• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సీటెట్‌ స్కోరుకు సన్నద్ధత 

జీవితకాలం పాటు స్కోరు చెల్లుబాటు

సెంట్రల్‌ టీచర్స్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (సీటెట్‌)ను ఏటా సీబీఎస్‌ఈ నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ఏడాదికి  రెండుసార్లు జరుగుతుంది. జులై-2023 సీటెట్‌ నోటిఫికేషన్‌ ఇటీవలే విడుదలైంది. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. 

ఇరవై భాషల్లో నిర్వహించే ఈ పరీక్షలో విద్యార్థులు సాధించిన స్కోరును కేంద్రప్రభుత్వ పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు. ఈ స్కోరు అన్ని కేటగిరీల అభ్యర్థులకూ జీవితకాలంపాటు చెల్లుబాటవుతుంది. అభ్యర్థులు ఎన్నిసార్లయినా ఈ పరీక్ష రాసుకోవచ్చు. సీటెట్‌లో పేపర్‌-1, పేపర్‌-2 ఉంటాయి. 1 నుంచి 5 తరగతులు బోధించాలంటే పేపర్‌-1 రాయాలి. 6 నుంచి 8వ తరగతులకు బోధించాలంటే పేపర్‌-2 రాయాలి. 

ఏ అర్హతలుండాలి?

పేపర్‌-1కు: 50 శాతం మార్కులతో పన్నెండో తరగతితోపాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో రెండేళ్ల డిప్లొమా (డీఈఎల్‌ఈడీ) / డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్‌ (ప్రత్యేక విద్య) లేదా డిగ్రీ, బీఈడీ పాసై ఉండాలి. 

పేపర్‌-2కు: 50 శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీతోపాటు డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌/ బ్యాచిలర్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌ (బీఈడీ/ బీఈడీ (ప్రత్యేక విద్య) లేదా సీనియర్‌ సెకండరీతోపాటు నాలుగేళ్ల బ్యాచిలర్‌ ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (బీఈఎల్‌ఈడీ/ బీఏ/ బీఎస్సీఈడీ లేదా బీఏఈడీ/ బీఎస్సీఈడీ పాసై ఉండాలి. 

ఏ అంశాలు? ఎన్ని మార్కులు?

పేపర్‌-1: ప్రశ్నపత్రం మల్టిపుల్‌ చాయిస్‌ విధానంలో 150 మార్కులకు ఉంటుంది. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. 1) చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పెడగాజి (కంపల్సరీ) 30 ప్రశ్నలు (30 మార్కులు); 2) లాంగ్వేజ్‌-1 (కంపల్సరీ) 30 ప్రశ్నలు (30 మార్కులు); 3) లాంగ్వేజ్‌-11 (కంపల్సరీ) 30 ప్రశ్నలు (30 మార్కులు); 4) మేథమెటిక్స్‌ 30 ప్రశ్నలు (30 మార్కులు); 5) ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌ 30 ప్రశ్నలు (30 మార్కులు). పేపర్‌-1 చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పెడగాజిలోని 30 ప్రశ్నల్లో.. చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ (ప్రైమరీ స్కూల్‌ చైల్డ్‌) నుంచి 15 ప్రశ్నలు ఇస్తారు. 

లాంగ్వేజ్‌-1: ఎ) లాంగ్వేజ్‌ కాంప్రహెన్షన్‌ నుంచి 15 ప్రశ్నలు ఇస్తారు. ‣ రీడింగ్‌ అన్‌సీన్‌ పాసేజెస్‌ - టు పాసేజస్‌ వన్‌ ప్రోజ్‌/ డ్రామా అండ్‌ వన్‌ పోయమ్‌ విత్‌ క్వశ్చన్స్‌ ఆన్‌ కాంప్రహెన్షన్, ఇన్‌ఫరెన్స్, గ్రామర్‌ అండ్‌ వెర్బల్‌ ఎబిలిటీ ఉంటాయి. బి) పెడగాజి ఆఫ్‌ లాంగ్వేజ్‌ డెవలప్‌మెంట్‌ నుంచి 15 ప్రశ్నలు.  

లాంగ్వేజ్‌-2: నుంచి 30 ప్రశ్నలు ఇస్తారు. దీంట్లో ఎ) కాంప్రహెన్షన్‌: టు అన్‌సీన్‌ ప్రోజ్‌ పాసేజెస్‌ నుంచి 15 ప్రశ్నలు ఉంటాయి. బి) పెడగాజి ఆఫ్‌ లాంగ్వేజ్‌ డెవలప్‌మెంట్‌ నుంచి 15 ప్రశ్నలు ఉంటాయి.  

4. మేథమెటిక్స్‌: ఈ విభాగం నుంచి 30 ప్రశ్నలు ఉంటాయి. ఎ) జామెట్రీ, షేప్స్, సాలిడ్స్‌ అరౌండ్‌ అజ్, నంబర్స్, ఎడిషన్‌ అండ్‌ సబ్‌ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మెజర్‌మెంట్, వెయిట్, టైమ్, వాల్యూమ్, డేటా హ్యాండ్లింగ్, పేట్రన్స్, మనీ.. మొదలైన వాటి నుంచి 15 ప్రశ్నలు ఇస్తారు. బి) పెడగాజికల్‌ అంశాల నుంచి 15 ప్రశ్నలుంటాయి.  

5. ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌: ఈ విభాగం నుంచి 30 ప్రశ్నలు ఇస్తారు. ఎ) కంటెంట్‌ నుంచి 15 ప్రశ్నలు ఉంటే వాటిల్లో... ఫ్యామిలీ అండ్‌ ఫ్రెండ్స్‌: రిలేషన్‌షిప్స్‌ వర్క్‌ అండ్‌ ప్లే యానిమల్స్‌ ప్లాంట్స్‌; ఫుడ్‌; షెల్టర్‌; వాటర్‌; ట్రావెల్‌; థింగ్స్‌ వియ్‌ మేక్‌ అండ్‌ డూ నుంచి ప్రశ్నలు అడుగుతారు. బి) పెడగాజికల్‌ అంశాలు (15 ప్రశ్నలు)  

పేపర్‌-2 సంగతి?

ప్రశ్నపత్రం 150 మార్కులకు మల్టిపుల్‌ చాయిస్‌ విధానంలో ఉంటుంది. దీంట్లో.. 1) చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పెడగాజి (కంపల్సరీ) 30 ప్రశ్నలు, 2) లాంగ్వేజ్‌-1 (కంపల్సరీ) 30 ప్రశ్నలు, 3) లాంగ్వేజ్‌-2 (కంపల్సరీ) 30 ప్రశ్నలు 4) మ్యాథమెటిక్స్‌ అండ్‌ సైన్స్‌ 60 ప్రశ్నలు (మ్యాథమెటిక్స్‌ అండ్‌ సైన్స్‌ టీచర్‌ కోసం) లేదా సోషల్‌ స్టడీస్‌/ సోషల్‌ సైన్స్‌ (సోషల స్టడీస్‌/ సోషల్‌ సైన్స్‌ టీచర్‌ కోసం) 60 ప్రశ్నలు ఉంటాయి.  

చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పెడగాజి: మొత్తం 30 ప్రశ్నలు ఉంటే.. ఎ) చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ (ఎలిమెంటరీ స్కూల్‌ చైల్డ్‌) సంబంధించి 15 ప్రశ్నలు ఉంటాయి. బి) కాన్సెప్ట్‌ ఆఫ్‌ ఇన్‌క్లూజివ్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ అండర్‌స్టాండింగ్‌ చిల్ట్రన్‌ విత్‌ స్పెషల్‌ నీడ్స్‌కు సంబంధించి 5 ప్రశ్నలు ఇస్తారు. సి) లెర్నింగ్‌ అండ్‌ పెడగాజి నుంచి 10 ప్రశ్నలు. 

లాంగ్వేజ్‌-1 నుంచి 30 ప్రశ్నలు ఇస్తారు. ఎ) లాంగ్వేజ్‌ కాంప్రహెన్షన్‌లో 15 ప్రశ్నలు, బి) పెడగాజి ఆఫ్‌ లాంగ్వేజ్‌ డెవలప్‌మెంట్‌లో 15 ప్రశ్నలు. 

లాంగ్వేజ్‌-2 నుంచి 30 ప్రశ్నలు ఉంటాయి. ఎ) కాంప్రహెన్షన్‌లో 15 ప్రశ్నలు బి) పెడగాజి అండ్‌ లాంగ్వేజ్‌ డెవలప్‌మెంట్‌లో 15 ప్రశ్నలు

మ్యాథమెటిక్స్‌ అండ్‌ సైన్స్‌ నుంచి 60 ప్రశ్నలు అడుగుతారు. మ్యాథమెటిక్స్‌కు 30 ప్రశ్నలు, కంటెంట్‌ నుంచి 20 ప్రశ్నలు ఉంటాయి. కంటెంట్‌లో నంబర్‌ సిస్టమ్, ఆల్జీబ్రా, జామె్రట్రీ ఉంటాయి. బి) పెడగాజికల్‌ అంశాల నుంచి 10 ప్రశ్నలు, 1) సైన్స్‌ నుంచి 30 ప్రశ్నలు.. ఎ) కంటెంట్‌- ఫుడ్, మెటీరియల్స్, ద వరల్డ్‌ ఆఫ్‌ ద లివింగ్, మూవింగ్‌ థింగ్స్‌ పీపుల్‌ అండ్‌ ఐడియాస్‌; హౌ థింగ్స్‌ వర్క్‌; నేచురల్‌ రిసోర్సెస్‌ నుంచి ఉంటాయి. బి) పెడగాజికల్‌ అంశాల నుంచి 10 ప్రశ్నలు ఉంటాయి. 

సోషల్‌ స్టడీస్‌/ సోషల్‌ సైన్సెస్‌ నుంచి 60 ప్రశ్నలు ఉంటే.. హిస్టరీ, జాగ్రఫీ, సోషల్‌ అండ్‌ పొలిటికల్‌ లైఫ్‌ నుంచి 40 ప్రశ్నలు ఉంటాయి. బి) పెడగాజికల్‌ అంశాల నుంచి 20 ప్రశ్నలు ఇస్తారు. 

ఈ పరీక్షలో అర్హత సాధించాలంటే 60 లేదా అంతకంటే ఎక్కువ శాతం మార్కులు సంపాదించాలి. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/దివ్యాంగులకు కనీసార్హత మార్కుల్లో మినహాయింపు ఉంటుంది. 

సన్నద్ధత ఎలా?

ముందుగా పరీక్ష విధానం మీద అవగాహన పెంచుకోవాలి. ఏయే సబ్జెక్టుల నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయనే విషయంలో స్పష్టత ఉంటే ఒత్తిడికి గురి కాకుండా ఉంటారు. 

నెగెటివ్‌ మార్కింగ్‌ ఉండదు. కాబట్టి ప్రతి ప్రశ్నకూ సమాధానం రాయడానికి ప్రయత్నించాలి. 

ఏయే అంశాల్లో వెనకబడి ఉన్నారో తెలుసుకుని.. వాటి బేసిక్‌ కాన్సెప్టుల మీద పట్టు పెంచుకోవాలి. బేసిక్స్‌పై అవగాహన ఉన్నవారు బలహీనంగా ఉన్న అంశాలను మెరుగుపరుచుకోవడానికి వినియోగించవచ్చు. ్ఝ పేపర్‌-1కు ఎన్‌సీఈఆర్‌టీ 1-5  తరగతుల పుస్తకాలు, పేపర్‌-2కు ఎన్‌సీఈఆర్‌టీ 6-8 తరగతుల పుస్తకాలూ చదవాలి. 

ప్రతి సబ్జెక్టులోని ముఖ్యమైన టాపిక్స్‌పైనా నోట్సు రాసుకోవడం అలవాటు చేసుకోవాలి. చివరి నిమిషంలో పునశ్చరణకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. 

సిలబస్‌ చదవటం మొత్తం పూర్తయిన తర్వాత ముఖ్యమైన టాపిక్‌లను రోజూ రివైజ్‌ చేసుకోవాలి. అలాగే ముఖ్యమైన థియరీలు, కాన్సెప్టులు, ఫార్ములాల మీద దృష్టి నిలపాలి. 

పాత ప్రశ్నపత్రాల సాధన ఎంతో అవసరం. దీంట్లో సాధించిన స్కోరు ఆధారంగా సన్నద్ధతను మెరుగు పరుచుకోవచ్చు,. ఏయే అంశాల్లో వెనకబడి ఉన్నారో తెలుసుకుని.. దానికి అనుగుణంగా టైమ్‌టేబుల్‌ను మార్చుకుని చదువుకోవచ్చు. 

దరఖాస్తుకు చివరి తేదీ: 26.05.2023

కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష తేదీలు: జులై 2023 నుంచి ఆగస్టు 2023 మధ్య. 

వెబ్‌సైట్‌: https://ctet.nic.in/
 

********************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ రిజర్వ్‌ బ్యాంకులో 291 ఆఫీసర్‌ కొలువులు

‣ సమ్మర్‌లో సరికొత్త కోర్సులు

‣ సరిహద్దు దళంలో 247 కొలువులు

‣ డిగ్రీతో సీఏపీఎఫ్‌లో అసిస్టెంట్‌ కమాండెంట్‌ పోస్టులు

‣ నలంద వర్సిటీలో పీజీ, పీహెచ్‌డీ అడ్మిషన్లు

‣ నౌకాదళంలో అధికారులుగా అవకాశం

Posted Date : 12-05-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌