• facebook
  • twitter
  • whatsapp
  • telegram

మైక్రోటాస్కింగ్‌ ప్రయత్నించండి!

మనకు మల్టీ టాస్కింగ్‌ తెలుసు... ఒకే సమయంలో అధిక పనులు చేయడం. మరి మైక్రో టాస్కింగ్‌ అంటే ఏంటో తెలుసా? విద్యార్థులకు పనికొచ్చేలా ఈ నమూనాను ఎలా అర్థం చేసుకోవాలంటే...

చేయాల్సిన మొత్తం పనిని వీలైనంత చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి ప్రతిదాన్నీ వందశాతం కచ్చితత్వంతో చేసేందుకు ప్రయత్నించడమే మైక్రోటాస్కింగ్‌. ఉదాహరణకు ఇవాళ మీరో చాప్టర్‌ పూర్తిగా చదవాలి అనుకున్నారనుకుందాం. దాన్ని పూర్తిచేసే క్రమంలో ఒక్కో చోట, ఒక్కో సమయంలో  మీ ఏకాగ్రత ఒక్కో విధంగా ఉంటుంది. మొదటి ప్రశ్న చదివినంత బాగా చివరిది చదవలేకపోవచ్చు. పని అంతా ఏకమొత్తంలో చేయడం వల్ల కలిగే ఇబ్బంది ఇది. 

కానీ మైక్రోటాస్కింగ్‌లో ఇలా ఉండదు. ఒక చాప్టర్‌ చదవాలి అనుకుంటే... ఉన్న ప్రశ్నలు - జవాబులు, అదనపు పాయింట్లు... ఇలా ప్రతిదీ ఒక టాస్క్‌. ప్రతి టాస్క్‌ పూర్తిచేశాక ఎప్పటికప్పుడు అందులో మనం పర్‌ఫెక్ట్‌గా ఉన్నామా లేదా అనేది సరిచూసుకుంటాం. ప్రతీ టాస్క్‌ పూర్తయ్యాక ఐదు, పది నిమిషాల విరామం తీసుకుంటాం. దీనివల్ల మొత్తం అన్నీ పూర్తయ్యే సమయానికి ఆ చాప్టర్‌ మీద పూర్తిస్థాయిలో పట్టు సంపాదించి ఉంటాం. ఎక్కువ కాలం గుర్తుంటుంది కూడా. మీరు కూడా ఈ విధానం ఎలా ఉంటుందో ఒకసారి చెక్‌ చేసి చూడండి మరి!
 

********************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ పాదాలు పదిలం... కొలువులు పుష్కలం!

‣ నకిలీ వెబ్‌సైట్‌లతో జాగ్రత్త!

‣ అందరి అంచనాల ప్రకారం ఉండాలా?

‣ సొంత నోట్స్‌తో సక్సెస్‌!

‣ బోధన, పరిశోధన రంగాల్లోకి రహదారి!

‣ నవతరం బాలలకు నవోదయ స్వాగతం

‣ ఇష్టపడి చదివితే చాలు!

Posted Date : 11-01-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌