• facebook
  • twitter
  • whatsapp
  • telegram

'మహీంద్రా'లో కొత్త ఎంటెక్‌ కోర్సులు

మహీంద్రా యూనివర్సిటీ హైదరాబాద్‌ నగరంలో ఉన్న క్యాంపస్‌లో ఎంటెక్‌ కోర్సులో కొత్తగా 4 స్పెషలైజేషన్లను ప్రవేశపెట్టింది. నేటితరం అవసరాలను దృష్టిలో ఉంచుకుని, విద్యార్థులను ఇండస్ట్రీకి సిద్ధం చేసేలా ఈ కోర్సులను రూపొందించారు.

ఇకోల్‌ సెంట్రల్‌ స్కూల్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ - మహీంద్ర యూనివర్సిటీ నిర్వహిస్తున్న ఈ కోర్సులు... ఇంజినీరింగ్‌లో కొత్త టెక్నాలజీతో కలగలిసి ఉండబోతున్నాయి. అవి... సీఎస్‌ఈ, డేటా సైన్స్‌ అండ్‌ ఏఐ, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌ అండ్‌ వీఎల్‌ఎస్‌ఐ, సిస్టమ్స్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ పవర్‌ ఎలక్ట్రానిక్స్‌. 

గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ, తత్సమాన అర్హత కలిగిన వారు ఈ కోర్సులకు దరఖాస్తు చేసేందుకు అర్హులు. కనీసం 60 శాతం మార్కులు పొంది ఉండటం తప్పనిసరి. గేట్‌ పరీక్షలో 80, ఆపైన పర్సంటైల్‌ ఉన్నవారు ప్రవేశానికి ముఖాముఖి పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇతరులు యూనివర్సిటీ నిర్వహించే ప్రవేశపరీక్ష రాయాలి. 

గేట్‌ పరీక్ష ద్వారా చేరాలనుకునే విద్యార్థులకు ఏడాదికి ఫీజు రూ.లక్ష ఉంటుంది. వారికి రూ.15 వేలు స్టైపెండ్‌తో కూడిన టీచింగ్‌ అసిస్టెంట్‌షిప్‌ లభిస్తుంది. క్యాంపస్‌లో ఉండటం, భోజన వసతి ఉచితంగా లభిస్తాయి. ఇతరులు ఫీజు రూ.లక్షకు అదనంగా రూ.2 లక్షల హాస్టల్‌ రుసుం కట్టాలి.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సరిహద్దు రహదారుల సంస్థలో ఉద్యోగాలు

‣ మేనేజ్‌మెంట్‌ విద్యలో ఆకర్షణీయ కోర్సులు

‣ ఫెయిల్ అయ్యారా... ఏం పర్లేదు!

‣ ఇంటర్‌లో ఏ గ్రూప్‌ను ఎంచుకోవాలి?

‣ స్వయంగా నేర్చుకుందాం

‣ మారిన పరిస్థితుల కోసం మరో వ్యూహం

Posted Date : 01-07-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌