలగాలి. మాక్‌ టెస్ట్‌లను రాయడం వల్ల బలాలు, బలహీనతలను సమీక్షించుకుని వెనకబడిన అంశాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించొచ్చు. 

రోజువారీ ప్రణాళిక వేసుకుని దాన్ని కచ్చితంగా అమలు చేయాలి. 

దేశంలోని పదకొండు నగరాల్లో పరీక్షను నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌లో పరీక్ష కేంద్రం ఉంది.


దరఖాస్తుకు చివరి తేదీ: 02.07.2024


వెబ్‌సైట్‌: https://www.cotcorp.org.in/
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ క్లౌడ్‌ కంప్యూటర్‌లో ఉద్యోగాల మథనం

‣ డిజిటల్‌ బిజినెస్‌ కోర్సులో అడ్మిషన్లు

‣ వినూత్న కెరియర్‌కు.. మాలిక్యులర్‌ జెనెటిక్స్‌

‣ బైపీసీ తీసుకుంటే.. కెరియర్‌ అవ‌కాశాలివే!

Posted Date : 17-06-2024 .

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌