• facebook
  • twitter
  • whatsapp
  • telegram

హెచ్‌పీసీఎల్‌లో 276 కొలువుల భర్తీ

అర్హత: బీఈ/ బీటెక్‌, పీజీ



హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌) 276 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోస్టును బట్టి బీఈ, బీటెక్, ఎంబీఏ, ఎంఎస్సీ (కెమిస్ట్రీ), లా డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.


మొత్తం పోస్టుల్లో.. 

మెకానికల్‌ ఇంజినీర్‌-57

ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌-16

ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీర్‌-36

సివిల్‌ ఇంజినీర్‌-18

కెమికల్‌ ఇంజినీర్‌-43

సీనియర్‌ ఆఫీసర్‌- సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటెనెన్స్‌-10

సీనియర్‌ ఆఫీసర్‌-ఎల్‌ఎన్‌జీ బిజినెస్‌-2

సీనియర్‌ ఆఫీసర్‌/ అసిస్టెంట్‌ మేనేజర్‌-బయోఫ్యూయల్‌ ప్లాంట్‌ ఆపరేషన్స్‌-1

సీనియర్‌ ఆఫీసర్‌/అసిస్టెంట్‌ మేనేజర్‌-సీబీజీ ప్లాంట్‌ ఆపరేషన్స్‌-1

సీనియర్‌ ఆఫీసర్‌-సేల్స్‌-30

సీనియర్‌ ఆఫీసర్‌/ అసిస్టెంట్‌ మేనేజర్‌ - నాన్‌ ఫ్యూయల్‌ బిజినెస్‌-4

సీనియర్‌ ఆఫీసర్‌-ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్‌ బిజినెస్‌-2

ఫైర్‌ అండ్‌ సేఫ్టీ ఆఫీసర్‌- ముంబయి రిఫైనరీ-2

ఫైర్‌ అండ్‌ సేఫ్టీ ఆఫీసర్‌-విశాఖ రిఫైనరీ-6

క్వాలిటీ కంట్రోల్‌ ఆఫీసర్స్‌-9

ఛార్టర్డ్‌ అకౌంటెంట్స్‌-16

లా ఆఫీసర్స్‌-5

లా ఆఫీసర్స్‌-హెచ్‌ఆర్‌-2

మెడికల్‌ ఆఫీసర్‌-4

జనరల్‌ మేనేజర్‌-1

వెల్ఫేర్‌ ఆఫీసర్‌-1 

ఫిక్స్‌డ్‌ టర్మ్‌ కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన-10 పోస్టులు.. అన్నీ కలిపి 276 కొలువులు.  


ఇంజినీరింగ్‌ పోస్టులకు గరిష్ఠ వయసు 25 సంవత్సరాలు. ఆఫీసర్‌ కేటగిరీ పోస్టులకు 26 నుంచి 29 ఏళ్లు, జనరల్‌ మేనేజర్‌ పోస్టుకు 50 ఏళ్లు. గరిష్ఠ వయసులో ఎస్సీ, ఎస్టీ,  ఎక్స్‌-సర్వీస్‌మెన్‌కు 5 ఏళ్లు, ఓబీసీ (ఎన్‌సీఎల్‌)కి 3 ఏళ్లు,  పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10-15 ఏళ్ల సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు లేదు. మిగిలినవారు ఫీజు రూ.1180 ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించాలి. 


ఎంపిక ఎలా?

అభ్యర్థులను కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్, గ్రూప్‌ టాస్క్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. లా ఆఫీసర్స్, లా ఆఫీసర్స్‌ (హెచ్‌ఆర్‌) పోస్టుల ఎంపికకు మూట్‌కోర్ట్‌ను నిర్వహిస్తారు. ఆన్‌లైన్‌ దరఖాస్తుల ఆధారంగా.. తగిన విద్యార్హతలున్న అభ్యర్థులను ఎంపిక చేసి వారికి కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) నిర్వహిస్తారు. 


సీబీటీలో ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటాయి. ప్రశ్నపత్రంలో పార్ట్‌-1, పార్ట్‌-2 ఉంటాయి. పార్ట్‌-1 జనరల్‌ ఆప్టిట్యూడ్‌లో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ అండ్‌ ఇంటలెక్చువల్‌ పొటెన్షియల్‌ టెస్ట్‌ (లాజికల్‌ రీజనింగ్‌ అండ్‌ డేటా ఇంటర్‌ప్రెటేషన్‌) ఉంటాయి. పార్ట్‌-2లో టెక్నికల్‌/ ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌కు సంబంధించిన.. ఇంజినీరింగ్‌లో చదివిన సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఇస్తారు. అభ్యర్థులు కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్, గ్రూప్‌ టాస్క్, పర్సనల్‌ ఇంటర్వ్యూ లాంటి ప్రతి సెక్షన్‌లోనూ అర్హత మార్కులు సాధించాలి. అన్ని సెక్షన్‌లలోనూ అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను కేటగిరీలవారీగా తయారుచేస్తారు. కొన్ని పోస్టులకు కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్, గ్రూప్‌ టెస్ట్, మూట్‌ కోర్ట్‌ (లా ఆఫీసర్లకు మాత్రమే), పర్సనల్‌/ టెక్నికల్‌ ఇంటర్వ్యూలు, పని అనుభవం ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ సిలబస్‌ను వెబ్‌సైట్‌లో త్వరలోనే అభ్యర్థులకు అందుబాటులో ఉంచుతారు. అన్ని స్టేజిల్లోనూ అర్హత సాధించిన అభ్యర్థుల తుది జాబితాను తయారుచేసి వారికి ప్రీ ఎంప్లాయ్‌మెంట్‌ మెడికల్‌ ఎగ్జామినేషన్‌ నిర్వహించి.. చివరగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఏడాదిపాటు ప్రొబేెషన్‌ పీరియడ్‌ ఉంటుంది. 


గమనించాల్సినవి  

అభ్యర్థులు ఒక్క దరఖాస్తును మాత్రమే పంపాలి. ఒకటికంటే ఎక్కువ పంపితే చివరగా పంపినదాన్నే పరిగణనలోకి తీసుకుంటారు.  

అడ్మిట్‌కార్డ్‌ను సంస్థ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. దీన్ని పోస్ట్‌లో పంపరు.

కోర్సు చివరి ఏడాది చదువుతోన్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేయొచ్చు. అయితే నియామక తేదీ నాటికి కోర్సు పాసై, సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోవాలి. 

కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌కు హాజరయ్యే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు స్లీపర్‌క్లాస్‌ ట్రెయిన్‌ ఛార్జీలు, ఇంటర్వ్యూకు హాజరయ్యే అన్ని వర్గాల అభ్యర్థులకూ థర్డ్‌ ఏసీ ఛార్జీలు చెల్లిస్తారు. 


సన్నద్ధత 

ప్రశ్నపత్రం పార్ట్‌-1 జనరల్‌ ఆప్టిట్యూడ్‌లో భాగంగా.. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ అండ్‌ ఇంటలెక్చువల్‌ పొటెన్షియల్‌ టెస్ట్‌ (లాజికల్‌ రీజనింగ్‌ అండ్‌ డేటా ఇంటర్‌ప్రెటేషన్‌) ఉంటాయి. 

వెబ్‌సైట్‌ పేర్కొన్న సిలబస్‌ను జాగ్రత్తగా గమనించి సాధన చేయాలి. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌కు సంబంధించి ప్రాథమికాంశాలపై దృష్టి పెట్టాలి. 

గత ప్రశ్నపత్రాలను గమనించి.. విభాగాలు, అంశాలవారీగా ఏ ప్రశ్నలు వస్తున్నాయో పరిశీలించాలి. తదనుగుణంగా సన్నద్ధతను కొనసాగించాలి. 

జనరల్‌ ఆప్టిట్యూడ్‌కు సంబంధించి బ్యాంక్, రైల్వేల ప్రశ్నపత్రాలను కూడా సాధన చేయొచ్చు. పాత ప్రశ్నపత్రాలను నిర్ణీత సమయంలోగా పూర్తిచేసేలా చూడాలి. వెనకబడిన విభాగాలకు అదనపు సమయం కేటాయించి.. తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 

పార్ట్‌-2లో ఇంజినీరింగ్‌ సబ్జెక్టుల నుంచే ప్రశ్నలు వస్తాయి. ఇవన్నీ గతంలో చదివినవేనని నిర్లక్ష్యం చేయకుండా.. శ్రద్ధగా రివిజన్‌ చేసుకుని సబ్జెక్టుల మీద గట్టిపట్టు సంపాదించాలి.  


దరఖాస్తుకు చివరితేదీ: 18.09.2023


వెబ్‌సైట్‌: https://www.hindustanpetroleum.com/careers
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఒకే వ్యూహంతో రెండు పరీక్షలు!

‣ ఓటమిని తట్టుకున్నారు.. విజేతగా నిలిచారు

‣ వర్చువల్‌ ఇంటర్వ్యూలో విజయం సాధించాలంటే?

‣ విదేశీ భాషలు.. అదనంగా ప్రయోజనాలు

‣ 18 ఎయిమ్స్‌లలో నర్సింగ్‌ ఆఫీసర్లు

‣ పరీక్షల్లో విజయానికి మెలకువలు

Posted Date : 22-08-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌