• facebook
  • twitter
  • whatsapp
  • telegram

పాత ప్రశ్నపత్రాలు... ఎందుకు ముఖ్యం?

అకడమిక్, కాంపిటేటివ్, పరీక్ష ఏదైనా కానీయండి... సన్నద్ధతలో ముందు సంవత్సరాల ప్రశ్నపత్రాలు  (ప్రీవియస్‌ ఇయర్‌ క్వశ్చన్‌ పేపర్స్‌) కచ్చితంగా చూడమనే బోధకులు చెబుతారు.. ఎందుకో తెలుసా?  సన్నద్ధతలో వీటికున్న ప్రాముఖ్యం, చదవడం వల్ల కలిగే లాభాలు, వదిలేస్తే కలిగే నష్టాలు.. చెప్పాలంటే జాబితా చాలానే ఉంది. మరి అవేంటో చూసేద్దామా!


‣ గత సంవత్సరాల ప్రశ్నపత్రాలు చూడటం వల్ల పరీక్ష ఏ విధంగా ఉండబోతోందనే విషయంపై విద్యార్థికి స్పష్టమైన అవగాహన వస్తుంది. అంతేకాదు, చాలాసార్లు ఆ ప్రశ్నలను మళ్లీ ఈ ఏడాదీ అడిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల విద్యార్థికి కొన్ని మార్కులు కచ్చితంగా వచ్చే చాన్స్‌ ఉంటుంది! 


‣  ఒక సబ్జెక్ట్‌కు సంబంధించి చాలా ప్రశ్నపత్రాలు చూసినప్పుడు... మొత్తంగా చాప్టర్లు అన్నింటిపైనా  అవగాహన, దేన్నుంచి ఎలాంటి ప్రశ్నలు అడగవచ్చనే అంచనా వచ్చేస్తుంది. దీనివల్ల ఆ పరీక్ష బాగా రాయగలమనే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.


‣  ఈ ప్రశ్నపత్రాలను మళ్లీ మళ్లీ రాయడం ద్వారా చక్కగా సాధన అవుతుంది. కనీసం గత పదేళ్ల పేపర్లు తిరగేసినప్పుడు... విద్యార్థి తానెలా పరీక్ష రాస్తున్నాడో విశ్లేషణ చేసుకోగలుగుతాడు. 


‣  పునశ్చరణలో పాత ప్రశ్నపత్రాలది కీలకపాత్ర. ఒకసారి సబ్జెక్ట్‌ మొత్తం చదువుకుని మళ్లీ రివిజన్‌కు కూర్చునేటప్పుడు పూర్వ సంవత్సరాల పేపర్స్‌ చదవడం వల్ల రివిజన్‌ క్రమపద్ధతిలో జరుగుతుంది. 


‣  టైం మేనేజ్‌మెంట్‌ను సాధన చేసేందుకు కూడా ఇవి పనికొస్తాయి. ఇచ్చిన సమయంలో పూర్తిగా అన్ని ప్రశ్నలకూ జవాబులు రాయగలిగేలా సాధన చేసేందుకు ఇవి సరైన మార్గం. దానివల్ల అసలు పరీక్షలో సమయాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవచ్చు. 


‣  ఒక సబ్జెక్టుకు సంబంధించిన పరీక్ష రాసినప్పుడు ఏ చాప్టర్‌లో బలంగా ఉన్నామో, ఏ చోట జవాబులు ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నామో తెలుసుకునేందుకు ఈ సాధన ఉపయోగపడుతుంది. 


‣  పరీక్షలో అనుకున్న ఫలితాలు సాధించాలంటే... జవాబులు మాత్రమే కాదు, తగిన వ్యూహం కూడా తెలిసుండాలి. ఏం చేస్తే విజయవంతంగా పరీక్ష రాయగలమో తెలియాలి అంటే పాత ప్రశ్నపత్రాల సాధన తప్పనిసరి. అందుకే ఈసారి దీన్ని మిస్‌ చేయకండేం!

మరింత సమాచారం... మీ కోసం!

‣ భారతీయ కోర్సులకు టాప్‌ ర్యాంకులు

‣ కొయ్యగుజ్జు అడవులతో.. మంచుపొరల ఎడారులతో!

‣ సైబర్‌ సెక్యూరిటీలో ఏ కోర్సులు?ఎలాంటి ఉద్యోగాలు?

‣ మెరుగైన పీజీకి మేలైన మార్గం!

‣ చివరి వరకు స్ఫూర్తిని కొనసాగించాలంటే?

‣ శాంతిభద్రతల సంరక్షణసేనలోకి స్వాగతం!

Posted Date : 31-03-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌