• facebook
  • twitter
  • whatsapp
  • telegram

యూగ్యాట్‌ ద్వారా యూజీ ప్రవేశాలు

ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ, బీబీఏ, బీసీఏ, బీహెచ్‌ఎం, బీకాం తదితర అండర్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రాముల్లో ప్రవేశాలు కల్పించే అండర్‌ గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (యూగ్యాట్‌) నోటిఫికేషన్‌ విడుదలఅయింది. ఆల్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ (ఏఐఎంఏ) 2021 విద్యా సంవత్సరానికి ఈ ప్రకటన విడుదల చేసింది.

ఇంటర్మీడియట్‌ (10+2), దీనికి సమానమైన పరీక్ష ఉత్తీర్ణత, ఇంటర్మీడియట్‌ పరీక్షలకు హాజరవుతున్న/ హాజరైనవారు యూగ్యాట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఈ పరీక్షను రెండు పద్ధతుల్లో నిర్వహిస్తారు. 

1) పేపర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (పీబీటీ)

రిజిస్ట్రేషన్‌ ముగింపు తేది:   27.06.2021

అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌ తేది: 28.06.2021

పరీక్ష తేది: 04.07.2021

2) ఇంటర్నెట్‌ బేస్డ్‌ టెస్ట్‌ (ఐబీటీ 1, 2)

రిజిస్ట్రేషన్‌ ముగింపు తేది: 2021, జులై 1 (ఐబీటీ-1) జులై 8 (ఐబీటీ-2).   

పరీక్ష తేది: 2021, జులై 04 (ఐబీటీ-1) జులై 11 (ఐబీటీ-2)

దరఖాస్తు ఫీజు రూ. 750 చెల్లించి ఆన్‌లైన్‌ ద్వారా   దరఖాస్తు చేసుకోవాలి. 

వెబ్‌సైట్‌: https://apps.aima.in/UGAT2021/

అడ్మిట్‌ కార్డ్‌: రిజిస్ట్రేషన్‌ చేసుకున్న అభ్యర్థులు తమ అడ్మిట్‌ కార్డును వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అడ్మిట్‌ కార్డులో అభ్యర్థి పేరు, ఫారమ్‌ నంబర్, రోల్‌ నంబర్, పరీక్ష తేది, పరీక్ష సమయం, టెస్ట్‌ జరిగే ప్రదేశం చిరునామా మొదలైన వివరాలన్నీ ఉంటాయి. 

ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ, బీబీఏ, బీసీఏ పరీక్షల వ్యవధి రెండు గంటలు. బీహెచ్‌ఎం పరీక్ష వ్యవధి మూడు గంటలు. దీంట్లో అభ్యర్థి సర్వీస్‌నూ, శాస్త్రీయ ధోరణినీ పరీక్షిస్తారు. 

ఏఐఎంఏ-యూగ్యాట్‌ 2021 ఇంగ్లిష్‌ మీడియంలో ఉంటుంది.

ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలుంటాయి. 

తప్పు సమాధానాలకు మార్కుల తగ్గింపు ఉండదు. 

సెక్షన్లవారీగా కాలపరిమితి ఉండదు. 

మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలుంటాయి. 

మొత్తం 130 ప్రశ్నలకు 130 మార్కులు. 

ఏయే పుస్తకాలు చదవాలి? 

8, 9, 10 తరగతుల మ్యాథ్స్‌ బుక్స్‌: ఎన్‌సీఈఆర్‌టీ

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ ఫర్‌ కాంపిటేటివ్‌ ఎగ్జామినేషన్స్‌: ఆర్‌ఎస్‌ అగర్వాల్‌/ చాంద్‌ పబ్లికేషన్

హైస్కూల్‌ ఇంగ్లిష్‌ గ్రామర్‌: రెన్‌ అండ్‌ మార్టిన్‌ 

జనరల్‌ ఇంగ్లిష్‌: అరిహంత్‌ పబ్లికేషన్స్‌    

ఎ న్యూ అప్రోచ్‌ టు రీజనింగ్‌ వెర్బల్, నాన్‌-వెర్బల్‌ అండ్‌ ఎనలిటికల్‌: అరిహంత్‌ పబ్లికేషన్స్‌ 

షార్ట్‌ కట్స్‌ ఇన్‌ రీజనింగ్‌: దిశా పబ్లికేషన్స్‌ 

జనరల్‌ నాలెడ్జ్‌ 2021: అరిహంత్‌ పబ్లికేషన్స్‌

యూగ్యాట్‌ పరీక్ష విధానం
ప్రశ్నపత్రంలో నాలుగు సెక్షన్లు ఉంటాయి.  
సెక్షన్‌  ప్రశ్నలు మార్కులు

ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌

న్యూమరికల్‌ అండ్‌    

డేటా ఎనాలిసిస్‌ రీజనింగ్‌ అండ్‌

ఇంటలిజెన్స్‌ జనరల్‌ నాలెడ్జ్‌

40

30

30

30

40

30

30

30

Posted Date : 17-06-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.