• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఇస్రోలో 62 టెక్నికల్‌ ఉద్యోగాలు

అర్హత: పదోతరగతి, ఐటీఐ, డిప్లొమా

ఇండియన్‌ స్పేస్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో) ఆధ్వర్యంలోని ఇస్రో ప్రొపల్షన్‌ కాంప్లెక్స్‌ (మహేంద్రగిరి).. క్రయోజనిక్‌ ప్రొపల్లెంట్స్‌ను ఉత్పత్తి చేసి ఇండియన్‌ రాకెట్‌ ప్రోగ్రాం కోసం సరఫరా చేస్తుంది. రాకెట్‌ ప్రయోగానికి అవసరమయ్యే వివిధ పరికరాలనూ ఇక్కడ తయారుచేస్తారు. ఈ సంస్థ తాజాగా వివిధ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. 

పోస్టును అనుసరించి దరఖాస్తుదారులు సంబంధిత స్పెషలైజేషన్‌లో పదోతరగతి/డిప్లొమా/ ఇంజినీరింగ్‌ డిప్లొమా పాసవ్వాలి. 24.04.2023 నాటికి అభ్యర్థుల వయసు 18-35 సంవత్సరాలు ఉండాలి. ఫైర్‌మ్యాన్‌ ‘ఎ’ పోస్టుకు గరిష్ఠ వయసు 25 సంవత్సరాలు.  ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నిర్దిష్ట వర్గాల అభ్యర్థులకు గరిష్ఠ వయసులో మినహాయింపు ఉంటుంది. 

ప్రకటించిన పోస్టుల్లో.. టెక్నికల్‌ అసిస్టెంట్‌ (మెకానికల్‌)-15, టెక్నికల్‌ అసిస్టెంట్‌ (ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌)-4, టెక్నికల్‌ అసిస్టెంట్‌ (ఎలక్ట్రికల్‌)-1, టెక్నికల్‌ అసిస్టెంట్‌ (కంప్యూటర్‌ సైన్స్‌)-1, టెక్నికల్‌ అసిస్టెంట్‌ (సివిల్‌)-3, టెక్నీషియన్‌ ‘బి’ (ఫిట్టర్‌)-20, టెక్నీషియన్‌ ‘బి’ (ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌)-3, టెక్నీషియన్‌ ‘బి’ (వెల్డర్‌)-3, టెక్నీషియన్‌ ‘బి’ (రిఫ్రిజిరేషన్‌ అండ్‌ ఏసీ)-1, టెక్నీషియన్‌ ‘బి’ (ఎలక్ట్రీషియన్‌)-2, టెక్నీషియన్‌ ‘బి’ (ప్లంబర్‌)-1, డ్రాఫ్ట్స్‌మ్యాన్‌ ‘బి’ (సివిల్‌)-1 హెవీ వెహికల్‌ ఢ్రైవర్‌-ఎ-5, లైట్‌ వెహికల్‌ ఢ్రైవర్‌ ‘ఎ’-2 పోస్టులు ఉన్నాయి. 

ఫైర్‌మ్యాన్‌: ఫైర్‌మ్యాన్‌-ఎ పోస్టుకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు దరఖాస్తుతోపాటుగా ప్రిలిమినరీ మెడికల్‌ ఎగ్జామినేషన్‌ (పీఎంఈ) సర్టిఫికెట్‌ను కూడా అప్‌లోడ్‌ చేయాలి. ఇది ఆర్నెల్లు చెల్లుబాటవుతుంది.

ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ ప్రమాణాలు: జనరల్‌ కేటగిరీకి చెందిన పురుష అభ్యర్థులు 165 సెం.మీ.ఎత్తు, 50 కేజీల బరువు ఉండాలి. ఛాతీ చుట్టుకొలత 81 సెం.మీ., గాలి పీల్చినప్పుడు 86 సెం.మీ ఉండాలి. మహిళలు 155 సెం.మీ. ఎత్తు, 43 కేజీల బరువు ఉండాలి.  

ఎంపిక ఎలా?

కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష/ స్కిల్‌ టెస్ట్‌/ పీఈటీ ఆధారంగా ఎంపిక ఉంటుంది. టెక్నికల్‌ అసిస్టెంట్‌/టెక్నీషియన్‌ ‘బి’/ డ్రాఫ్ట్స్‌ మ్యాన్‌ ‘బి’ పోస్టులకు రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ఉంటాయి. హెవీ వెహకల్‌ డ్రైవర్‌ ‘ఎ’/ లైట్‌ వెహికల్‌ డ్రైవర్‌ ‘ఎ’ పోస్టులకు రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ (డ్రైవింగ్‌ టెస్ట్‌) ఉంటాయి. ఫైర్‌మ్యాన్‌ ‘ఎ’ పోస్టుకు రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ (ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్‌  ఎగ్జామినేషన్‌) ఉంటాయి. 

స్కిల్‌టెస్ట్‌

టెక్నికల్‌ అసిస్టెంట్, టెక్నీషియన్‌ ‘బి’, డ్రాఫ్ట్స్‌మ్యాన్‌ ‘బి’ పోస్టులకు ఎకడమిక్‌ సిలబస్‌ ఆధారంగానే స్కిల్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. దీనికి 100 మార్కులు. కనీసార్హత మార్కులు 50.  

హెవీ వెహికల్‌ డ్రైవర్‌ ‘ఎ’, లైట్‌ వెహికల్‌ డ్రైవర్‌ ‘ఎ’ పోస్టులకు స్కిల్‌ టెస్ట్‌లో భాగంగా డ్రైవింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. దీంట్లో 100 మార్కులకుగాను 60 మార్కులు సాధించాలి.  

ఫైర్‌మ్యాన్‌ ‘ఎ’ పోస్టుకు స్కిల్‌ టెస్ట్‌ కింద ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఇది రెండు దశల్లో జరుగుతుంది. తొలి దశలో పాసైనవారిని రెండో దశకు ఎంపికచేస్తారు. దీంట్లో విజయం సాధించినవారిని వైద్య పరీక్షలకు పిలుస్తారు. ఈ రెండు దశల్లోనూ తప్పనిసరిగా అర్హత సాధించాలి. స్టేజ్‌-1లో 1500 మీటర్ల పరుగును 40 ఏళ్లలోపు పురుషులు 7 నిమిషాల్లో, 40 ఏళ్లుపైబడినవాళ్లు 8 నిమిషాల్లో పూర్తిచేయాలి. 800 మీటర్ల పరుగును 40 ఏళ్లలోపు మహిళలు 4 నిమిషాల్లో, 40 ఏళ్లు పైబడినవాళ్లు 5 నిమిషాల్లో ముగించాలి. స్టేజ్‌-2లో 5 మీటర్ల రోప్‌క్లైంబింగ్‌ (చేతులను మాత్రమే ఉపయోగించాలి), మనిషి బొమ్మను మోస్తూ లక్ష్యాన్ని చేరడం, లాంగ్‌జంప్, 100 మీ. పరుగు మొదలైనవి ఉంటాయి. 

దరఖాస్తు ఫీజు

టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టుకు రూ.750. టెక్నీషియన్‌ ‘బి’/డ్రాఫ్ట్స్‌మ్యాన్‌ ‘బి’/ ఫైర్‌మ్యాన్‌ ‘ఎ’/ లైట్‌ వెహికల్‌ డ్రైవర్‌ ‘ఎ’/ హెవీ వెహికల్‌ డ్రైవర్‌ ‘ఎ’ పోస్టులకు రూ.500. అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజును ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి. 

రాతపరీక్షలో ఏ అంశాలు?

ఇది కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) విధానంలో ఉంటుంది. అభ్యర్థుల తుది ఎంపికను రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగానే నిర్ణయిస్తారు. టెక్నికల్‌ అసిస్టెంట్, టెక్నీషియన్‌ ‘బి’, డ్రాఫ్ట్స్‌మ్యాన్‌ ‘బి’ పోస్టులకు నిర్వహించే రాత పరీక్షలోని ప్రశ్నలను ఎకడమిక్‌ సిలబస్‌ నుంచే ఇస్తారు. నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికీ 0.33 మార్కులను తగ్గిస్తారు. రాత పరీక్షలో పాస్‌ కావాలంటే జనరల్‌ అభ్యర్థులు 80 మార్కులకు 32 మార్కులు సాధించాలి.  

ఫైర్‌మ్యాన్‌ ‘ఎ’ పోస్టుకు నిర్వహించే రాత పరీక్షలో బేసిక్‌ కెమిస్ట్రీ, ఎల్‌పీజీ ప్రాపర్టీస్, ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్‌ల మధ్య సంబంధం, సిలెండర్స్, కోన్స్‌ వాల్యూమ్స్, వాటర్, ఇనర్ట్‌ గ్యాసెస్‌ ప్రాపర్టీస్, ఎలక్ట్రిసిటీ వినియోగంలో బేసిక్స్, సింపుల్‌ అరిథ్‌మెటిక్‌ (పదో తరగతి స్థాయి), బేసిక్‌ ఇంగ్లిష్, జనరల్‌ నాలెడ్జ్, కరెంట్‌ అఫైర్స్‌ ప్రశ్నలు ఉంటాయి.  

రాతపరీక్షలో 100 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి 2 గంటలు. నెగెటివ్‌ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికీ 0.25 మార్కులు తగ్గిస్తారు. దీంట్లో ఉత్తీర్ణత సాధించాలంటే 50 మార్కులు సంపాదించాలి. 

హెవీ వెహికల్‌ డ్రైవర్‌ ‘ఎ’, లైట్‌ వెహికల్‌ డ్రైవర్‌ ‘ఎ’ పోస్టుకు నిర్వహించే రాత పరీక్ష పార్ట్‌-ఎలో 50 ప్రశ్నలుంటాయి. మోటర్‌ వెహికల్‌ యాక్ట్‌ 1988లోని వివిధ సెక్షన్లు, డ్రైవర్స్‌ లైసెన్సింగ్, మోటర్‌ వెహికల్స్‌ రిజిస్ట్రేషన్, ట్రాన్స్‌పోర్ట్‌ వెహికల్స్‌ కంట్రోల్, ట్రాఫిక్‌ కంట్రోల్, మోటర్‌ వెహికల్స్‌ ఇన్సూరెన్స్, అఫెన్స్, పెనాల్టీస్, ప్రొసీజర్, యాక్సిడెంట్‌ క్లయిమ్స్, యాక్సిడెంట్‌ క్లయిమ్స్‌ ట్రైబ్యునల్స్‌. పార్ట్‌-బిలో (15 ప్రశ్నలు) ఎనిమిదో తరగతి స్థాయిలో.. బేసిక్‌ ఇంగ్లిష్‌ ప్రశ్నలు అడుగుతారు. సిననిమ్స్, యాంటనిమ్స్, యూజ్‌ ఆఫ్‌ కరెక్ట్‌ వెర్బ్స్, ఫిల్‌ ఇన్‌ ద బ్లాంక్స్‌ ఉంటాయి. పార్ట్‌-సిలో (15 ప్రశ్నలు) పదో తరగతి స్థాయిలో బేసిక్‌ అరిథ్‌మెటిక్‌ ప్రశ్నలు. అడిషన్, సబ్‌ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, పర్సంటేజ్, రేషియో, యావరేజ్‌ అంశాలపై ప్రశ్నలు ఇస్తారు. పార్ట్‌-డిలో (20 ప్రశ్నలు) జనరల్‌ నాలెడ్జ్, కరెంట్‌ అఫైర్స్, దేశంలోని రాష్ట్రాలు, రాజధానులు, భూగోళశాస్త్ర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. 

100 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి రెండు గంటలు. ప్రశ్నకు 1 మార్కు. ప్రతి తప్పు సమాధానానికీ 0.25 మార్కులు తగ్గిస్తారు. ఈ పరీక్షలో పాస్‌కావడానికి పార్ట్‌-ఎలో 50 శాతం మార్కులు, మిగతా మూడు పార్టుల్లో కలిపి 50 శాతం మార్కులు సాధించాలి. నాలుగు పార్టుల్లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను స్కిల్‌ టెస్ట్‌కు ఎంపికచేస్తారు. 

అభ్యర్థులను ముందుగా తాత్కాలిక ప్రాతిపదికన తీసుకున్నప్పటికీ ఉద్యోగాలను పర్మనెంట్‌ చేసే అవకాశం ఉంటుంది. 

హెవీ వెహికల్‌ డ్రైవర్‌-ఎ, లైట్‌ వెహికల్‌ డ్రైవర్‌-ఎ పోస్టులకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందిన తర్వాత పనిచేసిన అనుభవం ఉండాలి. 

దరఖాస్తుకు చివరి తేదీ: 24.04.2023

వెబ్‌సైట్‌: https://www.iprc.gov.in/iprc/
 

********************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ లాభదాయక కెరియర్‌.. బిజినెస్‌ ఇంజెలిజెన్స్‌

‣ డిగ్రీతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

‣ అవకాశం సులువు.. అధిక మార్కెట్‌ విలువ!

‣ నామ‌మాత్ర ఫీజుతో నాణ్య‌మైన విద్య‌

‣ న్యాయ విద్య క‌ల నెర‌వేరేలా!

‣ ఇగ్నోలో ఉద్యోగాలు

‣ ఈపీఎఫ్‌ఓలో స్టెనో కొలువులు

Posted Date : 11-04-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌