• facebook
  • twitter
  • whatsapp
  • telegram

అర్థం చేసుకుంటూ చ‌దివితే..!

ఒక్కోసారి చదవాల్సినవి ఎన్నో ఉన్నా.. సమయం మాత్రం తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు గబగబా చదివేస్తూ ముందుకు వెళ్లిపోతాం. ఆ తర్వాతే అసలు సమస్య మొదలవుతుంది. చదివినవేవీ సరిగా అర్థం కావు. అలా కాకుండా ఉండాలంటే...

చదవడం అంటే.. పదాలను ఉచ్చరించడం కాదు. వాటి ద్వారా వెల్లడించిన ఆలోచనలను అర్థంచేసుకోవడం. కాబట్టి నిదానంగా చదవడానికే ప్రాధాన్యమివ్వాలి. 

తెలియని పదాలకు అప్పటికప్పుడే అర్థాన్ని తెలుసుకోవాలి. ఇలా చేయడం వల్ల పదసంపద పెరుగుతుంది. కొత్తగా నేర్చుకున్న పదాలను సందర్భానుసారం ఉపయోగించగలుగుతారు. 

వ్యాసం లేదా పాఠం ఏదైనాసరే.. దానికో ప్రధానోద్దేశం ఉంటుంది. ముందుగా అదేమిటనేది గ్రహించాలి. ఆ ఉద్దేశాన్ని తెలియజేసే విశ్లేషణా, ఉదాహరణలూ కూడా ఉంటాయి. వాటిని అర్థంచేసుకుంటే ముఖ్యోద్దేశాన్ని సులువుగా గ్రహించవచ్చు. 

చదివిన అంశాన్ని సంక్షిప్తీకరించుకుంటే బాగా గుర్తుంటుంది. లేకపోతే అవగాహన లోపంతో మళ్లీ మళ్లీ చదవాల్సి రావచ్చు. 

ఒక్కోసారి కొన్ని పదాలు తికమక పెడుతుంటాయి. సమయానికి డిక్షనరీ కూడా అందుబాటులో లేకపోవచ్చు. అలాంటప్పుడు ఆ తర్వాతి వాక్యాలను చదివితే సారాంశం అర్థమవుతుంది.  

విషయాన్ని గ్రహించే సామర్థ్యం పెరగాలంటే ఎక్కువగా చదవాలి. పాఠ్యపుస్తకాలే కాకుండా ఇతర పుస్తకాలనూ చదవడం అలవాటు చేసుకోవాలి. దీంతో మీ ఆలోచనా పరిధీ విస్తృతమవుతుంది. 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మెయిన్‌లో మెరిసేందుకు మ‌రో అవ‌కాశం!

‣ ప్రావీణ్యం పెంచే వృత్తి విద్య

‣ దేశ రాజ‌ధానిలో కానిస్టేబుల్ ఉద్యోగాలు

‣ విశ్వాసం ఉంటే విలువ త‌గ్గ‌దు!

‣ కొలువుల‌కు కొర‌త లేదు

‣ కాలేజీలో చేరేముందు కాస్త ప‌రిశీలించండి!

Posted Date : 15-07-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌