• facebook
  • twitter
  • whatsapp
  • telegram

బీటెక్‌తో ఎన్‌టీపీసీలో ఉద్యోగావకాశాలు

ఫిబ్రవరి 8 దరఖాస్తుకు గడువు



న్యూదిల్లీలోని నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌టీపీసీ) 223 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ (ఆపరేషన్స్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన అభ్యర్థులను ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ప్రాతిపదికన నియమిస్తారు. ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు


దరఖాస్తు చేయాలంటే.. బీఈ, బీటెక్‌ (ఎలక్ట్రికల్‌/ మెకానికల్‌ ఇంజినీరింగ్‌) 40 శాతం మార్కులతో పాసవ్వాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు పాసైతే సరిపోతుంది. పవర్‌ ప్లాంట్‌ నిర్వహణలో ఏడాది పని అనుభవం ఉండాలి. అభ్యర్థులను ముందుగా 3 ఏళ్ల కాలానికి ఎంపిక చేస్తారు. అభ్యర్థి పనితీరు, సంస్థ అవసరాలను బట్టి మరో 2 ఏళ్లపాటు పొడిగించే అవకాశం ఉంటుంది. 


మొత్తం 223 ఉద్యోగాల్లో.. అన్‌రిజర్వుడ్‌కు 98, ఈడబ్ల్యూఎస్‌లకు 22, ఓబీసీలకు 40, ఎస్సీలకు 39, ఎస్టీలకు 24 కేటాయించారు. దరఖాస్తు రుసుము రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌-సర్వీసెమెన్, మహిళా అభ్యర్థులు ఫీజు చెల్లించనవసరం లేదు. 


వయసు: 08.02.2024 నాటికి అభ్యర్థుల వయసు 35 సంవత్సరాలు మించకూడదు. గరిష్ఠ వయసులో.. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీలకు 10 ఏళ్లు, ఎక్స్‌ - సర్వీస్‌మెన్‌కు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సడలింపు ఉంటుంది. 


నిర్ణీత వేతనం: నెలకు రూ.55,000. హెచ్‌ఆర్‌ఏ/ కంపెనీ వసతి, రాత్రి విధుల అలవెన్సు, ఉద్యోగికి, కుటుంబ సభ్యులకు వైద్య సదుపాయాలూ వర్తిస్తాయి. 


ఎంపిక: దరఖాస్తుల స్క్రీనింగ్, షార్ట్‌లిస్టింగ్, సెలక్షన్‌ టెస్ట్, ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.  


ఇంటర్వ్యూ సమయంలో ధ్రువపత్రాలను పరిశీలిస్తారు. 


ఎంపికైన అభ్యర్థులకు ఎన్‌టీపీసీకి చెందిన ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షకు ఎలాంటి సడలింపులూ వర్తించవు. 


ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన తర్వాత.. ప్రత్యేక నంబర్‌తో సిస్టమ్‌ జనరేట్‌ చేసిన దరఖాస్తు స్లిప్‌ను అభ్యర్థులు తమ వద్ద భద్రపరుచుకోవాలి. పోస్టులో ఏ డాక్యుమెంటునూ పంపాల్సిన అవసరం లేదు. 


తాజా సమాచారం కోసం అభ్యర్థులు తరచూ ఎన్‌టీపీసీ వెబ్‌సైట్‌ను చూస్తుండాలి. 


ఎంపికైన అభ్యర్థులను ఎన్‌టీపీసీకి చెందిన స్టేషన్లు, యూనిట్లు, అనుబంధ సంస్థల్లో ఎక్కడైనా నియమించే అవకాశం ఉంటుంది. కాబట్టి దేశంలో ఎక్కడైనా పనిచేయడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులే దరఖాస్తు చేయాలి. 


దరఖాస్తుకు చివరి తేదీ: 08.02.2024


వెబ్‌సైట్‌: https://www.ntpc.co.in/
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఆఫర్‌ లెటర్‌ అందుకుంటే సరిపోదు!

‣ ఐటీ కొలువుకు దగ్గరి దారి

‣ సరైన వ్యూహాలతో సవ్యంగా సాధన!

‣ కలల కొలువుకు అయిదు మెట్లు!

‣ సముద్రమంత ఉద్యోగావకాశాలు!

‣ ఐటీ రంగంలో అవరోధాలు అధిగమిద్దాం!

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Whataapp, Telegram, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 31-01-2024 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.