• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఇగ్నోలో ఉద్యోగాలు

* 200 ఖాళీలతో ప్రకటన

ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూని వర్సిటీ (ఇగ్నో) మూడున్నర దశాబ్దాలకుపైగా విద్యారంగంలో సేవలను అందిస్తోంది. న్యూదిల్లీలోని ఈ సార్వత్రిక విశ్వవిద్యాలయం తాజాగా 200 జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ టైపిస్ట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అభ్యర్థులను కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ), స్కిల్‌ టెస్ట్‌/ టైపింగ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

మొత్తం 200 పోస్టుల్లో.. అన్‌రిజర్వుడ్‌కు 83, ఎస్సీకి 29, ఎస్టీకి 12, ఓబీసీలకు 55, ఈడబ్ల్యూఎస్‌లకు 21 కేటాయించారు. 10+2 పాసై ఇంగ్లిష్, హిందీ టైపింగ్‌ పరిజ్ఞానం ఉండాలి. 31.03.2023 నాటికి 18-27 సంవత్సరాల మధ్య వయసున్న అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి అర్హులు. గరిష్ఠ వయసులో ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీ (ఎన్‌సీఎల్‌)కు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 సంవత్సరాల సడలింపు ఉంటుంది. 

అన్‌రిజర్వుడ్, ఓబీసీ (ఎన్‌సీఎల్‌), ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.1000. ఎస్సీ, ఎస్టీ, మహిళలకు రూ.600. దివ్యాంగులు ఫీజు చెల్లించనవసరం లేదు. 

సీబీటీ: ఈ పరీక్షను ఎన్‌టీఏ హిందీ/ఇంగ్లిష్‌ భాషలో నిర్వహిస్తారు. దీంట్లో సాధించిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థుల మెరిట్‌ లిస్ట్‌ను తయారుచేస్తారు. ప్రశ్నపత్రం 150 మార్కులకు ఉంటుంది. సీబీటీలో 5 పార్ట్‌లు ఉంటాయి. ఒక్కో పార్ట్‌లో 30 ప్రశ్నలకు 30 మార్కుల చొప్పున కేటాయించారు. పార్ట్‌-1 జనరల్‌ అవేర్‌నెస్, పార్ట్‌-2 రీజనింగ్‌ అండ్‌ జనరల్‌ ఇంటెలిజెన్స్, పార్ట్‌-3 మేథమెటికల్‌ ఎబిలిటీస్, పార్ట్‌-4 హిందీ/ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్, పార్ట్‌-5 కంప్యూటర్‌ నాలెడ్జ్‌ మాడ్యూల్‌కు సంబంధించి ఉంటాయి. సీబీటీలో అర్హత సాధించిన అభ్యర్థులకు స్కిల్‌ టెస్ట్‌ (టైపింగ్‌ టెస్ట్‌) నిర్వహిస్తారు. హిందీ లేదా ఇంగ్లిష్‌ టైపింగ్‌లో కనీస వేగం ఉండాలి. 

ఏయే అంశాలు?

స్టాటిస్టిక్స్‌ అండ్‌ ప్రాబబిలిటీ: యూజ్‌ ఆఫ్‌ టేబుల్స్‌ అండ్‌ గ్రాఫ్స్, హిస్టోగ్రామ్, ఫ్రీక్వెన్సీ పాలిగాన్, బార్‌ డయాగ్రమ్, పైచాట్, మెజర్స్‌ ఆఫ్‌ సెంట్రల్‌ టెండెన్సీ, మోడ్, స్టాండర్డ్‌ డీ…వియేషన్, కాలిక్యులేషన్‌ ఆఫ్‌ సింపుల్‌ ప్రాబబిలిటీస్‌. 

రీజనింగ్‌ అండ్‌ జనరల్‌ ఇంటెలిజెన్స్‌: వెర్బల్‌ అండ్‌ నాన్‌వెర్బల్‌ క్వశ్చన్స్, సింబాలిక్‌/నంబర్‌ ఎనాలజీ, ట్రెండ్స్, ఫిగరల్‌ ఎనాలజీ, స్పేస్‌ ఓరియంటేషన్, వెన్‌ డయాగ్రమ్స్, సింబాలిక్‌/నంబర్‌ క్లాసిఫికేషన్, ఫిగరల్‌ క్లాసిఫికేషన్, పంచ్డ్‌హోల్‌/ పేట్రన్‌ ఫోల్డింగ్‌ అండ్‌ అన్‌ఫోల్డింగ్, సెమెంటిక్‌ సిరీస్, క్రిటికల్‌ థింకింగ్, ప్రాబ్లమ్‌ సాల్వింగ్, ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్, వర్డ్‌ బిల్డింగ్, సోషల్‌ ఇంటెలిజెన్స్, కోడింగ్‌ అండ్‌ డీకోడింగ్, న్యూమరికల్‌ ఆపరేషన్స్‌ మొదలైనవి. 

ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌: ఒకాబ్యులరీ గ్రామర్, సెంటెన్స్‌ స్ట్రక్చర్, సిననిమ్స్, యాంటనిమ్స్, స్పాట్‌ ది ఎర్రర్, ఫిల్‌ ఇన్‌ ద బ్లాంక్స్, స్పెల్లింగ్స్‌/డిటెక్టింగ్‌ మిస్‌ స్పెల్ట్‌ వర్డ్స్, ఇడియమ్స్‌ అండ్‌ ఫ్రేజెస్, యాక్టివ్‌/పాసివ్‌ వాయిస్‌ ఆఫ్‌ వెర్బ్స్, కన్వర్షన్‌ ఇన్‌టు డైరెక్ట్‌/ఇన్‌డైరెక్ట్‌ నెరేషన్, క్లోజ్‌ పాసేజ్, కాంప్రహెన్షన్‌ పాసేజ్‌. 

గమనించండి!

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్‌లో: గుంటూరు, విశాఖపట్నం. తెలంగాణలో: హైదరాబాద్‌/ సికిందరాబాద్‌.

దరఖాస్తుకు చివరి తేదీ: 20.04.2023

దరఖాస్తు సవరణ తేదీలు: 21.04.2023 నుంచి 22-04.2023

వెబ్‌సైట్‌: www.ignou.ac.in

జనరల్‌ అవేర్‌నెస్‌: దీంట్లోని ప్రశ్నలు చుట్టూ ఉండే పరిస్థితులపై అభ్యర్థికి ఉండే అవగాహనను పరీక్షించేలా ఉంటాయి. భారతదేశ చరిత్ర, సంస్కృతి, జాగ్రఫీ, ఎకనామిక్స్, సైన్స్, జనరల్‌ పాలసీ, సైంటిఫిక్‌ రిసెర్చ్‌ మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. 

కంప్యూటర్‌ నాలెడ్జ్‌ మాడ్యూల్‌: కంప్యూటర్‌ బేసిక్స్, సాఫ్ట్‌వేర్, వర్కింగ్‌ విత్‌ ఇంటర్నెట్‌ అండ్‌ ఈమెయిల్స్, బేసిక్స్‌ ఆఫ్‌ నెట్‌వర్కింగ్‌ అండ్‌ సైబర్‌ సెక్యూరిటీ.. మొదలైనవి.

మరింత సమాచారం... మీ కోసం!

‣ పాత ప్రశ్నపత్రాలు... ఎందుకు ముఖ్యం?

‣ భారతీయ కోర్సులకు టాప్‌ ర్యాంకులు

‣ కొయ్యగుజ్జు అడవులతో.. మంచుపొరల ఎడారులతో!

‣ సైబర్‌ సెక్యూరిటీలో ఏ కోర్సులు?ఎలాంటి ఉద్యోగాలు?

‣ మెరుగైన పీజీకి మేలైన మార్గం!

‣ చివరి వరకు స్ఫూర్తిని కొనసాగించాలంటే?

‣ శాంతిభద్రతల సంరక్షణసేనలోకి స్వాగతం!

Posted Date : 31-03-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌