• facebook
  • whatsapp
  • telegram

ఫర్నిచర్‌ డిజైన్‌ కెరియర్‌ గైడెన్స్‌

కోర్సులు, ఉద్యోగావకాశాల వివరాలు



అందమైన ఇంటిని.. మరింత సుందరంగా తీర్చిదిద్దడంలో తీరైన ఫర్నిచర్‌ ఎంతో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ఈ ఆధునిక కాలానికి సరిపోయే విధంగా అత్యాధునికమైన ఫర్నిచర్‌ను తయారుచేయడంలో ఈ డిజైనర్లు రోజుకో కొత్త ఆవిష్కరణతో అదరగొడుతున్నారు. మరి ఈ సృజనాత్మకమైన, ఆసక్తికరమైన రంగం గురించి మరిన్ని వివరాలు పరిశీలిద్దామా? 


ప్రజలు వారి రోజువారీ జీవితాల్లో ఉపయోగించే ఫర్నిచర్‌ను తయారు చేయడంలో ఫర్నిచర్‌ డిజైనర్లు కీలకం. ఇప్పుడు మనం ఇళ్లలో, ఆఫీసుల్లో ఎంతో సౌకర్యవంతంగా పనిచేసుకుంటున్న, ఉపయోగిస్తున్న వస్తువులన్నీ అలాంటి ఎవరో డిజైనర్లు సృష్టించినవే! దీన్ని ఇంటీరియర్‌ డిజైన్‌లో ఒక భాగంగా చెప్పవచ్చు. ఈ రంగంపై ఆసక్తి ఉన్నవారు తగిన కోర్సులు చేయడం, తదుపరి ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించడం ద్వారా చక్కగా కెరియర్‌లోకి ప్రవేశించవచ్చు. 


ఫర్నిచర్‌ డిజైనర్లకు కొత్త తరహా వస్తువుల గురించి ఆలోచించడం, బొమ్మలుగా గీయడం, నమూనాలు తయారుచేయడం, వాటిని పరీక్షించడం.. ఇలా వివిధ పనులుంటాయి. రోజువారీ జీవితంలో ఆ వస్తువులను ఉపయోగించడం సౌలభ్యంగా ఉండేటట్లుగా తయారుచేయడం డిజైనర్‌ విధి. ఇందులో సోఫాలు, కుర్చీలు, బల్లలు, ఇతర అన్ని రకాలైన వస్తువులూ ఉంటాయి. ఇందుకోసం ఇంటర్‌ తర్వాత డిజైన్‌ కోర్సులు చేయడం ఒక మార్గం కాగా.. ప్రత్యేకంగా ఫర్నిచర్‌ డిజైనింగ్‌ కోర్సులు మన దేశంలో అందుబాటులో ఉన్నాయి. 



ఎక్కువగా ఇంటీరియర్‌ డిజైనింగ్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ ఉన్నవారు ఈ కెరియర్‌లోకి అధికంగా ప్రవేశిస్తున్నారు.


దీనికి సంబంధించిన కోర్సుల్లో విద్యార్థులు స్థలాన్ని పొదుపుగా వాడుకోవడం, సమస్యా పరిష్కారం, కమ్యూనికేషన్‌ అండ్‌ ప్రొఫెషియన్సీ, ఏదైనా 3డీ మోడలింగ్‌ సాఫ్ట్‌వేర్‌ వంటివి ఉపయోగించడం నేర్చుకుంటారు.


వీరు తమ పనుల్లో తరచూ చెక్క, లోహం, అధునాతన మెటీరియల్స్‌ను ఉపయోగిస్తారు. కాగితం మీద ఉండే స్కెచ్‌లను నమూనాగా అభివృద్ధి చేసి అవి వాడకానికి ఉపయోగకరంగా ఉన్నాయో లేదో పరిశీలిస్తారు. 


వినియోగించేందుకు అనుకూలమైన, చూడటానికి అందంగా అనిపించేలా, ఎక్కువకాలం మన్నే ఫర్నిచర్‌ను తయారుచేయడం వీరి ప్రధాన లక్ష్యం. 


చదువు కొనసాగుతున్న సమయం నుంచే కొత్త కొత్త డిజైన్లు తయారుచేయడం, వాటితో ఒక పోర్ట్‌ఫోలియో సిద్ధం చేసుకోవడం, దాన్ని నిరంతరం అప్‌డేట్‌ చేస్తూ ఉండటం ద్వారా మంచి అవకాశాలను అందిపుచ్చుకునే వీలుంటుంది. ఇందులో డిజైన్‌ ప్లానింగ్‌ స్కిల్స్‌ను ఆవిష్కరించడంతోపాటుగా ఫర్నిచర్‌ బ్లూప్రింట్స్, 3డీ డిజైన్స్, ప్రోటోటైప్‌ నుంచి ఫైనల్‌ డిజైన్‌ వరకూ పోలుస్తూ ఫొటోలు.. వంటివన్నీ ఉండటం కలిసొస్తుంది.


సృజనాత్మకంగా ఆలోచించేవారికీ, నూతన ఆవిష్కరణలపై ఆసక్తి ఉన్నవారికీ ఇది బాగా నప్పే రంగం. వివిధ తరగతులు, వర్క్‌షాప్స్, వెబినార్స్, కన్వెన్షన్స్, ఈవెంట్లకు హాజరైతే నిరంతరం అప్‌డేటెడ్‌గా ఉండవచ్చు. 



ఇలా..

పెద్ద పెద్ద ఫర్నిషింగ్‌ కంపెనీలు ఇటువంటి పోస్టుల కోసం ఫర్నిచర్‌ డిజైన్, ఆర్కిటెక్చర్, ఇంటీరియర్‌ డిజైన్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ ఉన్న వారిని ఎంపిక చేసుకుంటాయి. ఇందులో అభ్యర్థులు ఇండస్ట్రియల్‌ డిజైన్, వుడ్‌ వర్కింగ్, 3డీ డిజైన్, మ్యాథమెటిక్స్, డిజైన్‌ ఫండమెంటల్స్, పోర్టిఫోలియో డెవలప్‌మెంట్, ఆర్ట్‌ హిస్టరీ, డ్రాయింగ్, బిజినెస్, కమ్యూనికేషన్‌.. వంటి సబ్జెక్టులు చదువుకుంటారు. 

సాధారణంగా ఈ కంపెనీలు అభ్యర్థుల నుంచి డిజైన్‌ పోర్ట్‌ఫోలియో ఆశిస్తుంటాయి. చదువు కొనసాగుతున్న సమయం నుంచే కొత్త కొత్త డిజైన్లు తయారుచేయడం, వాటితో ఒక పోర్ట్‌ఫోలియో సిద్ధం చేసుకోవడం, దాన్ని నిరంతరం అప్‌డేట్‌ చేస్తూ ఉండటం ద్వారా మంచి అవకాశాలను అందిపుచ్చుకునే వీలుంటుంది. ఇందులో డిజైన్‌ ప్లానింగ్‌ స్కిల్స్‌ను ఆవిష్కరించడంతోపాటుగా ఫర్నిచర్‌ బ్లూప్రింట్స్, 3డీ డిజైన్స్, ప్రోటోటైప్‌ నుంచి ఫైనల్‌ డిజైన్‌ వరకూ పోలుస్తూ  ఫొటోలు.. వంటివన్నీ ఉండటం కలిసొస్తుంది. 


ఇంకా.. 

ఎన్‌ఐఎఫ్‌టీ, ఎన్‌ఐడీ, యూసీఈఈడీ, ఎస్‌ఈఈడీ వంటి ప్రవేశ పరీక్షలు రాయడం ద్వారా అండర్‌గ్రాడ్యుయేట్‌ స్థాయిలో ఫర్నిచర్‌ డిజైన్‌ కోర్సుల్లో చేరవచ్చు. అనంతరం మరింత పట్టు కోసం పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ కోర్సుల్లో చేరవచ్చు. 

ఈ కోర్సులు పూర్తి చేసిన వారు ఫర్నిచర్‌ డిజైనర్, క్రాఫ్ట్‌ డిజైనర్, ఇంటీరియర్‌ డిజైనర్, ఫర్నిచర్‌ కన్జర్వేటర్, ప్రొడక్ట్‌ రిసెర్చర్, ఇన్నోవేటర్‌ వంటి ఉద్యోగాల్లో చేరవచ్చు. 

ఎన్‌ఐడీ అహ్మదాబాద్, ఎంఐటీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌.. వంటి ప్రముఖ సంస్థలు అన్నింటిలోనూ ఈ కోర్సులు చేసే వీలుంది. 

ఈ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులకు ప్రముఖ ఫర్నిచర్‌ సంస్థలైన గోద్రేజ్, ఐకియా, నీల్‌కమల్, స్టైల్‌ స్పా, ఫ్లోరెన్స్‌ వంటి అనేక కంపెనీలు ఉద్యోగాలను ఆఫర్‌ చేస్తున్నాయి. 

సృజనాత్మకంగా ఆలోచించేవారికీ, నూతన ఆవిష్కరణలు చేయడంలో ఆసక్తి ఉన్నవారికీ ఇది బాగా నప్పే రంగం. 

వివిధ తరగతులు, వర్క్‌షాప్స్, వెబినార్స్, కన్వెన్షన్స్, ఈవెంట్లకు హాజరుకావడం ద్వారా నిరంతరం అప్‌డేటెడ్‌గా ఉండవచ్చు. 

దీనిపై ప్రాథమిక అవగాహన కోసం ఆన్‌లైన్‌లో వివిధ లెర్నింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌లో బేసిక్‌ ఎలిమెంట్స్‌ ఆఫ్‌ డిజైన్, డిజిటల్‌ డిజైన్, ఇంట్రడక్షన్‌ టు డిజైన్‌ థింకింగ్‌ వంటి కోర్సులు ఉన్నాయి. 


-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ బాడీ లాంగ్వేజ్ ఎందుకు ముఖ్యం?

‣ ఇగ్నోలో నాన్‌ టీచింగ్‌ కొలువులు

‣ దిద్దుబాటుతో విజయం తథ్యం!

‣ వాయుసేనలో విశిష్ట ఉద్యోగాలు

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Follow us on Whataapp, Telegram, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 13-12-2023


 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌