• facebook
  • twitter
  • whatsapp
  • telegram

స‌రికొత్త‌గా డిజిట‌ల్ హ్యుమానిటీస్‌!

* కాలానుగుణమైన కోర్సు 

హ్యుమానిటీస్‌ ఎప్పటి నుంచో ఉన్న సబ్జెక్ట్‌. మారుతున్న నేటి కాలానికి అనుగుణంగా దీనికి అనుబంధంగా వచ్చిందే ‘డిజిటల్‌ హ్యుమానిటీస్‌’. కంప్యూటర్‌తోనే సర్వం ముడిపడి ఉన్న ప్రస్తుత రోజుల్లో మనుషుల జీవనవిధానం గురించి అధ్యయనం చేసే ఈ కోర్సుకు రానురానూ డిమాండ్‌ పెరుగుతోంది. మరి దీని గురించి ఇంకా తెలుసుకుందామా...


హ్యుమానిటీస్‌లో ఉన్న వివిధ రకాల సబ్జెక్టులను డిజిటల్‌ ప్రపంచంతో కలిపి చూడటాన్నే ‘డిజిటల్‌ హ్యుమానిటీస్‌’ అంటున్నారు. హిస్టరీ, సోషియాలజీ, సైకాలజీ, పొలిటికల్‌ సైన్స్‌... ఇలా ఏదైనా సరే, వీటిపైన డిజిటల్‌ ఏజ్‌ ప్రభావం ఎలా ఉంది - యాప్స్, స్మార్ట్‌ఫోన్స్‌... ఇవన్నీ ఎలా ప్రభావితం చేస్తున్నాయి.. ఈ కాలం ఎలా ఉంది, ఉండబోతోంది.. ఇవన్నీ ఈ అధ్యయనంలో భాగం. స్థిరంగా చెప్పాలంటే ఇది హ్యుమానిటీస్‌ సబ్జెక్టులు, కంప్యూటింగ్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీల సమ్మేళనం.


      గత 50 ఏళ్లుగా మనుషుల జీవితాల్లో కంప్యూటర్‌ భాగమైపోయింది. వచ్చే కాలంలో ఇది మరింతగా మన జీవనవిధానాన్ని ప్రభావితం చేయనుంది. చదువులు, ఉద్యోగాలు, తీరుతెన్నులు, అన్నీ వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో డిజిటల్‌ హ్యుమానిటీస్‌ చదువుకున్నవారి అవసరం కూడా పెరుగుతోంది. ముఖ్యంగా డేటాను నిర్వహించడంలో వీరి సేవలు అధికంగా అవసరమవుతున్నాయి. నిజానికి మన దేశంలో ఈ సబ్జెక్టుపై ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతోంది. ఐఐటీ జోథ్‌పూర్‌ వంటి కొన్ని ఉన్నత విద్యాసంస్థలు దీనికి సంబంధించిన కోర్సులను కూడా ప్రవేశపెట్టాయి. అయితే ఉన్న అవకాశాలకు తగిన విధంగా చదువుతున్న విద్యార్థుల సంఖ్య లేదనే చెప్పాలి. ముఖ్యంగా పరిశోధన రంగాల్లో దీనిపై పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులకు అత్యధిక డిమాండ్‌ ఉంది.


ఉద్యోగావకాశాలు
డిజిటల్‌ హ్యుమానిటీస్‌ చదివినవారికి విస్తృతమైన కెరియర్‌ అవకాశాలు ఉన్నాయి. వెబ్‌ డిజైనర్, సోషల్‌ మీడియా మేనేజర్, ఇంటరాక్టివ్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్, డిజిటల్‌ మార్కెటింగ్‌ స్పెషలిస్ట్, డిజిటల్‌ ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్, ఆర్కైవ్స్‌ లైబ్రేరియన్, డిజిటల్‌ క్యూరేటర్, టెక్నికల్‌ రైటర్, ఇన్ఫర్మేషన్‌ ఆర్కిటెక్ట్‌.. ఇలా చాలా ఉద్యోగాలు పొందవచ్చు.


కోర్సులు 
అశోక యూనివర్సిటీ, జామియా మిలియా ఇస్లామియా, జాదవ్‌పూర్‌ యూనివర్సిటీ, కేరళ డిజిటల్‌ యూనివర్సిటీ.. వంటి పలు సంస్థలు ఇందులో డిగ్రీ, పీజీ కోర్సులను అందిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో అయితే ఎడ్‌ఎక్స్, కోర్సెరాలో స్వల్ప కాల వ్యవధి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడికంటే విదేశాల్లో దీనికి సంబంధించిన విద్యా, ఉద్యోగావకాశాలు మరింత అధికంగా లభిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
 

మరింత సమాచారం... మీ కోసం!

‣ మేనేజ‌ర్ల‌కు టూరిజం స్వాగ‌తం!

‣ స‌త్వ‌ర ఉద్యోగాలు .. సొంత ప‌రిశ్ర‌మ‌లు!

‣ సీఎంఐ కోర్సుల‌తో పెద్ద ప్యాకేజీలు!

‣ అగ్నివీరుల‌కు ఆర్మీ ఆహ్వానం!

‣ ఫార్మసీలో పీజీకి జీప్యాట్‌!

‣ మహిళలకు యూనిఫామ్‌ సర్వీసెస్‌ కోర్సులు!

‣ ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలంటే ఏంచేయాలి?

‣ విదేశీ విద్యకు సిద్ధమవుతున్నారా?

‣ మిలిటరీ కాలేజీలో ఉద్యోగాలు

Posted Date : 10-03-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌