• facebook
  • twitter
  • whatsapp
  • telegram

డిప్లొమాతో ఎన్‌టీపీసీలో అవకాశాలు

రాత పరీక్ష, స్కిల్‌/ కాంపిటెన్సీ పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక



నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌టీపీసీ) సంస్థకు చెందిన మైనింగ్‌ లిమిటెడ్‌ 114 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పదోతరగతి, ఇంజినీరింగ్‌ డిప్లొమా పాసైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్కిల్‌/ కాంపిటెన్సీ పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 


పదో తరగతి, ఇంజినీరింగ్‌ డిప్లొమా అర్హతలతో 7 రకాల ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లో పనిచేయడానికి సిద్ధంగా ఉంటేనే దరఖాస్తు చేయాలి. 


1. మైనింగ్‌ ఓవర్‌మ్యాన్‌: 52 ఖాళీలు. ఫుల్‌టైమ్‌ రెగ్యులర్‌ మైనింగ్‌ డిప్లొమా 60 శాతం మార్కులతో పాసవ్వాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు పాసైతే సరిపోతుంది. ఓవర్‌మ్యాన్‌ సర్టిఫికెట్‌ ఆఫ్‌ కాంపిటెన్సీ, ఫస్ట్‌ ఎయిడ్‌ సర్టిఫికెట్‌ ఉండాలి. 


2. మేగజైన్‌ ఇన్‌ఛార్జ్‌: 7 ఖాళీలు. మైన్‌ ఓవర్‌మ్యాన్‌ ఉద్యోగానికి వర్తించే విద్యార్హతలే ఈ పోస్టుకూ వర్తిస్తాయి. 


3. మెకానికల్‌ సూపర్‌వైజర్‌: 21 ఖాళీలు. మెకానికల్‌/ ప్రొడక్షన్‌ ఇంజినీరింగ్‌లో 60 శాతం మార్కులతో డిప్లొమా పాసవ్వాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు పాస్‌ మార్కులు సరిపోతాయి. 


4. ఎలక్ట్రికల్‌ సూపర్‌వైజర్‌: 13 ఖాళీలు. ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. ఎస్సీ/ఎస్టీలకు పాస్‌ మార్కులు సరిపోతాయి. ఎలక్ట్రికల్‌ సూపర్‌వైజర్‌ సర్టిఫికెట్‌ ఆఫ్‌ కాంపిటెన్సీ ఉండాలి. 


5. ఒకేషనల్‌ ట్రెయినింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌: 3 ఖాళీలు. మైనింగ్‌/ ఎలక్ట్రికల్‌/ మెకానికల్‌ డిప్లొమా 60 శాతం మార్కులతో పాసవ్వాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు పాసైతే చాలు. ఓవర్‌మ్యాన్‌/ ఫోర్‌మ్యాన్‌ సర్టిఫికెట్‌ ఆఫ్‌ కాంపిటెన్సీ, ఫస్ట్‌ఎయిడ్‌ సర్టిఫికెట్‌ ఉండాలి. మైన్స్‌లో 5 ఏళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. 


6. జూనియర్‌ మైన్‌ సర్వేయర్‌: 11 ఖాళీలు. మైన్‌ సర్వే/ మైనింగ్‌ ఇంజినీరింగ్‌/ మైనింగ్‌ అండ్‌ మైన్‌ సర్వేయింగ్‌/ సివిల్‌ డిప్లొమా 60 శాతం మార్కులతో పాసవ్వాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు పాస్‌ మార్కులు సరిపోతాయి. సర్వే సర్టిఫికెట్‌ ఉండాలి. 


7. మైనింగ్‌ సర్దార్‌: 7 ఖాళీలు. మెట్రిక్‌/ పదోతరగతి పాసై, మైనింగ్‌ సర్దార్‌ సర్టిఫికెట్, ఫస్ట్‌ ఎయిడ్‌ సర్టిఫికెట్‌ ఉండాలి.  


దరఖాస్తు ఫీజు రూ.300 ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ ఎక్స్‌-సర్వీస్‌మెన్‌/ భూ నిర్వాసితులు/ మహిళలకు ఫీజు లేదు. అన్ని పోస్టులకూ గరిష్ఠ వయసు 30 సంవత్సరాలు. ఒకేషనల్‌ ట్రెయినింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌ ఉద్యోగానికి మాత్రం 40 సంవత్సరాలు. గరిష్ఠ వయసులో.. ఓబీసీలకు 3 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, భూనిర్వాసితులకు 5 ఏళ్లు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సడలింపులు వర్తిస్తాయి.


ఎంపిక

మొదటి దశలో: 100 మార్కులకు రాత పరీక్షను నిర్వహిస్తారు. మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. విద్యార్హతలకు సంబందించిన సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నకు 1 మార్కు చొప్పున కేటాయించారు. ప్రతి తప్పు సమాధానానికీ 0.25 మార్కు తగ్గిస్తారు. జనరల్‌/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రాత పరీక్షలో 40 శాతం, ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ అభ్యర్థులు 30 శాతం కనీసార్హత మార్కులు సాధించాలి. పరీక్ష వ్యవధి 120 నిమిషాలు. దీంట్లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను రెండో దశకు ఎంపిక చేస్తారు. 


రెండో దశలో: సంబంధిత విభాగంలో స్కిల్‌/ కాంపిటెన్సీ టెస్ట్‌ 100 మార్కులకు ఉంటుంది. దీంట్లో జనరల్‌/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు 40 శాతం, ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ అభ్యర్థులు 30 శాతం కనీసార్హత మార్కులు సాధించాలి. ఇది అర్హత పరీక్ష మాత్రమే. రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది. 


మొదటి, రెండో దశల్లోని రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌లను రాంచీ, ఝూర్ఖండ్‌లలో నిర్వహిస్తారు.  


ఎంపికైన అభ్యర్థులను ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లోని కోల్‌ మైనింగ్‌ ప్రాజెక్టుల్లో ఎక్కడైనా నియమించే అవకాశం ఉంటుంది. 


ఎన్‌టీపీసీ వైద్యశాలల్లో వైద్యపరీక్షలు నిర్వహించి అభ్యర్థులను తుది ఎంపిక చేస్తారు.  


దరఖాస్తుకు చివరి తేదీ: 31.12.2023


వెబ్‌సైట్‌: https://www.ntpc.co.in/


-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ సివిల్స్‌ మౌఖిక పరీక్షకు మౌలిక సూచనలు

‣ ఫర్నిచర్‌ డిజైన్‌ కెరియర్‌ గైడెన్స్‌

‣ ఐటీఐతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం

‣ గ్రూప్ 1, 2 సక్సెస్‌కు ముఖ్య సూచనలు

‣ సన్నద్ధతకు ముఖ్య సూచనలు!

‣ ఫ్యాషన్‌ కెరియర్‌లో ప్రవేశాలు

Posted Date : 15-12-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌