పంజాబ్‌లోని జలంధర్‌లో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వివిధ నాన్- ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. టెక్స్‌టైల్ టెక్నాలజీ, సివిల్ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్ మొదలైన విభాగాల్లో 105 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.
టెక్నికల్ అసిస్టెంట్ 23, ఎస్‌ఏఎస్ అసిస్టెంట్ 1, జూనియర్ ఇంజినీర్ 3, సీనియర్ స్టెనోగ్రాఫర్ 2, స్టెనోగ్రాఫర్ 2, సీనియర్ అసిస్టెంట్ 6, సీనియర్ టెక్నీషియన్ 13, టెక్నీషియన్ 26, జూనియర్ అసిస్టెంట్ 13, ఆఫీస్ అటెండెంట్ 16 పోస్టులు ఉన్నాయి. మొత్తం 105 ఖాళీల్లో అన్‌రిజర్వుడ్-58, ఓబీసీ-25, ఎస్సీ-11, ఎస్టీ-4, ఈడబ్ల్యూఎస్-7 కేటాయించారు.
అర్హతలు:
1. సీనియర్ అసిస్టెంట్ పోస్టుకు 10+2 పాసై, కంప్యూటర్ పైన నిమిషానికి 35 పదాలను టైప్ చేయగలగాలి. కంప్యూటర్ వర్డ్ ప్రాసెసింగ్, స్ప్రెడ్‌షీట్ నైపుణ్యం ఉండాలి. డిగ్రీ చదివి, కంప్యూటర్, స్టెనోగ్రఫీ నైపుణ్యాలు ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు. వయసు 33 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక: 1. సీనియర్ అసిస్టెంట్ పోస్టు ఎంపిక మూడు స్టేజిల్లో ఉంటుంది. స్టేజ్-1లోని స్క్రీనింగ్ టెస్ట్‌లో 75 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు.. తప్పు సమాధానానికి 1/4 వంతు మార్కును తగ్గిస్తారు. దీంట్లో
జనరల్ ఇంగ్లిష్: టెన్సెస్, యాక్టివ్ అండ్ పాసివ్, డైరెక్ట్ అండ్ ఇన్‌డైరెక్ట్ స్పీచ్, పంక్చువేషన్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, వన్ వర్డ్ సబ్‌స్టిట్యూట్స్, మోడల్స్, ఆర్టికల్స్, క్లాజస్, సిననిమ్స్, యాంటనిమ్స్, ఇడియమ్స్, ఫ్రేజెస్ ఉంటాయి.
న్యూమరికల్ ఆప్టిట్యూడ్-అరిథ్‌మెటిక్: సింప్లిఫికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంటరెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, పర్సంటేస్, యావరేజెస్, నంబర్ సిస్టమ్, టైమ్ అండ్ వర్క్, ప్రాబ్లమ్స్ ఆన్ ట్రెయిన్స్, క్యాలెండర్, ఏరియా, ప్రాబ్లమ్స్ ఆన్ నంబర్స్, స్క్వేర్ రూట్, క్యూబ్ రూట్, టైమ్ అండ్ డిస్టెన్స్‌ల నుంచి ప్రశ్నలు ఇస్తారు.
రీజనింగ్ అండ్ డేటా ఇంటర్‌ప్రెటేషన్: నంబర్ సిరీస్ కాంపిలేషన్, మిస్సింగ్ నంబర్ ఫైండింగ్, పాట్రన్ సిరీస్, డైరెక్షన్ సెన్స్ టెస్ట్, క్లాసిఫికేషన్, మిస్సింగ్ క్యారెక్టర్ ఫైండింగ్, ఆడ్‌మేన్ అవుట్, బ్లడ్ రిలేషన్స్, ఎనాలజి, కోడింగ్ అండ్ డికోడింగ్, లెటర్ అండ్ సింబల్ సిరీస్, వెర్బల్ రీజనింగ్, స్టేట్‌మెంట్ అండ్ కన్‌క్లూజన్స్, లెటర్ అండ్ సింబల్ సిరీస్, లాజికల్ ప్రాబ్లమ్స్, అరిథ్‌మెటిక్ రీజనింగ్, లాజికల్ సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్, పైచార్ట్ అండ్ బార్.. మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు.
‣ స్టేజ్-2 స్కిల్ టెస్ట్‌లో భాగంగా టైపింగ్ స్పీడ్ టెస్ట్ ఉంటుంది. నిమిషానికి 35 ఇంగ్లిష్ లేదా హిందీ పదాలను కంప్యూటర్‌పైన టైప్ చేయగలగాలి. దీంట్లో అర్హత సాధించినవాళ్లను స్టేజ్-3కి ఎంపికచేస్తారు.
‣ స్టేజ్-3లో 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. తప్పు సమాధానానికి 1/4 మార్కు తగ్గిస్తారు. దీంట్లో అర్హత సాధించాలంటే.. అన్‌రిజర్వుడ్ అభ్యర్థులకు 30 శాతం. ఈడబ్ల్యూఎస్. ఓబీసీలు 27 శాతం, ఎస్సీ, ఎస్టీ 20 శాతం, పీడబ్ల్యూడీ 15 శాతం మార్కులు సాధించాలి. దీంట్లో సాధించిన మార్కుల ఆధారంగానే అభ్యర్థుల తుది ఎంపిక ఆధారపడుతుంది.
రాత పరీక్షలో: జనరల్ ఇంగ్లిష్, జనరల్ హిందీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్, అప్లికేషన్స్ ఆఫ్ కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ఎంఎస్‌వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, ట్యాలీ మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఇంటర్నెట్, ఈమెయిల్, ఆఫీస్ ప్రొసీజర్ సర్వీస్ మేటర్స్, లీవ్, పర్చేస్ ఎల్‌టీసీ, ఇతర ప్రభుత్వ నిబంధనలకు సంబంధించిన ప్రశ్నలు ఇస్తారు.
‣ జూనియర్ ఇంజినీర్, ఎస్‌ఏఎస్ అసిస్టెంట్ పోస్టులకు గరిష్ఠ వయసు 30 సంవత్సరాలు.
‣ జూనియర్ ఇంజినీర్ పోస్టుకు సివిల్/ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ బీఈ/ బీటెక్ ఫస్ట్‌క్లాస్‌లో పాసవ్వాలి. లేదా సివిల్/ఎలక్ట్రికల్‌లో ఫస్ట్‌క్లాస్ డిప్లొమా ఉండాలి.
‣ ఎస్‌ఏఎస్ అసిస్టెంట్ పోస్టుకు ఫిజికల్ ఎడ్యుకేషన్ డిగ్రీ ఫస్ట్‌క్లాస్‌లో పాసవ్వాలి.
‣ మూడు దశల్లో పరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఎంపికచేస్తారు.
‣ రాత పరీక్ష తేదీనీ, ఉద్యోగ నియామకాలకు సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.
ముఖ్యాంశాలు
‣ ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకుంటే.. వేర్వేరుగా దరఖాస్తులు పంపాలి.
‣ దరఖాస్తు ఫీజు: రూ.1000
ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్థులకు రూ.500.
చివరి తేదీ: 01.03.2023
వెబ్‌సైట్: www.nitj.ac.in/
మరింత సమాచారం... మీ కోసం!
‣ కేంద్రీయ సంస్థల్లో యూజీ.. పీజీ!
‣ ప్రాంగణ ఎంపికలకు.. పక్కా సంసిద్ధత