• facebook
  • twitter
  • whatsapp
  • telegram

షుగర్‌ టెక్నాలజీలో పీజీ డిప్లొమా ప్రవేశాలు

దరఖాస్తు చివరి తేది: మే 5

షుగర్‌ టెక్నాలజీలో జాబ్‌ ఓరియెంటెడ్‌ పీజీ డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సుల్లో ప్రవేశానికి నేషనల్‌ షుగర్‌ ఇన్‌స్టిట్యూట్, కాన్పూర్‌ ప్రకటన విడుదల చేసింది. పరీక్షలో చూపిన ప్రతిభతో ప్రవేశాలు లభిస్తాయి. ఇందులో చేరినవారికి స్కాలర్‌షిప్పులు, స్టైపెండ్‌ అందుతాయి. విజయవంతంగా కోర్సు పూర్తిచేసుకున్నవారు ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగం పొందే వీలుంది. ప్రకటన వెలువడిన నేపథ్యంలో కోర్సుల వివరాలు..

పీజీ డిప్లొమాలు

షుగర్‌ టెక్నాలజీ

అర్హత: బీఎస్సీ ఎంపీసీ లేదా కెమికల్‌ ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సు వ్యవధి రెండున్నరేళ్లు. సీట్ల సంఖ్య 66.

షుగర్‌ ఇంజినీరింగ్‌

అర్హత: బీటెక్‌ లేదా ఏఎంఐఈలో మెకానికల్‌/ ప్రొడక్షన్‌/ ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎల్రక్టానిక్స్‌ విభాగాలవారు అర్హులు. ఈ కోర్సు ఏడాదిన్నర వ్యవధితో అందిస్తున్నారు. సీట్ల సంఖ్య 40.

ఇండస్ట్రియల్‌ ఫర్మెంటేషన్‌ అండ్‌ ఆల్కహాల్‌ టెక్నాలజీ

అర్హత: బీఎస్సీలో కెమిస్ట్రీ/ అప్లయిడ్‌ కెమిస్ట్రీ/ ఇండస్ట్రియల్‌ కెమిస్ట్రీ/ బయోకెమిస్ట్రీ వీటిలో ఏదో ఒక సబ్జెక్టు చదివుండాలి లేదా బీటెక్‌ బయోటెక్నాలజీ/ కెమికల్‌ ఇంజినీరింగ్‌/ బయో కెమికల్‌ ఇంజీనీరింగ్‌ చదివుండాలి. కోర్సు వ్యవధి 18 నెలలు. సీట్ల సంఖ్య 50.

షుగర్‌ కేన్‌ ప్రొడక్టివిటీ అండ్‌ మెచ్యూరిటీ మేనేజ్‌మెంట్‌

అర్హత: బీఎస్సీ లేదా బీఎస్సీ అగ్రికల్చర్‌ చదివుండాలి. కోర్సు వ్యవధి ఏడాది. సీట్ల సంఖ్య 20. 

ఇండస్ట్రియల్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్‌ ప్రాసెస్‌ కంట్రోల్‌

అర్హత: ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్‌...తదితర విభాగాల్లో బీటెక్‌ లేదా ఏఎంఐఈ పూర్తిచేసినవారు అర్హులు. ఏడాది వ్యవధితో కోర్సు అందిస్తున్నారు. సీట్ల సంఖ్య 17

క్వాలిటీ కంట్రోల్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌

అర్హత: బీఎస్సీ ఎంపీసీ లేదా బీజడ్‌సీ లేదా బీస్సీ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ లేదా బీఎస్సీ/బీటెక్‌ బయో టెక్నాలజీ కోర్సుల్లో ఏదైనా చదివుండాలి. కోర్సు వ్యవధి ఏడాది. సీట్ల సంఖ్య 22.

సర్టిఫికెట్‌ కోర్సులు

షుగర్‌ బాయిలింగ్‌

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత. ఈ విభాగంలో అనుభవం ఉండాలి. వ్యవధి 18 నెలలు. 63 సీట్లు ఉన్నాయి. 

షుగర్‌ ఇంజినీరింగ్‌

అర్హత: మెకానికల్‌/ ప్రొడక్షన్‌/ ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రానిక్స్‌ విభాగాల్లో డిప్లొమా. వ్యవధి ఏడాది. 17 సీట్లు ఉన్నాయి.

క్వాలిటీ కంట్రోల్‌

అర్హత: ఎంపీసీ గ్రూప్‌తో ఇంటర్‌ ఉత్తీర్ణత. ఈ కోర్సు 4 నెలల వ్యవధితో అందిస్తున్నారు. 30 సీట్లు ఉన్నాయి.

ప్రవేశం: పై అన్ని కోర్సులకూ పరీక్షలో చూపిన ప్రతిభతో ప్రవేశాలుంటాయి. 

ఎఫ్‌ఎన్‌ఎస్‌ఐ కోర్సులు

షుగర్‌ టెక్నాలజీ/ సుగర్‌ కెమిస్ట్రీ, షుగర్‌ ఇంజినీరింగ్, ఫెర్మెంటేషన్‌ టెక్నాలజీ ఇవి ఇండస్ట్రీ స్పాన్సర్డ్‌ కోర్సులు. ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశాలుంటాయి. 

కోర్సులను పూర్తి చేసుకున్నవారికి పంచదార పరిశ్రమల్లో, అనుబంధ రంగాల్లో అవకాశాలు లభిస్తాయి. ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్న విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సును బట్టి ప్రవేశ పరీక్ష విధానంలో మార్పులు ఉంటాయి. ఈ సంస్థలో కోర్సులు పూర్తిచేసుకున్నవారిని దేశంలోని ప్రముఖ పంచదార పరిశ్రమలు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్ల ద్వారా అవకాశాలు కల్పిస్తున్నాయి. విదేశాల్లోనూ ఉద్యోగం పొందడానికి అవకాశాలున్నాయి. 

ముఖ్య సమాచారం..

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: మే 5 సాయంత్రం 5 వరకు స్వీకరిస్తారు.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీలకు రూ.వెయ్యి. ఇతరులకు రూ.1500.

పరీక్ష: జూన్‌ 25న 

పరీక్ష కేంద్రాలు: పుణె, చెన్నై, దిల్లీ, కోల్‌కతా, కాన్పూర్, పట్నా, మీరట్, గోరఖ్‌పూర్‌.

వెబ్‌సైట్‌: http://nsi.gov.in/
 

********************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఇస్రోలో 62 టెక్నికల్‌ ఉద్యోగాలు

‣ లాభదాయక కెరియర్‌.. బిజినెస్‌ ఇంజెలిజెన్స్‌

‣ డిగ్రీతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

‣ అవకాశం సులువు.. అధిక మార్కెట్‌ విలువ!

Posted Date : 14-04-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌