• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఎగ్జామ్‌కి ముందు ఏం చేయ‌కూడ‌దు?

‣ తెలుసుకుంటే ఎన్నో లాభాలు

పరీక్షలకు వెళ్లే ముందు ఏం చేయాలో మనకు బాగా తెలుసు. మరి ఏం చేయకూడదో కూడా తెలుసుకోవాలిగా! పరీక్షల సీజన్‌ మొదలుకాబోతున్న నేపథ్యంలో... ఎగ్జామ్‌కు ముందు కచ్చితంగా చేయకూడని పనులేంటో, అలా చేయకపోవడం వల్ల కలిగే లాభాలేంటో చూసేద్దాం.. 


పరీక్షకు ముందు ఒకటి రెండు రోజుల్లో కొత్త టాపిక్‌ లేదా కొత్త మెటీరియల్‌ చదవడం చేస్తుంటారు కొందరు. ఇది సరైన సన్నద్ధత కాదు. ఆ విషయం పూర్తిగా కొత్తది కావడం వల్ల దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం, గుర్తుంచుకోలేకపోవడం వంటివి జరగొచ్చు. అదే జరిగితే పరీక్ష సమయంలో ఇతర జవాబులపైనా దీని ప్రభావం పడుతుంది. అవి గుర్తుతెచ్చుకోలేక ఇబ్బంది పడతాం. అందుకే పరీక్షకు రెండు రోజుల ముందు ఎటువంటి కొత్త టాపిక్స్‌ చదవడం మంచిది కాదు. బాగా వచ్చినవాటినే రివిజన్‌ చేస్తూ ఉండాలి. 


ముఖ్యమైన పనులను, కష్టమైన పాఠాలను చివర్లో చూసుకుందాం అనే ఆలోచనతో వాయిదా వేయకూడదు. పరీక్షకు ముందు ఎటువంటి అదనపు ఒత్తిడీ పెట్టుకోవడం సరికాదు. మనసు వీలైనంత తేలిగ్గా ఉండాలి. అలా ఉండాలంటే ఆ రోజుకంటే ముందే పనులన్నీ పూర్తిచేయాలి. 


రిలాక్స్‌ అయ్యేందుకైనా సరే... టీవీ, ఫోన్, సోషల్‌మీడియా జోలికి వెళ్లడం మంచిది కాదు. పరీక్షకు ముందు రెండు మూడు నెలల సన్నద్ధత సమయంలో అడపాదడపా చూసినా పరీక్షకు ముందు మాత్రం అస్సలు వాటిని వాడొద్దని సూచిస్తున్నారు నిపుణులు. విద్యార్థి ధ్యాస మొత్తం పరీక్షపైనే ఉండాలని చెబుతున్నారు.  


ఇతర విద్యార్థులు, స్నేహితులతో అతిగా చర్చించడం, చదివిన - చదవాల్సిన టాపిక్స్‌ గురించి కంగారు పడటం వంటివి సరికాదు. దీనివల్ల లేనిపోని ఒత్తిడి మొదలవుతుంది. అవతలివారు మనకంటే ఎక్కువ చదవారనే భావనతో ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. ప్రతి ఒక్కరి సన్నద్ధత వేరువేరుగా ఉంటుంది. ఎవరికి వారే ప్రత్యేకం. అందువల్ల ఎవరితోనైనా సరే పోలిక అనవసరం. 


టెన్షన్‌తో సరిగ్గా తినకపోవడం లేదా అతిగా తింటూ ఉండటం, సరిగ్గా నిద్రపోకపోవడం, కెఫీన్‌ కలిగిన పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వంటివి చేయకూడదు. ఇవి పరీక్షలో విద్యార్థి ప్రదర్శనపై దుష్ప్రభావం చూపగలవు.


ప్రశాంతంగా ఉండకుండా అతిగా ఆలోచించడం, ఆ అసహనంతో చుట్టుపక్కల వాతావరణాన్ని పాడుచేసుకోవడం వంటివి చేయకూడదు. వీలైనంత రిలాక్స్‌గా ఉంటూ చేయాల్సిన పనులు, రివిజన్‌ను ఒత్తిడికి లోనుకాకుండా నెమ్మదిగా చేసుకోవడం ఉత్తమం. దీనివల్ల ఇంట్లోవారికీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. 


‣ అలాగే పరీక్ష రోజుకు చేసుకోవాల్సిన ఏర్పాట్లు చివరివరకూ చేయకుండా వదిలేయడం, కావాల్సిన అందుబాటులో ఉంచుకోకపోవడం వంటివి అస్సలు సరికాదు. ముందుగానే అన్నీ సిద్ధం చేసుకుంటేనే పరీక్షకు పూర్తిగా సిద్ధపడినట్టు! .

మరింత సమాచారం... మీ కోసం!

‣ సీఎంఐ కోర్సుల‌తో పెద్ద ప్యాకేజీలు!

‣ అగ్నివీరుల‌కు ఆర్మీ ఆహ్వానం!

‣ ఫార్మసీలో పీజీకి జీప్యాట్‌!

‣ మహిళలకు యూనిఫామ్‌ సర్వీసెస్‌ కోర్సులు!

‣ ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలంటే ఏంచేయాలి?

Posted Date : 13-03-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌