‣ డిగ్రీ, పీజీ అర్హతతో అవకాశం
రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ (ఆర్సీఎఫ్) లిమిటెడ్ 158 మేనేజ్మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఈ పోస్టులకు ఆన్లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వివిధ విభాగాల్లో మేనేజ్మెంట్ ట్రెయినీ పోస్టుల సంఖ్య, వాటికి దరఖాస్తు చేయటానికి అవసరమైన అర్హతలేమిటో చూద్దాం.
1. కెమికల్ - 51: కెమికల్ ఇంజినీరింగ్/ పెట్రోకెమికల్ ఇంజినీరింగ్/ కెమికల్ టెక్నాలజీలో నాలుగేళ్ల బీఈ/ బీటెక్ ఇంజినీరింగ్ పూర్తిచేయాలి.
2. మెకానికల్- 30: మెకానికల్ బ్రాంచ్‌తో బీఈ/ బీటెక్ ఇంజినీరింగ్ పాసవ్వాలి.
3. ఎలక్ట్రికల్-27: ఎలక్ట్రికల్ బ్రాంచ్‌తో బీఈ/ బీటెక్ ఇంజినీరింగ్ పాసవ్వాలి.
4. ఇన్స్ట్రుమెంటేషన్-18: ఇన్స్ట్రుమెంటేషన్ బ్రాంచ్‌తో బీఈ/ బీటెక్ ఇంజినీరింగ్ పాసవ్వాలి.
5. సివిల్-4: సివిల్ బ్రాంచ్‌తో బీఈ/ బీటెక్ ఇంజినీరింగ్ పాసవ్వాలి.
6. ఫైర్-2: ఫైర్/ ఫైర్ అండ్ సేఫ్టీ బ్రాంచ్‌తో బీఈ/ బీటెక్ ఇంజినీరింగ్ పాసవ్వాలి.
7. సీసీల్యాబ్-1: కెమిస్ట్రీ సబ్జెక్టులో పీహెచ్డీ చేయాలి. లేదా కెమికల్ ఇంజినీరింగ్/ పెట్రోకెమికల్ ఇంజినీరింగ్/ కెమికల్ టెక్నాలజీలో బీఈ/ బీటెక్ పూర్తిచేయాలి.
8. ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్-3: ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ బ్రాంచ్‌తో బీఈ/ బీటెక్ చేయాలి. లేదా ఏదైనా బ్రాంచ్‌తో బీఈ/బీటెక్ చేసి.. ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్/ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ అండ్ మేనేజ్మెంట్/ ఇండస్ట్రిల్ ఇంజినీరింగ్ అండ్ ఆపరేషన్స్ రిసెర్చ్‌లో పీజీ డిగ్రీ/ డిప్లొమా పాసవ్వాలి.
9. మార్కెటింగ్-10: సైన్స్/ ఇంజినీరింగ్/ అగ్రికల్చర్ డిగ్రీ, ఎంబీఏ (మార్కెటింగ్)/ అగ్రికల్చర్ పాసవ్వాలి. లేదా సైన్స్/ ఇంజినీరింగ్/ అగ్రికల్చర్ డిగ్రీ, పీజీ డిప్లొమా ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్/ అగ్రికల్చర్/ మార్కెటింగ్ పూర్తిచేయాలి.
10. హ్యూమన్ రిసోర్సెస్-5: ఏదైనా డిగ్రీ, హ్యూమన్ రిసోర్స్/ పర్సనల్/ సోషల్ వర్క్/ వెల్ఫేర్/ ఇండస్ట్రియల్ రిలేషన్స్/ లేబర్ స్టడీస్‌లో మాస్టర్ డిగ్రీ చేయాలి. లా డిగ్రీ చేసి, మరాఠీ భాష మాట్లాడేవారికి ప్రాధాన్యం.
11. అడ్మినిస్ట్రేషన్-4: ఏదైనా డిగ్రీ, ఎంబీఏ (హెచ్ఆర్)/ మేనేజ్మెంట్ స్టడీస్/ మాస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ పూర్తిచేయాలి.
12. కార్పొరేట్ కమ్యూనికేషన్-3: ఏదైనా డిగ్రీ, మీడియా స్టడీస్, పబ్లిక్ రిలేషన్స్/ మాస్ కమ్యూనికేషన్/ జర్నలిజంలో పీజీ చేయాలి.
‣ ఇంజినీరింగ్ డిగ్రీని అన్‌రిజర్వుడ్ అభ్యర్థులు 60 శాతం మార్కులతో, ఎస్సీ/ఎస్టీలు 55 శాతం మార్కులతో పాసవ్వాలి.
‣ రెగ్యులర్ అండ్ ఫుల్‌టైమ్ డ్యూయల్/ ఇంటిగ్రేటెడ్/ అలైడ్ డిగ్రీ పాసైనవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.
01.06.2024 నాటికి అన్‌రిజర్వుడ్/ ఈబ్ల్యూఎస్ అభ్యర్థులకు 27 సంవత్సరాలు మించకూడదు. గరిష్ఠ వయసులో ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు కేటగిరీని బట్టి పది నుంచి పదిహేనేళ్ల సడలింపు ఉంటుంది.
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌లకు దరఖాస్తు ఫీజు రూ.1000 (బ్యాంక్ ఛార్జీలు అదనం). ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్-సర్వీస్‌మెన్/ మహిళలకు ఫీజు లేదు.
పరీక్ష ఎలా?
కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ ఆబ్జెక్టివ్ పరీక్షను దేశంలోని వివిధ నగరాల్లో నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌లో జరుగుతుంది. ప్రశ్నపత్రం హిందీ,
ఇంగ్లిష్‌లో ఉంటుంది. వ్యవధి 90 నిమిషాలు.
‣ ప్రశ్నపత్రంలోని రెండు భాగాల్లో వంద ప్రశ్నలు ఉంటాయి. యాభై ప్రశ్నలు విద్యార్హతలకు సంబంధించిన సబ్జెక్టుల నుంచి ఇస్తారు. ప్రశ్నకు రెండు మార్కులు.
‣ జనరల్ ఇంగ్లిష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ జనరల్ నాలెడ్జ్/ అవేర్నెస్ నుంచి యాభై ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నకు ఒక మార్కు. నెగటివ్ మార్కింగ్ ఉంటుంది.
‣ పరీక్ష తేదీని అడ్మిట్ కార్డ్ ద్వారా తెలియజేస్తారు. దీన్ని వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ సమాచారాన్ని ఈమెయిల్/ ఎస్ఎంఎస్కు తెలుపుతారు.
‣ ఆన్లైన్ టెస్ట్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా 1:7 నిష్పత్తిలో పర్సనల్ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.
‣ ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులకు 3 టైర్ ఏసీ రైలు/ బస్ ఛార్జీలు చెల్లిస్తారు.
‣ ఆన్లైన్ టెస్ట్‌కు 80 శాతం, పర్సనల్ ఇంటర్వ్యూకు 20 శాతం వెయిటేజీ ఇస్తారు.
‣ ఇంటర్వ్యూలో అర్హత సాధించినవారికి వైద్య పరీక్షలు నిర్వహించి, కేటగిరీలవారిగా తుది ఎంపిక చేస్తారు.
సన్నద్ధత
విద్యార్హతలకు సంబంధించిన పాఠ్యాంశాలపై పట్టు సాధించాలి. గతంలో చదివినవే కదా అనే నిర్లక్ష్య ధోరణి పనికిరాదు. ముఖ్యాంశాలను తప్పనిసరిగా పునశ్చరణ చేసుకోవాలి.
‣ జనరల్ ఇంగ్లిష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ జనరల్ నాలెడ్జ్/ అవేర్‌నెస్‌కు బ్యాంక్, ఎస్ఎస్బీ, ఆర్ఆర్బీ పోటీ పరీక్షల పాత ప్రశ్నపత్రాలను సాధన చేయొచ్చు. పరీక్ష వ్యవధిలోనే సమాధానాలు గుర్తించడానికి ప్రయత్నించాలి.
‣ ఆన్లైన్లో అందుబాటులో మోడల్ టెస్ట్‌లు రాయాలి. ఏయే అంశాల్లో వెనకబడి ఉన్నారో సమీక్షించుకుని.. వాటి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 01.07.2024,
వెబ్సైట్: https://www.nitrkl.ac.in/
మరింత సమాచారం... మీ కోసం!
‣ వినూత్న కెరియర్‌కు.. మాలిక్యులర్ జెనెటిక్స్!
‣ డిజిటల్ బిజినెస్ కోర్సులో అడ్మిషన్లు!
‣ కొలువులు కురిపించే కంప్యూటర్ మేఘం!