• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఐఐటీఎంలో ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ పోస్టులు

జూన్‌ 18 దరఖాస్తు గడువు


పుణెలోని భారత ఉష్ణ మండల వాతావరణ విజ్ఞాన సంస్థ ఒప్పంద ప్రాతిపదికన 65 ప్రాజెక్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. విద్యార్హతలు, నెట్‌/ సీఎస్‌ఐఆర్‌ - యూజీసీ/ గేట్‌ స్కోర్, ఉద్యోగానుభవం ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.


ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాపికల్‌ మీటీయరాలజీ (ఐఐటీఎం) ప్రకటించిన ఈ పోస్టులకు జూన్‌ 18, 2024 నాటికి తగిన అర్హతలున్నవారు దరఖాస్తు చేయాలి. 

విద్యార్హతల, అనుభవం ఆధారంగా స్క్రీనింగ్, షార్ట్‌లిస్టింగ్‌ చేసి ఇంటర్వ్యూకు పిలుస్తారు.

‣ అభ్యర్థుల సంఖ్యను బట్టి ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. 

వైద్య పరీక్షల్లో అర్హత సాధించినవారిని విధుల్లోకి తీసుకుంటారు. 

ఇంటర్వ్యూకు హాజరయ్యే ఎస్సీ/ ఎస్టీలకు టీఏ/డీఏలను చెల్లిస్తారు. ఇతర వర్గాలకు చెందిన అభ్యర్థులు సొంతంగా రవాణా, వసతి ఏర్పాట్లు చేసుకోవాలి. 


1. ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-3: 4.మీటీయరాలజీ/ ఓషనోగ్రఫీ/ అట్మాస్ఫియరిక్‌ సైన్సెస్‌/ ఎర్త్‌ సైన్సెస్‌/ క్లైమేట్‌ సైన్సెస్‌/ ఫిజిక్స్‌/ ఎలక్ట్రానిక్స్‌/ మ్యాథమెటిక్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ 60 శాతం మార్కులతో పాసవ్వాలి లేదా ఇంజినీరింగ్‌/ టెక్నాలజీ డిగ్రీ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. గరిష్ఠ వయసు 45 సంవత్సరాలు. ఏడేళ్ల పరిశోధనానుభవం ఉండాలి. 

మోడల్‌ కోడ్‌ హ్యాండ్లింగ్‌లో ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి. అనుభవాన్ని సైంటిఫిక్‌ రిపోర్ట్స్‌/ పబ్లికేషన్స్‌ ఆధారంగా పరిగణిస్తారు. 

ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌ ఉపయోగించడంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు. 


2. ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-2: 11.ఫిజిక్స్‌/ జియాలజీ/ ఎర్త్‌ సైన్స్‌/ జియోఫిజిక్స్‌/ అనలిటికల్‌ కెమిస్ట్రీలో మాస్టర్స్‌ డిగ్రీ 60 శాతం మార్కులతో పాసవ్వాలి. గరిష్ఠ వయసు 40 సంవత్సరాలు. 

ఎంఎస్‌-ఆఫీస్‌ పరిజ్ఞానం, మూడేళ్ల అనుభవం ఉండాలి.

జియోకెమికల్‌ అనలిటికల్‌ టెక్నిక్స్, అనలిటికల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ నిర్వహణ తెలిసినవారికి ప్రాధాన్యమిస్తారు. 


3. ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-1: 4.ఫిజిక్స్‌/ ఎలక్ట్రానిక్స్‌/ అట్మాస్ఫియరిక్‌ సైన్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. లేదా ఎలక్ట్రానిక్స్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌/ ఈఈఈ/ ఈఅండ్‌టీలో ఇంజినీరింగ్‌ డిగ్రీ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. గరిష్ఠ వయసు 35 సంవత్సరాలు. 

సైన్స్‌లో డాక్టరల్‌ డిగ్రీ/ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేసినవారికీ, సంబంధిత ఉద్యోగానుభవం ఉన్నవారికి ప్రాధాన్యం. 


4. ట్రెయినింగ్‌ కోఆర్డినేటర్‌: 1. మాస్టర్స్‌ డిగ్రీ చేసి.. గవర్నమెంట్‌/ సీఎస్‌యూల్లో నాలుగేళ్ల ఉద్యోగానుభవం ఉండాలి. గరిష్ఠ వయసు 40 సంవత్సరాలు. 

హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌/ పర్సనల్‌ మేనేజ్‌మెంట్‌/ లేబర్‌ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా చేసినవారికి, సూపర్‌వైజర్‌ స్థాయిలో మూడేళ్లు పనిచేసినవారికి, జాతీయ, అంతర్జాతీయ సెమినార్లు, వర్క్‌షాప్‌లు, సమావేశాలను సమన్వయం చేసినవారికి ప్రాధాన్యమిస్తారు. 


5. సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌: 2. ఫిజిక్స్‌/ మీటీయరాలజీ/ అట్మాస్ఫియరిక్‌ సైన్సెస్‌లో ఎమ్మెస్సీ/ ఎంటెక్‌ డిగ్రీ ఉత్తీర్ణత. గరిష్ఠ వయసు 40 ఏళ్లు. 

ఇండస్ట్రియల్‌/ అకడమిక్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌/ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఆర్గనైజేషన్స్‌లోని రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ విభాగంలో నాలుగేళ్ల ఉద్యోగానుభవం ఉండాలి. 

అట్మాస్ఫియరిక్‌ ఇన్‌స్ట్రుమెంట్స్, డేటా అక్విజిషన్‌లో ప్రాథమిక పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం.  


6. ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-2: 8. ఫిజిక్స్‌/ మ్యాథమెటిక్స్‌/ మీటీయరాలజీ/ ఓషనోగ్రఫీ/ అట్మాస్ఫియరిక్‌ సైన్సెస్‌/ ఎర్త్‌ సైన్సెస్‌/ క్లైమేట్‌ సైన్సెస్‌/ స్టాటిస్టిక్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. గరిష్ఠ వయసు 35 ఏళ్లు.  

ఎర్త్‌ సిస్టమ్‌ మోడలింగ్‌/ క్లైమేట్‌ మోడలింగ్‌లో రెండేళ్ల పరిశోధనానుభవం ఉండాలి. 

సైంటిఫిక్‌ రిపోర్ట్స్‌/ పబ్లికేషన్స్‌ ఆధారంగా అనుభవాన్ని పరిగణిస్తారు. 

ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌లో పరిజ్ఞానం ఉండి.. ప్రముఖ సంస్థల్లో పనిచేసినవారికి ప్రాధాన్యం. 


7. ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-1: 33. ఫిజిక్స్‌/ అప్లైడ్‌ ఫిజిక్స్‌/ అట్మాస్ఫియరిక్‌ సైన్సెస్‌/ మీటీయరాలజీ, ఓషనోగ్రఫీ/ క్లైమేట్‌ సైన్స్‌/ జియోఫిజిక్స్‌/ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్సెస్‌లో మాస్టర్స్‌ డిగ్రీ పాసవ్వాలి. లేదా ఇంజినీరింగ్‌/ టెక్నాలజీ డిగ్రీ ఉత్తీర్ణత. గరిష్ఠ వయసు 35 సంవత్సరాలు. 

రుతుపవనాలు, వాటి వైవిధ్యాలకు సంబంధించిన పరిజ్ఞానం ఉండాలి. 

8. రిసెర్చ్‌ అసోసియేట్‌ (డీప్‌ ఓషన్‌ మిషన్‌)-2: మీటీయరాలజీ/ అట్మాస్ఫియరిక్‌ సైన్సెస్‌/ ఎర్త్‌ సైన్సెస్‌/ క్లైమేట్‌ సైన్సెస్‌/ ఓషనోగ్రఫీ/ ఫిజిక్స్‌/ అప్లైడ్‌ ఫిజిక్స్‌/ మ్యాథమెటిక్స్‌లో డాక్టరేట్‌ డిగ్రీ. లేదా ఎంటెక్‌ చదివిన తర్వాత మూడేళ్ల పరిశోధన అనుభవం ఉండాలి. గరిష్ఠ వయసు 35 సంవత్సరాలు. 

సైంటిఫిక్‌ రిపోర్ట్స్‌/ పబ్లికేషన్స్‌ ఆధారంగా అనుభవాన్ని పరిగణిస్తారు. 

‣ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌లో పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం.

ఏఐ/ఎంఎల్‌ టెక్నిక్స్‌లో అనుభవం ఉండాలి. 

దరఖాస్తుకు చివరి తేదీ: 18.06.2024

వెబ్‌సైట్‌: http://www.tropmet.res.in/Careers


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ డేటాసైన్స్‌తో ఉద్యోగ అవకాశాలు!

‣ ఐటీఐతో ఉద్యోగ అవకాశాలు!

‣ రాతల్లో తగ్గినా.. మాటతో మెరిశారు!

‣ ఇంటర్‌తో త్రివిధ దళాల్లో ఉద్యోగాలు!

Posted Date : 27-05-2024 .

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

విద్యా ఉద్యోగ సమాచారం