• facebook
  • twitter
  • whatsapp
  • telegram

భర్త ఆటో డ్రైవర్‌.. భార్య పీహెచ్‌డీ

* నేడు ఏఎన్‌యూలో పట్టా అందుకోనున్న మహిళ



తెనాలి టౌన్‌, న్యూస్‌టుడే: భర్త ప్రోత్సాహంతో ఆమె పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఇంజినీరింగ్‌, ఇంటర్‌ చదివే పిల్లల బాగోగులు ఒకవైపు చూసుకుంటూనే తన లక్ష్యాన్ని సాధించారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం పెదరావూరు గ్రామానికి చెందిన ఈపూరి షీల ‘ఆరోగ్య సంరక్షణ రంగంలో సేవల నాణ్యత’ అనే అంశంపై చేసిన పరిశోధనకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి మంగళవారం(ఆగస్టు 29) పీహెచ్‌డీ పట్టా అందుకోనున్నారు. డాక్టర్‌ నంబూరు కిషోర్‌ మార్గదర్శకంలో ఆమె ఇది పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆమె ‘న్యూస్‌టుడే’తో మాట్లాడారు. వివరాలు ఆమె మాటల్లోనే.. ‘నేను డిగ్రీ చదువుతున్న సమయంలో 2003వ సంవత్సరంలో ఆటోడ్రైవర్‌ అయిన కరుణాకర్‌తో వివాహమైంది. చదువుపై నా ఆసక్తిని గమనించిన మా వారు నాటి నుంచి నేటి వరకు నన్ను చదివిస్తూనే ఉన్నారు. మాకు ఇంజినీరింగ్‌ చదువుతున్న బాబు, ఇంటర్‌ చదువుతున్న పాప ఉన్నారు. పిల్లలతో పాటు నన్నూ ఆయన చదివించారు. మా కోసం నిరంతరం కష్టపడ్డారు. నేను ఈ రోజు ఏం సాధించినా అది ఆయన ఘనతే. డిగ్రీ తర్వాత రెగ్యులర్‌ విధానంలో ఎంకామ్‌ చేశాను. తర్వాత దూర విద్యద్వారా ఎంహెచ్‌ఆర్‌ఎమ్‌(పీజీ) పూర్తి చేశా. ఏపీ సెట్ (2016) క్వాలిఫై అయ్యాను. పీహెచ్‌డీ అందుకోవాలన్న ఆశయం ఇప్పుడు నెరవేరింది. ప్రభుత్వ అధ్యాపకురాలు కావాలన్నది నా లక్ష్యం. ప్రస్తుతం తెనాలిలోని వీఎస్‌ఆర్‌ అండ్‌ ఎన్‌వీఆర్‌ కళాశాలలో కామర్స్‌ అధ్యాపకురాలిగా పని చేస్తున్నా’ అని వివరించారు.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఐఐటీల్లో ఉన్నత చదువులకు మార్గం 'జామ్'

‣ బెల్‌లో ఇంజినీరింగ్‌ ఉద్యోగాలు

‣ హెచ్‌పీసీఎల్‌లో 276 కొలువుల భర్తీ

‣ ఒకే వ్యూహంతో రెండు పరీక్షలు!

‣ ఓటమిని తట్టుకున్నారు.. విజేతగా నిలిచారు

Posted Date : 29-08-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.